Suryaa.co.in

Andhra Pradesh

ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది..?

మాచర్ల ఘటనపై ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా..?
వీడియో సరైందేనా కాదా అన్నది నిర్ధారించకుండానే.. ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది..?
ఒకవేళ నిజమైనదే అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది..?
మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా..!
అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే.. ఎలా లీక్ చేస్తుంది..?
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. ఏడు చోట్ల జరిగిన
ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు..?
అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే.. అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది.
అంతేకాని.. ఒక చిన్న క్లిప్‌ మాత్రమే బయటకు ఎలా వస్తుంది..?
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు.. వారిని గుర్తించేందుకు ఈసీ సరైన పద్ధతిలో నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదు..?
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..
అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది
వారిపై ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
వారి వెనుక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు..?

LEAVE A RESPONSE