హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను కొలీజియం సిఫారసు మేరకు నియమించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయన ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. బదిలీపై తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌ఘఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించారు.