Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులను ముంచిన జగన్‌ మనకు అవసరమా?

– జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ

గుంటూరు: గెలిస్తే ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, దానిని అటకెక్కించిన సీఎం జగన్‌ ఈ రాష్ర్టానికి అవసరమా అని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్- 2024 విడుదల ,మెగా డిఎస్సి నిర్వహణ,గ్రూప్ 1,2 అభ్యర్థుల వయోపరిమితి పెంపు ,రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ ,పరిశ్రమలు స్థాపన,పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,అధికార ప్రతినిది షేక్ షుకూర్, కార్యదర్శి మాచవరపు దాసు,గుంటూరు పశ్చిమ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్,కార్యనిర్వాహక కార్యదర్శి కోలా మల్లికార్జున రావు,గుంటూరు తూర్పు తెలుగుయువత ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్,కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు,టీడీపి నాయకులు కొల్లా నాగుల్,బుజ్జి, రామారావు,తెలుగుయువత నాయకులు శేషాద్రి సాంబశివరావు ,పొత్తూరి వెంకటేశ్వరావు,చిక్కాల శివరామ కృష్ణ,శొంఠినేని అనిల్,గాలి ఉపేంద్ర,చింతా వినోద్,బుల్లా కుమార్ బాబు తథితరులు పాల్గున్నారు.

LEAVE A RESPONSE