ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ద్రవ్యోల్బణం

- దుష్పరిపాలనకు భారీ మూల్యం
- రాజకీయ ఉదాసీనత.. అధికార యంత్రాంగ వైఫల్యం
- సామాన్యుడి కొనుగోలు శక్తికి విఘాతం
- దేశంలోనే అగ్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌కు అవాంఛనీయ రికార్డు
దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక అవాంఛనీయమైన రికార్డును సొంతం చేసుకుంది. 2026 అక్టోబర్‌లో రాష్ట్ర ఆహార ద్రవ్యోల్బణం 13.23 శాతానికి చేరింది. జాతీయ సగటు 8.94 శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ దానిని ఏకంగా 4.29 శాతం పాయింట్ల మేర అధిగమించి దేశంలోనే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా నిలిచింది. తమిళనాడు 12.37 శాతం, కర్ణాటక 12.16 శాతం, తెలంగాణ 11.66 శాతం, కేరళ 10.92 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి.
సెప్టెంబరులో 10.2 శాతంగా ఉన్న రాష్ట్ర ఆహార ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కేవలం గణాంకపరమైన అసాధారణ పరిణామం కాదు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ, పాలనా సన్నద్ధత, ప్రజల కొనుగోలు శక్తిని పరిరక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యం వంటి మౌలిక అంశాలపై ఇది అనేక ప్రశ్నలను సంధిస్తోంది. రాష్ట్ర సమగ్ర రిటైల్ ద్రవ్యోల్బణం 7.25 శాతంగా ఉన్నప్పటికీ, ఆహార ధరల పెరుగుదల అసమానంగా అధికంగా ఉండటం, తమ ఆదాయంలో అధిక భాగాన్ని నిత్యావసరాలకే వెచ్చించే కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని అసలైన భారాన్ని సామాన్యుడి క్షీణిస్తున్న కొనుగోలు శక్తిలోనే అంచనా వేయాలి.
వంటింటిపై ధరల దండయాత్ర
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తోంది. మూడు నెలల క్రితం కిలో సన్నబియ్యం సుమారు రూ.70 ఉండగా, ప్రస్తుతం కొన్ని మార్కెట్లలో రూ.90 దాటింది. కందిపప్పు కిలో రూ.180 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. వంటనూనెల ధరలు సుమారు 25 శాతం పెరిగాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 దాటింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది.
ఈ ధరల సెగ గృహాలకే పరిమితం కావడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే అల్పాహార కేంద్రాలు ముడిసరుకుల వ్యయభారం తట్టుకోలేక తమ మెనూ ధరలను 10 నుంచి 20 శాతం వరకు పెంచుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత, పింఛనుదారులు, రోజువారీ కూలీలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ పరిణామంతో తీవ్రంగా సతమతమవుతున్నాయి.
ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన భోజనం సైతం ఆర్థిక భారంగా పరిణమిస్తే, ద్రవ్యోల్బణం గణాంకాలకే పరిమితమైన అంశం కాదు; అది సామాన్యుడి జీవన పోరాటంగా మారుతుంది.న్నాయి.
పెట్రోలియం ఉత్పత్తులు, రవాణా వ్యయాలు, ఎరువుల ధరలు, అంతర్జాతీయ సరుకుల సరఫరాపై ఈ పరిణామాల ప్రభావం పడుతోంది. దిగుమతి చేసుకునే ఇంధనంపై భారతదేశానికి ఉన్న అధిక ఆధారపడటం బాహ్య ఆర్థిక సంక్షోభాలకు మన ఆర్థిక వ్యవస్థను మరింత సున్నితంగా మారుస్తోంది. వాతావరణ అనిశ్చితులు, సరఫరా వ్యవస్థల్లో అవరోధాలు వ్యవసాయ ఉత్పత్తి, పంపిణీని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
అయితే అంతర్జాతీయ పరిణామాలను దేశీయ పాలనా లోపాలకు సర్వరోగ నివారిణిగా చూపడం సమంజసం కాదు. ప్రపంచ మార్కెట్లలో తలెత్తే ధరల ఒత్తిడి స్థానిక వినియోగదారుడిపై ఎంత మేరకు పడుతుందన్నది ప్రభుత్వ సేకరణ విధానం, నిల్వ సామర్థ్యం, రవాణా వ్యవస్థ, పంపిణీ యంత్రాంగం, మార్కెట్ నియంత్రణ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.
