Home » వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదు

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదు

  • మాచర్లలో ఆరుగురిని హతమార్చారు
  • 79 మందిపై దాడులకు తెగబడ్డారు.. అందులో 51 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే
  • జగన్ రెడ్డి పాలనలో పిన్నెల్లి హింసకు, రక్తపాతానికి అడ్డులేకుండా పోయింది
  • ఈవిఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కేసు నమోదు చేయకుండా పోలీసులే తప్పించడం సిగ్గుచేటు
  • పిన్నెల్లిని అనర్హుడిగా ప్రకటించి.. అతని సోదరులిద్దరికి అతని ముఠాలకు ఓటు హక్కు లేకుండా చేయాలి
  • అరాచక ఘటనలపై వెంటే జగన్ రెడ్డి స్పందించాలి
  • సీఎస్ ను మార్చి ఓట్ల లెక్కింపును సజావుగా జరిగేలా చూడాలి
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్ రెడ్డి పాలనలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుల అరాచకానికి, విధ్వంశానికి, రక్తపాతానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని  టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మాట్లాడుతూ..

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉద్దారకుడు అని చెప్పిన జగన్ రెడ్డి పానలో జరిగిన హింసాకాండను వివరంగా తెలియజేస్తున్నాం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సోదరుల ముఠా చేసిన హత్యలు

1 వెల్దుర్తి మండలం గుండ్ల పాడు గ్రామం తోట చంద్రయ్య హత్య
2 దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచర్ల  జల్లయ్య యాదవ్ హత్య
3 దాచేపల్లి మండలం తంగెడ గ్రామం బత్తుల సుబ్బులు హత్య
4 మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఖాదర్ భాషా హత్య
5 దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం అరెద్దుల కోటయ్య యాదవ్ హత్య
6 పందిపాటి వారి పాలెం బయల మడుగు పిచ్చయ్య హత్య

పిన్నెల్లి ముఠా దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు

1 దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య, కంచర్ల బక్కయ్య కాళ్లు నరికేశారు
2 దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం యలమందరాజు దాడి
3 మాచర్ల మండలం పసుపు వేముల గ్రామంల దోసపాటి వెంకట నారాయణ తప్పుడు కేసులో ఇరికించి

వేధింపులు

4 దుర్గి మండలం తెర్ల గ్రామం       అనికిపల్లి ఎలీషా బాబు దాడి
5 మాచర్ల మండలం విజయపురి సౌత్ దుర్గా ప్రసాద్ తప్పుడు కేసులో వేధింపులు
6 వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు దాడి
7 మాచవరం మండలం మోర్జపాడు గ్రామం కురివేపు నరసింహరావు ఆస్తి ధ్వంసం చేసి వేధించారు
8 వెల్దుర్తి మండలం గొటిపాల గ్రామం రాజ్యబోయిన దుర్గయ్య, పెరుమాల్ల మల్లిఖార్జున దాడి

 

9 మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం చింతపల్లి అస్నేన్ టీడీపీ ఓటు వేస్తే వేధింపులు
10 దుర్గి మండలం జంగమేశ్వరపాడు గుమ్మ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు టీడీపీకి ఓటు వేశారంటూవేధింపులు

వైసీపీ పాలనలో పిన్నెళ్లి దాడులు దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.  పిన్నెళ్లి అరాచకాన్ని పోలీసులు అడ్డుకోకపోవడంతో  దాదాపు 79  మందిపై దాడులకు తెగబడ్డారు అందులో 51 మంది  ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే ఉన్నారు.  మాచర్లలో  ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితిని పిన్నెళ్లి సోదరులు తీసుకు వచ్చారు.  100 మంది ముస్లిం కుటుంబాలు టీడీపీకి ఓటు వేశారని వాళ్లను వేధించడం మొదలు పెడితే వాళ్లు మాచర్ల నుండి వేరే ప్రాంతాలకు తరలిపోయి బ్రతుకుతున్నారు.

పిన్నెల్లి రామకృష్ణ అతని సోదరుల దౌర్జన్యాలు, అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయడానికి వస్తే టీడీపీ నేతలు అడ్డుకునారని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారు. మాచర్లలో ఆరుగునిరి హతమార్చారు. 18 మందిపై దాడి చేశారు. మాచర్లలో77 పంచాయతీలు ఉంటే 74 పంచాయతీలను దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీనిపై నిజనిర్ధాన కమిటీ వేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, హైకోర్టు అడ్వకేటు పారా కిషోర్ లు అక్కడికి వెళితే  వాళ్ల పై దాడి చేసి తురక కిషోర్ అనే గుండా చంపడానికి యత్నించాడు. టీడీపీ నేతల కారును ధ్వంసం చేశారు.

దాడులు చేసిన తురక కిషోర్ కు జగన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టాడు. సహచర నేర ప్రవృత్తిలో భాగంగా పోలింగ్ బూత్ 22 లో పిన్నెల్లి ఈవిఎంలను ధ్వంసం చేసి పారిపోయాడు. పిన్నెల్లి ఎక్కడికి పారిపోమాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలతో వెతుకుతున్నామని చెబుతున్నారు. జగన్ రెడ్డి మాత్రం  పిన్నెల్లి చాలా మంచోడని వైసీపీకి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కట్టబెడతానని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నాడు. ఈవీఎంలను పగలకొట్టడాన్ని అడ్డుకున్న టీడీపీ నేత తల పగలకొట్టారు. పిన్నెల్లిపై హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహనిర్భందంలో పెట్టారు. పారిపోవడానికి పోలీసులు సహకరించారు.

