November 17, 2026

దమ్ముంటే  ప్రభుత్వ ఉద్యోగులను  సస్పెండ్ చేయండి 

  • తెలంగాణ కు నవంబర్ 17 ను బ్లాక్ డే గా మార్చారు
  • కాంగ్రెస్ నేతల మోసాలకు వేరే దేశాలోనైతే ఉరి వేసేవారు
  • అశోక్ నగర్ లైబ్రరీ కి వెళ్లి రాహుల్ నిరుద్యోగులతో కలిసి ఎందుకు చాయ్ తాగలేదు?
  • మాజీ మంత్రి జి .జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన వాటి కన్నా రెండింతలు, మూడింతలు ఎక్కువ చేస్తామని చెప్పారు.స్వర్గమే ఇక్కడికి తెస్తామన్నారు. 420 హామీలు గ్యారంటీలు డిక్లరేషన్లతో కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టారు. అఫిడవిట్లు ,బాండ్ పేపర్లు ఇచ్చి మరీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తులం బంగారం ఇస్తామని ఫించన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల సభల్లో ఊదర గొట్టారు. ఆటో డ్రైవర్లను , విద్యార్థులను రకరకాల హామీలతో మోసం చేశారు

కాంగ్రెస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిందే. మూడేళ్ల క్రితం ఇదే రోజు నవంబర్ 17 న కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేశారు. తెలంగాణ కు నవంబర్ 17 ను బ్లాక్ డే గా మార్చారు. మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కు మంచి నీటి సమస్య లేదని ఒకడు, పంటలు వేసుకువద్దని ఇంకొకడు మాట్లాడుతారు. అభయ హస్తం భస్మాసుర హస్తం గా మారింది. భస్మాసుర హస్తం గా మారిన కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపి చెత్తబుట్టలో వేస్తున్నాం. కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సమ్మక్క సారక్క బ్యారేజ్ కు అనుమతి కోసం సీఎం రేవంత్ ,ఉత్తమ్ ఇపుడు ఛత్తీస్ ఘడ్ కు వెళ్తున్నారు. ఉత్తమ్ కు ఒక్కడికే హైదరాబాద్లో నీళ్ల కొరత లేదని అనిపితున్నట్టుంది. ప్రజల దగ్గరికి వెళితే తెలుస్తుంది. చంద్రబాబు కు దక్షిణ గా గోదావరి కృష్ణా జలాలు తరలించారనేది నూటికి నూరు పాళ్ళు నిజం.

కాంగ్రెస్ నేతల మోసాలకు వేరే దేశాలోనైతే ఉరి వేసేవారు. రాహుల్ గాంధీ మొన్ననే హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా ? అశోక్ నగర్ లైబ్రరీ కి వెళ్లి రాహుల్ నిరుద్యోగులతో కలిసి ఎందుకు చాయ్ తాగలేదు ? సెలవు పెడితే ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని బెదిరిస్తారా ? దమ్ముంటే సస్పెండ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేస్తారు.

750 టీఎంసీ ల గోదావరి నీళ్లను ఏపీ కి తరలించారు. 250 టీఎంసీల కృష్ణా నీళ్లను ఏపీ కి ధారాదత్తం చేశారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు . దమ్ముంటే జీతం కట్ చేయమనండి. సీ పీ ఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు బీ ఆర్ ఎస్ అండగా ఉంటుంది. కే టీ ఆర్ సభలు పెట్టింపుడల్లా ప్రభుత్వం హడావుడి చేసి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది.

ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు ,భూపాల్ రెడ్డి ,మెతుకు ఆనంద్ ,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Total Visitors: 3,461,845