అనివార్యమైన అంతర్జాతీయ ప్రతికూలతలకు, నివారించగల దేశీయ వైఫల్యాలకు మధ్య తేడాను గుర్తించి ప్రభుత్వం స్పందించాలి. ఆర్థిక సంక్షోభాలు సంభవించిన తరువాత మేల్కొనడం కాకుండా, వాటిని ముందుగానే అంచనా వేసి ప్రజలపై వాటి ప్రభావాన్ని తగ్గించడం సమర్థ పాలనకు గీటురాయి.
పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక ప్రగతి ప్రభుత్వ రాజకీయ కార్యాచరణలో ప్రధానాంశాలుగా నిలిచాయి.
అయితే అభివృద్ధి విశ్వసనీయతను నిర్ణయించేది ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చే వాస్తవమైన మార్పులే. పెట్టుబడుల ఒప్పందాలు, పారిశ్రామిక ప్రతిపాదనలు, భారీ మౌలిక సదుపాయాల ప్రకటనలు ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు భద్రమైన ఉపాధిని కల్పించలేవు.
జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఇంత అధికంగా ఎందుకు నమోదవుతోంది? దీనికి దారితీసిన ఆర్థిక, సంస్థాగత లోపాలేమిటి? వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాత్మక చర్యలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు ప్రభుత్వానికి బాధ్యతల నుంచి మినహాయింపు పత్రం కాదు. రాజకీయ ప్రకటనలతో కాకుండా, సాధించిన ఫలితాలతోనే పాలనను అంచనా వేయాలి.
అధికార యంత్రాంగం – జవాబుదారీతనం ఎక్కడ?
ధరల నియంత్రణ, సరుకుల లభ్యత, పంపిణీ వ్యవస్థల పర్యవేక్షణలో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, జిల్లా యంత్రాంగాలకు కీలకమైన బాధ్యత ఉంది.
మార్కెట్ పరిణామాలపై ముందస్తు సమాచారం లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం, సకాలంలో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలు ద్రవ్యోల్బణ తీవ్రతను పెంచగలవు.
ఆర్థిక సంక్షోభాలు సంభవించిన తరువాత మేల్కొనడం కాకుండా, వాటిని ముందుగానే అంచనా వేసి ప్రజలపై వాటి ప్రభావాన్ని తగ్గించడం సమర్థ పాలనకు గీటురాయి.
రాజకీయ వాగ్దానాలు – పాలనా లోటుపాట్లు
తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం – జనసేన, బీజేపీల భాగస్వామ్యంతో – వేగవంతమైన అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక ప్రగతి ప్రభుత్వ రాజకీయ కార్యాచరణలో ప్రధానాంశాలుగా నిలిచాయి.
అయితే అభివృద్ధి విశ్వసనీయతను నిర్ణయించేది ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చే వాస్తవమైన మార్పులే. పెట్టుబడుల ఒప్పందాలు, పారిశ్రామిక ప్రతిపాదనలు, భారీ మౌలిక సదుపాయాల ప్రకటనలు ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు భద్రమైన ఉపాధిని కల్పించలేవు.
జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఇంత అధికంగా ఎందుకు నమోదవుతోంది? దీనికి దారితీసిన ఆర్థిక, సంస్థాగత లోపాలేమిటి? వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాత్మక చర్యలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు ప్రభుత్వానికి బాధ్యతల నుంచి మినహాయింపు పత్రం కాదు. రాజకీయ ప్రకటనలతో కాకుండా, సాధించిన ఫలితాలతోనే పాలనను అంచనా వేయాలి.
అధికార యంత్రాంగం – జవాబుదారీతనం ఎక్కడ?
ధరల నియంత్రణ, సరుకుల లభ్యత, పంపిణీ వ్యవస్థల పర్యవేక్షణలో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, జిల్లా యంత్రాంగాలకు కీలకమైన బాధ్యత ఉంది.
మార్కెట్ పరిణామాలపై ముందస్తు సమాచారం లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం, సకాలంలో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలు ద్రవ్యోల్బణ తీవ్రతను పెంచగలవు. టోకు, చిల్లర ధరల మధ్య వ్యత్యాసాలు, ప్రభుత్వ కొనుగోళ్ల అవసరాలు, గిడ్డంగుల సామర్థ్యం, సరఫరా వ్యవస్థలోని అడ్డంకులపై నిరంతర సమీక్ష అత్యవసరం.
జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు నిర్వహించిన సమీక్షా సమావేశాల సంఖ్యతో కాకుండా, క్షేత్రస్థాయిలో సాధించిన ఫలితాలతో వారి పనితీరును అంచనా వేయాలి. ప్రజలు ధరల భారంతో అల్లాడుతుంటే అధికార యంత్రాంగం ఫైళ్లు, ప్రోటోకాల్, విధివిధానాలకే పరిమితమై ఉండటం సమర్థనీయం కాదు.
రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేయాలి. అధికార యంత్రాంగం ఆ విధానాలను ఆచరణలోకి తీసుకురావాలి. జవాబుదారీతనం అనేది పరిపాలనకు అలంకారప్రాయమైన అంశం కాదు; సమర్థ పాలనకు పునాది.
అవినీతి – అసమర్థతకు అదనపు భారం
అవినీతి ఎక్కడ నిరూపితమైనా అది ప్రజలను, రైతులను పరిరక్షించాల్సిన ప్రభుత్వ సామర్థ్యాన్ని మరింత బలహీనపరుస్తుంది. పారదర్శకత లేని సేకరణ ప్రక్రియలు, రవాణా, గిడ్డంగుల నిర్వహణలో అక్రమాలు, సబ్సిడీ సరుకుల మళ్లింపు, ఎంపిక చేసిన వారికి అనుకూలంగా జరిగే తనిఖీలు పంపిణీ వ్యవస్థను దెబ్బతీసి వ్యయ భారాన్ని పెంచుతాయి.
ప్రజా కొనుగోళ్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థలు పారదర్శక విధానాలు, స్వతంత్ర పర్యవేక్షణ, సమర్థవంతమైన అంతర్గత నియంత్రణలకు లోబడి ఉండాలి.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) వెలువరించే ఆడిట్ అభ్యంతరాలపై శాసనసభ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ద్రవ్యోల్బణానికి మొత్తం అవినీతే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసం కాదో, అవినీతి, అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యం ఆర్థిక సమస్యలను మరింత జటిలం చేస్తాయన్న వాస్తవాన్ని విస్మరించడం కూడా అంతే తప్పు.
ప్రజాధనం ప్రజా సంక్షేమానికే వినియోగించాలి. పారదర్శకతకు జవాబుదారీతనం తోడైనప్పుడే పరిపాలనకు విశ్వసనీయత లభిస్తుంది.
వ్యవసాయం – ఉత్పత్తిదారుడు, వినియోగదారుడి మధ్య వైరుధ్యం
సారవంతమైన నదీ పరీవాహక ప్రాంతాలు, విస్తృతమైన సాగు భూములు, ఉద్యాన పంటలు, సుదీర్ఘ తీరప్రాంతం వంటి విశేష వనరులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. అయినప్పటికీ రైతులు పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, సేకరణలో సమస్యలు, నిల్వ సదుపాయాల, మరోవైపు వినియోగదారులు అదే వ్యవసాయ ఉత్పత్తులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతుకు తగిన ప్రతిఫలం దక్కకపోవడం, వినియోగదారుడికి అందుబాటు ధరలో సరుకులు లభించకపోవడం వ్యవసాయ మార్కెటింగ్, పంపిణీ వ్యవస్థల్లోని నిర్మాణాత్మక లోపాలను బహిర్గతం చేస్తోంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), శీతల గిడ్డంగులు, శాస్త్రీయ నిల్వ సదుపాయాలు, ప్రత్యక్ష మార్కెటింగ్ వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. పంటల సేకరణ సకాలంలో జరగాలి. చెల్లింపుల్లో పారదర్శకత ఉండాలి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలి.
ఉత్పత్తిదారుడు నష్టపోతూ, వినియోగదారుడు అధిక ధర చెల్లించే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతమైనదిగా పరిగణించలేం. సరఫరా వ్యవస్థలోని ఇరువర్గాల ప్రయోజనాలను సమతుల్యం చేసే విధానం అవసరం.
గ్రామీణ సంక్షోభం – ఉపాధి అనిశ్చితి
గ్రామీణ కుటుంబాలు ఒకవైపు పెరుగుతున్న ఆహార ధరలు, మరోవైపు అనిశ్చిత ఆదాయాలతో ద్వంద్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ యంత్రాలపై అధిక వ్యయాన్ని భరించాల్సి వస్తుండగా, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు స్థిరమైన ఉపాధి, తగిన సామాజిక భద్రత కొరవడుతున్నాయి.
సహకార చక్కెర కర్మాగారాలు, జనపనార పరిశ్రమలు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా సమగ్ర పరిశీలనకు అర్హమైనవి.
పారిశ్రామిక అనిశ్చితి, ఉద్యోగాల కోత ప్రత్యక్ష కార్మికులకే కాకుండా అనుబంధ పరిశ్రమలు, రవాణా రంగం, చిన్న వ్యాపారాలు, వాటిపై ఆధారపడిన కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
అందువల్ల ఆహార ద్రవ్యోల్బణాన్ని ఉపాధి కల్పన, పారిశ్రామిక పునరుజ్జీవనం, గ్రామీణ కొనుగోలు శక్తి నుంచి వేరు చేసి చూడలేం. ఆదాయ భద్రత లేకుండా ధరలు పెరగడం బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది.
ప్రకటనలు కాదు – కార్యాచరణతో కూడిన విధానం కావాలి
ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం అప్పటికప్పుడు ప్రకటించే ఉపశమన చర్యలకు పరిమితం కాకుండా, సమన్వయంతో కూడిన కాలపరిమితి ఉన్న కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి.
సమగ్ర ధరల పర్యవేక్షణ: రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ధరల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, జిల్లాలవారీగా టోకు, చిల్లర ధరలను ప్రతిరోజూ నమోదు చేయాలి. నిత్యావసరాల కొరతను ముందుగానే గుర్తించే హెచ్చరిక వ్యవస్థను రూపొందించాలి.
- ప్రభుత్వ సేకరణ – నిల్వ సామర్థ్యం: పంటల సేకరణను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా చేపట్టి, శాస్త్రీయ గిడ్డంగులు, వికేంద్రీకృత నిల్వ కేంద్రాలను బలోపేతం చేయాలి. ధరల్లో అసాధారణ పెరుగుదల లేదా కొరత ఏర్పడినప్పుడు బఫర్ నిల్వలను తక్షణమే మార్కెట్‌లోకి విడుదల చేయాలి.
- ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం: రేషన్ దుకాణాలు, రైతుబజార్లు, సబ్సిడీ విక్రయ కేంద్రాల ద్వారా బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలను నిరంతరాయంగా అందించాలి. సరుకుల మళ్లింపును అరికట్టి, అర్హులైన లబ్ధిదారులకు వాటిని చేరవేయాలి.
- వ్యవసాయ మార్కెట్ సంస్కరణలు: రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ప్రత్యక్ష మార్కెటింగ్ వ్యవస్థలను విస్తరించాలి. అనవసర మధ్యవర్తిత్వాన్ని తగ్గిస్తూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.
- మార్కెట్ అక్రమాలపై కఠిన చర్యలు: కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, కుమ్మక్కు వ్యాపార పద్ధతులపై ఆధారాలతో తనిఖీలు నిర్వహించాలి. నిరూపితమైన అక్రమాలకు పాల్పడిన వారిపై నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. రాజకీయ జోక్యానికి తావులేని అమలు వ్యవస్థ ఉండాలి
అధికారుల జవాబుదారీతనం: ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, ధరల పెరుగుదల, సరఫరా లోపాలు, జిల్లాల పనితీరును సమీక్షించాలి. గుర్తించిన లోపాలకు బాధ్యులను నిర్ధారించి, తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు వెల్లడించాలి. - బలహీన వర్గాలకు రక్షణ: విద్యార్థులు, పింఛనుదారులు, వ్యవసాయ కూలీలు, అల్పాదాయ కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఆహార సరుకులు అందించాలి. అన్న క్యాంటీన్లు, సబ్సిడీ విక్రయ కేంద్రాలు తగిన నిల్వలతో, పారదర్శక అర్హత ప్రమాణాలతో పనిచేసేలా చూడాలి.
- ఆర్థిక, కొనుగోళ్ల పారదర్శకత: ప్రభుత్వ సేకరణ, గిడ్డంగుల ఒప్పందాలు, రవాణా వ్యయాలు, సబ్సిడీ పంపిణీ వ్యవస్థలను నిరంతర ఆడిట్, స్వతంత్ర పర్యవేక్షణకు లోబరచాలి.
ఈ చర్యలకు నిర్దిష్ట కాలపరిమితులు, కొలవగల లక్ష్యాలు, ప్రజలకు అందుబాటులో ఉండే పనితీరు నివేదికలు జత కావాలి. అప్పుడప్పుడు జరిగే సమీక్షా సమావేశాలు, తాత్కాలిక ధరల నియంత్రణ ప్రకటనలతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేం. దీనికి సంస్థాగత సమన్వయం, ఆర్థిక క్రమశిక్షణ, నిరంతర రాజకీయ సంకల్పం అవసరం. - మండగిరి శివప్రసాద్
( రిటైర్డ్ ఐపిఎస్)
