వైద్య సేవలు విస్తృతం చేయాలి

– ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ సూచన

సికింద్రాబాద్ : పేద ప్రజలకు వైద్య సేవలు ఉపకరించేలా అర్బన్ కమ్యూనిటీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ సక్కు బాయి నేతృత్వంలో వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సోమవారం సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ ను సీతాఫలమండి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ వైద్య , విద్యా రంగాలకు తాము అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నామని, సీతాఫలమండి కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దుత్నమని, కొత్త భవనాల నిర్మాణం పనులను చేపట్టామని తెలిపారు. వైద్యులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

Leave a Reply