అడ్డగోలుగా అప్పులుతెస్తున్న జగన్ రెడ్డి ఆ వివరాల్ని తొక్కిపెట్టి, ప్రజల్ని కాగ్ ను మోసగిస్తున్నాడు

Spread the love

– అప్పులసొమ్ముని తనవారికి దోచిపెడుతూ, ప్రజలపై భారంవేస్తున్నాడు
• ఏపీప్రభుత్వ అప్పులవివరాలపై కాగ్ లెక్కలకు, ఆర్బీఐ నివేదికకు పొంతనకుదరడంలేదు
• కేంద్రప్రభుత్వం అనుమతించినదానికంటే మూడునెలల్లోనే ఏపీప్రభుత్వం ఎలా ఎక్కువఅప్పులు తెచ్చింది?
• ఏప్రియల్ , మే తో పాటు,ఇప్పటివరకు ఏపీప్రభుత్వం రూ.45,048కోట్ల అప్పులు చేసింది
• ఎఫ్.ఆర్.బీ.ఎం నిబంధనలు, ఆర్బీఐ ఆదేశాల్ని కాదని ఇష్టానుసారం అప్పులుతెస్తున్న జగన్, ఆసొమ్ముని తన తస్మదీయులకు ధారాధత్తం చేస్తున్నాడు
• అప్పులలెక్కలు, రాష్ట్రఆర్థికస్థితిపై వాస్తవాలతో తక్షణమే ఏపీప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలి
• జగన్ సర్కార్ పరిమితికి మించి అప్పులుతెస్తూ, తప్పుడులెక్కలుచెబుతున్నా కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు?
• కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వ అప్పుల లెక్కల్ని తక్షణమే పరిశీలించి, తగుచర్యలు తీసుకోవాలి
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

రాష్ట్రప్రభుత్వం చేసే అప్పులవివరాలు ఎప్పటికీ ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏప్రియల్ నెలలో 23,549 కోట్లరూపాయల అప్పుచేస్తే, మే నెలలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం రూ.9వేలకోట్ల అప్పులు చేసిందని, ఈలెక్కల తాలూకా అప్పులచిట్టాను ఏపీ ప్రభుత్వం బయటకు పొక్కకుండా కప్పిపెడుతోందని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

ఏపీప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలకు, ఆర్బీఐ నివేదికకు ఎందుకు తేడావచ్చిందో ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ సమాధానం చెప్పాలి
“ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీప్రభుత్వం మేనెల 9న 3,500కోట్ల అప్పు తీసుకు న్నట్టు చెబుతోంది. అదేనెలలో 16వతేదీన, 23వతేదీన, 30వతేదీన మొత్తంగా రూ.9,500కోట్ల అప్పులుతీసుకుంది. కాగ్ మాత్రం ఏపీప్రభుత్వం మే నెలలో కేవలం రూ.1748కోట్ల అప్పుమాత్రమే తీసుకున్నట్టు చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా చెప్పినదానికి కాగ్ లెక్కలకు ఎందుకుతేడా వచ్చింది?

కాగ్ లెక్కల్లో ఎందుకు తప్పులున్నాయో ఆర్థికమంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ సమాధానం చెప్పాలి. వారికి తెలియకుండా కాగ్ కు ఇతరులు ఎవరూ సమాచారం ఇవ్వరు. తాము ఇప్పుడు చెప్పిన లెక్కలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానుంచి సేకరించిన సమాచా రమే. 2021-22, 2022-23 ఆర్థికసంవత్సరాల్లో ఏపీప్రభుత్వం చేసిన అప్పుల వివరాల్ని కూడా కాగ్ సరిగా చెప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులవివరాల్ని ఎవరు, ఎందుకు తొక్కిపెడతున్నారో తెలియాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులవివరాల్ని ఎవరు ఎందుకు తొక్కి పెడుతున్నారు? కాగ్ ఎందుకు ఆపనిచేస్తోంది? రాష్ట్రాలు ఎఫ్.ఆర్.బీ.ఎమ్ నిబంధనల ప్రకారమే అప్పులుతీసుకోవాలని కేంద్రం పార్లమెంట్ లో 2002లో చట్టంచేసింది. దాని ప్రకారంగా అప్పులుచేయడాన్ని ఏపీప్రభుత్వం ఎప్పుడో విస్మరించింది. కేంద్రం అండ దండలతోనే ఏపీప్రభుత్వం ఇష్టానుసారం అప్పులచేస్తోందనే వాదనకూడా లేకపోలేదు. 2023-24 ఆర్థికసంవత్సరానికి రాష్ట్రానికి రూ.30,275కోట్ల అప్పులకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కానీ జగన్మోహన్ రెడ్డి ఆర్థికసంవత్సరం మొదలైన మొదటినెలలోనే (ఏప్రియల్) 23,548కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. ఇంకమిగిలిన వెసులుబాటు రూ.6వేలకోట్లు మాత్రమే. మేనెలలో రూ.9,500కోట్లు అప్పుచేశారు. రూ.23,548 + రూ.9,500కోట్లు కలిపితే, మొత్తంగా రూ.34వేలకోట్లు అవుతోంది. ఎఫ్.ఆర్.బీ.ఎం లి మిట్ దాటి అప్పులుచేసిన జగన్ సర్కార్, కావాలనే ఆ విషయాన్ని నొక్కిపెట్టి కాగ్ కు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఏపీప్రభుత్వం తప్పుడు సమాచారమిచ్చినా కాగ్ ఎందుకు వాస్తవాలు తెలుసుకోలేదు?

జగన్మోహన్ రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన తప్పుడు లెక్కలు ఇవ్వరని రాష్ట్రప్రజల ప్రగాఢనమ్మకం, మరి లెక్కల్లో తేడా ఎక్కడొచ్చిందో కాగ్ చెప్పాలి. కాగ్ నిజంగా తప్పుచేసి ఉంటే, ఆ విభాగంపై వెంటనే కఠినచర్యలు తీసుకోవా లి. ఏప్రియల్, మే నెలలో ప్రభుత్వంచేసిన అప్పులవివరాలు జూన్ నెలాఖరువరకు బయటకురాకుండా జగన్ అండ్ కో జాగ్రత్తపడ్డారు. ఆ వివరాలు ఆలస్యంగా బయట పడినందునే తాము ఈ వివరాల్ని ఇప్పుడు ప్రజలముందు ఉంచుతున్నాం.

ఏప్రియల్ , మేనెలలతో పాటు, జూన్, జూలైలో ఇప్పటివరకు ఏపీప్రభుత్వం రూ.45,048కోట్ల అప్పులు చేసింది. ఎఫ్.ఆర్.బీ.ఎం లిమిట్ రూ.30వేలకోట్లు అయితే, ఇప్పటికే దానికి మించి 50శాతం అదనంగా అప్పులు తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డిసర్కారుకి ఎవరు అనుమతిచ్చారు? ఈ విధంగా ఇష్టానుసారం అప్పులు చేస్తుంటే, కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించదు?

ఎక్కడ అప్పులు పుడితే, అక్కడ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం ఆ సొమ్మంతా ఏంచేస్తోంది. రాష్ట్రాభివృద్ధికో, ప్రజల సంక్షేమానికో వినియోగిస్తున్నారా అంటే అదీలేదు. అప్పులసొమ్ముని జగన్మోహన్ రెడ్డి తస్మదీయులకు చెందిన నాలుగు కంపెనీలకు కట్టబెట్టాడు. ఆయాకంపెనీలకు ఇవ్వాల్సినసొమ్ముకోసం అడ్డగోలుగా అప్పులుచేసి, ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నాడు.

అప్పులవివరాలు, రాష్ట్రఆర్థికపరిస్థితిపై తక్షణమే ప్రభుత్వం వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం
దేశంలో ఏరాష్ట్రం చేయనివిధంగా ఏపీమాత్రమే ఇష్టమొచ్చినట్టు అప్పులు చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణప్రభుత్వం ఏప్రియల్, మేనెలలో రూ.9,266కోట్ల అప్పుమాత్రమేచేసింది. తమిళనాడు ప్రభుత్వం రూ.12,584కోట్లు, మధ్యప్రదేశ్ రూ.7,977కోట్లు, గుజరాత్ రూ.-344కోట్ల అప్పులు మాత్రమే చేశాయి. ఏరాష్ట్రం చేయనివిధంగా ఏపీకి మాత్రమే అప్పులుతీసుకునే వెసులుబాటు ఎందుకుకల్పిస్తున్నారు?

ఎఫ్.ఆర్.బీ.ఎం నిబంధన లు, ఆర్బీఐ ఆదేశాలు ఏవీ రాష్ట్రప్రభుత్వానికి ఎందుకు పట్టడంలేదు? ఆర్థికశాఖ కార్య దర్శి రావత్ అప్పులపై తప్పుడునివేదికలు ఇచ్చేస్థాయికి ఎందుకు దిగజారారు? సమాచారాన్నికూడా దాచిపెట్టే దుస్థితికి రాష్ట్రఆర్థికశాఖ ఎందుకొచ్చిందో రావత్ సమా ధానంచెప్పాలి. జగన్ రెడ్డి అప్పుల్ని కప్పిపుచ్చేందుకు మంత్రి బుగ్గన, ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖ సలహాదారు దువ్వూరుకృష్ణ ప్రజలకు కట్టుకథలు చెబుతు న్నారు.

ఏప్రియల్ నెలలో తొలిసారి రూ.17వేలకోట్ల అప్పుతెచ్చినప్పుడే మేం ప్రజల తరుపున ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ ను ప్రశ్నించాము. అప్పు డుకూడా ఆయన స్పందించలేదు. త్వరలోనే ఏపీప్రభుత్వ అప్పులబాగోతాల్ని మరిన్ని ఆధారాలతో ప్రజలముందు ఉంచుతాం. పరిమితికిమించి అప్పులుతేవడంలేదు.

అంతా సక్రమంగానే చేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కార్, అప్పులవివరాలు, రాష్ట్రఆర్థికపరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వ అప్పులలెక్కలు, కాగ్ నివేదికపై కేంద్రఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తక్షణమే దృష్టిపెట్టాలి.” అని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply