Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమానికే ప్రజలు ఓటు వేశారు

– రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ కి తిరుగులేదు
– నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తున్న జగన్
– మాజీ మంత్రి శిద్దా రాఘవరావు
రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటు వేశారని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రతి పక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు ఈ ఫలితాలు నిదర్శనమని ఆయన కొనియాడారు. ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ తిరుగు లేని విజయాలను సొంతం చేసుకుంది అని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ఫలితాలు ఇలానే ఉంటాయని ఆయన అన్నారు. నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తున్న విషయాన్ని గుర్తుంచు కున్నారని పేర్కొన్నారు. తొలి రౌండ్ నుంచి మెజారిటీ పెరుగుతూ విజయం సాధించడం పట్ల ఆయన డాక్టర్ సుధ కు అభినందనలు తెలిపారు. తిరుగులేని విజయాన్ని అందించిన బద్వేలు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని శిద్దా రాఘవరావు అన్నారు.

LEAVE A RESPONSE