Suryaa.co.in

Andhra Pradesh

ఏబీ కేసు తీర్పు రిజర్వు

– హైకోర్టులో మూడున్నర గంటల సుదీర్ఘ వాదనలు
– ఎలాంటి ఆధారాలు సమర్పించని జగన్ సర్కారు

అమరావతి: డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును జగన్ సర్కారు సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. దానిపై హైకోర్టులో మూడున్నర గంటల సేపు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అడ్వకే ట్ జనరల్ శ్రీరాం రెండు గంటలు వాదించారు. ఏబీ న్యాయవాది ఆదినారాయణ గంటన్నర వాదించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఏబీపై క్యాట్‌లో చేసిన ఆరోపణలే చేసింది. హైకోర్టులో కూడా ఏబీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం సమర్పించలేదు. నిబంధనలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్ని కోర్టులూ కొట్టివేసి, ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించాయని ఏబీ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని తీర్పులనూ సర్కారు ఉల్లంఘించిందని, ఒకే కేసులో రెండుసార్లు సస్పెన్షన్ కుదరదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టిందని వాదించారు.

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, తీర్పును రిజర్వు చేసింది. బహుశా ఈరోజు తీర్పు వెలువరించే అవకాశాలున్నట్లు న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏబీ ఈనెల 31న రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE