ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె నోటీసులు

23 నుంచి సమ్మె

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని కోరారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply