Suryaa.co.in

Family

జీవన సాగరం

సుఖదుఃఖాలు, కష్టసుఖాలు కలిసే వస్తాయ్..!
దుఃఖం.. సుఖానికి భూమిక లాంటిది..!
పూలవద్ద ఉన్న ముళ్లు పూల రక్షణ కోసమే..!
కష్టాల తర్వాత వచ్చే సుఖమే ఆనందకరం..!
కష్ట, దుఃఖ, అలసట, ఆందోళన లేకపోతే..
లౌకిక జీవితం నిస్సారమవుతుంది..!
వేదనాభరిత జీవిత సందర్భాలలో..
‘మనిషి’ మతిస్థిమితం కోల్పోతే..
‘మనీషి’ తన వ్యక్తిత్వాన్ని పదును పెట్టుకుంటాడు..!
అది అతడి కర్మ పరిపాకం, సంస్కారం..!
కష్టకాలాల్లో..
తాగుబోతులవ్వొచ్చు.. కావ్యాల్నీ సృష్టించొచ్చు..!
రెండిటికీ ప్రాతిపదిక వేదనే..!
.
ష్టానికి కష్టానికి మధ్య ఆటవిడుపు కన్నీళ్లే..!
కరడుగట్టిన దుఃఖపు శిలను..
బద్దలుకొట్టి దాన్ని కరగనివ్వాలి..!
కస్తూరిబా మరణమపుడు..
మహాత్ముడి కళ్లనుండి జారువారింది..
కేవలం ఒక్క కన్నీటి చుక్కే..!
మనసు విచలితమైనదనడానికి సంకేతమది..!
తర్వాత తన దృష్టి..
మహోన్నతమైన ఉద్యమంవైపు లగ్నమైంది..!
యోగం, కర్తవ్యం, లక్ష్యశుద్ధి, ధర్మనిరతి..
కలగలసిన స్థితప్రజ్ఞత అది..!
.
భగవంతున్ని కోరాల్సింది విపత్తులే..!
ఎందుకంటే..
దుఃఖాన్ని దూరంచేసేవాడు తనొక్కడేనని..
విపత్తులే మనకు‌ బోధిస్తాయి..!
సుఖాల్లో ఉన్నవారు భగవంతుని పట్టించుకోనట్లే..
సుఖాల్లో తేలియాడివారివైపు..
భగవంతుడూ దృష్టి సారించడు..!
ఎలాగంటే..
ఆడుకుంటున్న బాలుడిపై అమ్మ దృష్టి సారించదు..!
కడుపు నొప్పనో, కాలు నొప్పనో ఏడుస్తున్న..
పసి పిల్లాడివైపే పరిగెత్తుకొస్తుంది మరి..!
.
కష్టాలనుంచి పారిపోకుండా..
వాటినొక సవాలుగా స్వీకరించాలి..!
బంగారం శుద్ధం కావాలంటే నిప్పుల్లో పడాల్సిందే..!
వెదురును విరిస్తేనే వేణువవుతుంది..
శిలను చెక్కితేనే దేవతామూర్తి ఉద్భవిస్తుంది..!
ఏడు ద్వారాల ప్రవేశం `ఏడుకొండల స్వామీ
ఏడు వారాల ఆరాదనం, సర్వ ప్రాణి కోటికి `ఏడు కొండల స్వామీ.
పాల కడలిలో పవళించి, ఇల తిరుమలలో దర్శించి `శ్రీదరం శ్రీవెంకటేశ్వరం.
మూడడుగుల సర్వ వ్యాప్త రూపం, మన ముంగిట నిలయం `శ్రీ వెంకటేశ్వరం.
ఆకాశ రాజునికి.. అరుదైన వరం అల్లుడిగా.. ఇల వడ్డి కాసులవాడిరూప ప్రత్యక్షం, ఏడు కొండలలో శ్రీ వెంకటేశ్వరం.
శ్రీనివాస పద్మావతి అమ్మ పరిణయం.. రంగ రంగ వైభవం.. ఆ కళ్యాణం మనకి నిత్య దర్శనం.. సప్తగిరిలో సందర్శనం ఇల `శ్రీ వెంకటేశ్వరం.
ఎక్కడ లేని వైభవం, ఇక్కడ మాత్రమే కనిపించే వైభవం, శ్రీ మహావిష్ణుని వైభవం..
శ్రీనివాసునికి మన మనస్సు సమర్పితం.. ఆనంద నిలయములో `శ్రీ వెంకటేశ్వరం.
బ్రహ్మ కడిగిన పాదం.. ఇల ఏడు కొండలలో ప్రత్యక్షం శ్రీవారి పాదం.. మనసా స్మరామి.. శిరసా నమామి.. ప్రాణతోస్మి నిత్యం నమామి శ్రీ వెంకటేశ్వరం.
శరణు శరణు తండ్రి గోవిందాగోవిందా హరి గోవిందా!

LEAVE A RESPONSE