పిన్నెల్లి తాడేపల్లి వచ్చి జగన్ రెడ్డితో మాట్లాడిన తరువాత జగన్ రెడ్డి సూచనలతో పోలీసులు పిన్నెల్లిని తప్పించారు. ఎన్నికల కోడ్ వచ్చిన పోలీసు వ్యవస్థ జగన్ రెడ్డి చెప్పు చేతుల్లోనే పనిచేస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. పిన్నెల్లి హైదరబాద్ పారిపోయి సాక్షికి ఇంటర్వీ ఇచ్చి భీరాలు పలికాడు. ఎన్నికలు ముగిసి పదిరోజలు అయినా పన్నెల్లిని అరెస్ట్ చేయలేదు. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందా… సీఎస్ఈ ఆధ్వర్యంలో నడుస్తుందా..? జగన్ రెడ్డి తాబేదారుల ఆధ్వర్యంలోనే ఇంకా ప్రభుత్వం నడుస్తుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, నరసరావుపేటలో విధ్వంస రచన చేశారు. రాష్ట్రం రావణకాష్టంలా ఉంటే జగన్ రెడ్డి హ్యాపీగా లండన్ లో తిరుగుతున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఎస్పీ ఎస్టీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

జగన్ రెడ్డి మంచోడని కితాబు ఇచ్చిన పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడదో తెలియదు పిల్లిలా పారిపోయాడు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఎవరైనా ఇలా చేస్తారా? ఎప్పటికైనా అరాకచకానికి ముగింపు ఉంటుందని నేడు తెలిసిపోయింది. పిన్నెల్లి  ఇక కఠిన శిక్ష తప్పదు. పిన్నెల్లి అరాచకాలకు, దౌర్జన్యాలను ఎదిరించి వచ్చిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాన్ని సహించలేని వైసీపీ మూకలు వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో రాచబోయిన బాబు, రవీంద్ర, శివరాజులపై  దాడులకు తెగబడ్డారు. గొడ్డళ్లతో దాడి చేశారు. రెంట చింతలకు చెందిన టీడీపీ నేత సర్వారెడ్డిపై డీఎస్పీ కార్యాలయం సమీపంలోనే దాడి చేశారు. ఈరకంగా దాడి చేసిన వారిపై ఏ శిక్షలు విధించాలి.

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఊపిరిలాంటిది. పిన్నేల్లి ప్రజల ఓటు హక్కునే హరించాలని చూశాడు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీచేయకుండా ఈసీ బహిష్కరించాలి. పిన్నెల్లి ముఠాను కఠినంగా శిక్షించాలి. జగన్ రెడ్డికి వంతపాడిన పోలీసులను కూడా శిక్షించాలి. ఆధారాలు బయట పడిన తరువాత పిన్నెల్లిని మొదటి ముద్దాయిగా చేర్చారు. అప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులు అని కేసు నమోదు చేయడం వెనుక దురుద్దేశాన్ని బయట పెట్టాలి.

టీడీపీ ఏజెంట్ చేరెడ్డి మంజుల నుదిటిపై గొడ్డలితో నరికారు, మరో 10 మందిపైనా దాడి చేశారు. పోలింగ్ అనంతరం పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి కారంపూడిలో బీభత్సం సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. ఏజెంట్లుగా నిలబడిన వారిపై దాడి చేశారు. కారంపూడిలో కత్తులు, కర్రలు, రాడ్లు పట్టుకుని నడి రోడ్డుపై బీతావాహ వాతావరణం సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజా తీర్పును అగౌరవపరిచే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి లాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి. పిన్నెల్లి అరాచకానికి సహకరించి, కేసులు పెట్టకుండా వదిలేసి, నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకున్న పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఈ ఘటనలపై జగన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కౌంటిగ్ కు వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆర్వోలు భయపడుతున్నారు. వెళ్లినా సరే  పడిన ఓట్లన్నీ వైసీపీకి పడినట్లు చెప్పాలని బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. మెడికల్ లీవ్ లు పెట్టుకుని వెళ్లి పోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డిని వెంటనే మార్చకుంటే ఓట్ల లెక్కింపు సరిగా జరిగే అవకాశం లేదు. వెంటనే సీఎస్ ను మార్చి  ఓట్ల లెక్కింపును సక్రమంగా జరిగేలా చూడాలి. ఎన్నికల సంఘం టీడీపీతో కుమ్మక్కు అయ్యిందని మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం సిగ్గుచేటు. దౌర్జన్యాలకు దారుణాలకు మారుపేరు వైసీపీ. దళితున్ని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని వెనుకేసుకుని తీరుగుతున్న వ్యక్తి ఈ జగన్  ఇలాంటి వ్యక్తులను తరిమి కొట్టేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వేశారు. కూటమిని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు.

Leave a Reply