November 17, 2026

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ముమ్మాటికీ దేశ ద్రేహులే

  • విదేశీ నేత‌చే మ‌న దేశాన్ని తిట్టించిన ఈ దుర్మార్గ‌పు చ‌ర్య వెన‌కున్న మాస్ట‌ర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డినే
  • ఇటలీ నేత‌ ఫిలిబెక్ మాట్లాడిన అంశాల స్క్రిప్టు రైట‌ర్ కూడా సీఎం రేవంత్ రెడ్డినే
  • రాహుల్ గాంధీ అస‌లు రాజ‌కీయాల‌కు ప‌నికిరా డు
  • భార‌త్ వ్య‌తిరేక స‌మ్మిట్ నిర్వ‌హించినందుకు రేవంత్ , రాహుల్ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
  • స్వాగ‌తించిన స‌ద‌స్సు నిర్వాహ‌కుల‌పై దేశ‌ద్రోహ కేసులు పెట్టాలి
  • బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్‌: నవంబర్ 13, 14 తేదీల్లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’ వేదికపై యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ (PES) సెక్రటరీ జనరల్, ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ ‘‘ఓట్ చోర్ – గద్దీ చోడ్’’ అంటూ నినాదాలు చేయడం మ‌న భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారానికి, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే చ‌ర్య‌నే.

ఒక విదేశీ నేత‌చే మ‌న దేశాన్ని తిట్టించిన ఈ దుర్మార్గ‌పు చ‌ర్య వెన‌కున్న మాస్ట‌ర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డినే. ఇటలీ నేత‌ ఫిలిబెక్ మాట్లాడిన అంశాల స్క్రిప్టు రైట‌ర్ కూడా సీఎం రేవంత్ రెడ్డినే. ప్ర‌పంచ దేశాల్లో భార‌త ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర‌ల‌కు పాల్ప‌డిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ముమ్మాటికీ దేశ ద్రేహులే.

ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీ, త‌న అమ్మ సోనియా పుట్టిన దేశ‌మైన ఇట‌లీ నుంచి ఒక ప‌నికిమాలిన నేత‌ను పిలిపించి, తనను ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఎన్నుకున్న వ్య‌వ‌స్ధ‌ను దూషించేలా మాట్లాడించ‌డం సిగ్గుచేటు. వ‌రుస‌గా మూడు లోక‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెసు ఓట‌మి పాల‌వ‌డం, రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు గెల‌వ‌లేక‌పోవ‌డంతో పూర్తిగా ఫ్ర‌స్టేష‌నుకు గురైన రాహుల్ గాంధీ మ‌తి స్ధిమితం కోల్పోయి, సొంత దేశానికే వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒక విదేశీ నేత మ‌న దేశాన్ని దూషిస్తుంటే, ప‌క్క‌నే ఉన్న‌ రాహుల్ గాంధీ వారించాల్సింది పోయి చ‌ప్ప‌ట్లు కొట్టి ప్రోత్స‌హించ‌డం ముమ్మాటీకి దేశ వ్య‌తిరేక చ‌ర్య‌నే. ఇలాంటి మ‌తిలేని చ‌ర్య‌తో రాహుల్ గాంధీ అస‌లు రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని నిరూపిత‌మైంది.

భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీయుల జోక్యాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందనడానికి, ఆ పార్టీ నిర్వ‌హించిన ‘భారత్ సమ్మిట్ 2026’ నిద‌ర్శ‌నం. భారత ఎన్నికల సంఘం పనితీరును, ప్రజా తీర్పును ఒక విదేశీ నాయకుడు భారత గడ్డపై నుంచే హేళన చేస్తుంటే అడ్డుకోకుండా స్వాగ‌తించిన స‌ద‌స్సు నిర్వాహ‌కుల‌పై దేశ‌ద్రోహ కేసులు పెట్టాలి. విదేశీ శక్తుల సహకారంతో దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు సదస్సు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, లోక‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ చర్యలు ‘దేశద్రోహం’ కిందకే వస్తాయి.

ఇటలీ నేత‌ జియాకోమో ఫిలిబెక్ ‘కాన్ఫరెన్స్ వీసా’పై భారత్‌కు వచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్య‌లు చేసారు. ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఆయన వీసా రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించాలని , భవిష్యత్తులో భారత్‌లోకి రాకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని ఇప్ప‌టికే రాంచంద‌ర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఎల్ నినో ప్ర‌భావంతో తెలంగాణలో క‌రువు తాండ‌వం చేస్తుంటే, పంట‌లు ఎండిపోయి న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వ‌కుండా ముఖం చాటేసిన సీఎం రేవంత్ రెడ్డి, త‌న సీఎం సీటును కాపాడుకోవ‌డానికి, రాహుల్ గాంధీ మెప్పు పొంద‌డానికి ఈ సదస్సు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ముమ్మాటికీ అధికార దుర్వినియోగ‌మే. నిధుల దుర్వినియోగ‌మే.

ప్ర‌జావ‌స‌రాల గురించి ప‌ట్టింపులేని సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అన‌ర్హుడు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, త‌న బాధ్య‌త‌ను విస్మ‌రించి రాహుల్ గాంధీకి గులాం గిరి చేస్తున్నారు. రోజు రోజుకూ ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అవుతున్న రాహుల్ గాంధీకి ఎలాగైన ఇమేజ్ పెంచే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌నే అజెండాతోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తో భార‌త్ స‌మ్మిట్ ను నిర్వ‌హించారు. కానీ అక్క‌డ జ‌రిగింది ‘రాహుల్ రీలాంచ్ ఈవెంట్’ అని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి.

రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇప్పటి వ‌ర‌కు రెండు సార్లు రూ.వంద కోట్ల చొప్పున‌ భార‌త్ స‌మ్మిట్ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించిన సీఎం రేవంత్ రెడ్డి 2024 లోక‌స‌భ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత గ‌త మూడేళ్ల‌లో వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాహుల్ గాంధీకి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఇప్ప‌టి వ‌ర‌కు రూ.మూడు వేల కోట్లు ముట్ట‌జెప్పార‌ని కాంగ్రెసు నేత‌లే మాట్లాడుకుంటున్నారు.

అస‌లు అది భార‌త్ స‌మ్మిట్ కాదు, ‘యాంటీ-భారత్ సమ్మిట్’, ‘భారత్ వ్యతిరేక సదస్సు’. గ‌త కొంత కాలంగా కాంగ్రెసు పార్టీ, భార‌త వ్య‌తిరేక‌ విదేశీ శ‌క్తుల‌కు తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులతో నడిచే సంస్థలకు ‘టూల్‌కిట్’ గా కాంగ్రెసు వ్య‌వ‌హ‌రిస్తూ, భార‌త్ స‌మ్మిట్ లాంటి స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తూ, భార‌త వ్య‌తిరేక విదేశీ నేత‌ల‌చే మాట్లాడిస్తూ, దేశంలో అస్ధిర‌తను సృష్టించే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంది.

తాము నిర్వ‌హించిన భార‌త్ స‌మ్మిట్ లో ఇటలీ నేత‌ జియాకోమో ఫిలిబెక్ చేసిన దేశ వ్య‌తిరేక వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి, లోక‌స‌భలో ప్ర‌తిపక్ష నేత రాహుల్ గాంధీ ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలి. జ‌రిగిన భారీ త‌ప్పిదానికి దేశ ప్ర‌జ‌ల‌కు వారిద్ద‌రు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.

‘కాన్ఫరెన్స్ వీసా’పై భారత్‌కు వచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్య‌లు చేసిన ఇట‌లీ నేత ఫిలిబెక్, ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఆయన వీసా రద్దు చేసి, దేశం నుంచి బహిష్క రించాలని , భవిష్యత్తులో భారత్‌లోకి రాకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని ఇప్ప‌టికే రాంచంద‌ర్ రావు ఫిర్యాదుపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలి. ఇట‌లీ నేత ఫిలిబెక్ పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సంబంధిత‌ కేంద్ర ప్ర‌భుత్వ సంస్ధ‌ల‌కు కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖ‌లు రాయాలి.

Total Visitors: 3,461,851