Suryaa.co.in

Political News

పెట్రోల్ డీజిల్ విషయంలో మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టుగా ఉంది

పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రజలు భరించలేనంతగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో రేట్లు తగ్గించిన విషయం మనకందరికీ తెలిసిందే. కానీ బిజెపి ఈ మధ్య దేశంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏదో ఓడిపోయింది. అందుకే తగ్గించారని మాట్లాడుతున్నారు. దీంట్లో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో తప్ప (అవి గతంలో కాంగ్రెస్ సీట్లు) మిగతా అన్ని రాష్ట్రాలలో ఎన్డీఏ పక్షాలకు, గతం కంటే ఎక్కువ సీట్లే వచ్చాయి మరి ప్రజలు ఎన్డీఏ ను ఆదరించినట్లా! ఓడించినట్టా!
దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, కేంద్రంతోపాటుగా రాష్ట్రాలు కూడా కొంత తగ్గించాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా అధికార పార్టీ నాయకులు, రేట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మీద అక్కసుతో మింగలేక, కక్కలేక విమర్శలు చేస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఎందుకంటే కేంద్రంతోపాటుగా… ఇరవై మూడు రాష్ట్రాలు తగ్గించే సరికి, వారికి ప్రజలలో ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అనే ఉద్దేశంతో, కేంద్రానికి బీజేపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఈ పని చేస్తున్నారు. ఎందుకంటే వారు తెచ్చిన అప్పులు ,వారి పథకాలకు ప్రజల మీద భారం మోపడం తప్ప ఇంకొకటి కాదు అనే విషయంలో, స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. వారి కడుపు మంట ఎలా ఉందంటే కేంద్ర తగ్గించింది. రాష్ట్రాలు తగ్గించాయి. మనమేం చేయాలి ? అనే విషయం మీద మల్ల, గుల్లాలు పడుతూ, మేము తగ్గించనే తగ్గించంమని మంత్రులు మొండి వాదన, బహిరంగ ప్రకటన చేస్తున్నారు.
పైపెచ్చు మేము పెంచలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. వాస్తవం తెలుసుకుందాం. వీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంతకుముందు పెట్రోల్ మీద వ్యాట్ 31%ఉండేది. డీజిల్ మీద 22% ఉండేది .కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత, అంతకుముందు అమరావతి అభివృద్ధి పేరుతో లీటర్ కు 4 రూపాయలు వసూలు చేస్తుండేవారు. దానిని రాష్ట్రం రెండు రూపాయలు చేసి పెట్రోల్ మీద వ్యాట్ ను 37% కు.. డీజిల్ మీద 26% కు పెంచారు. అంటే 100 రూపాయలు పెట్రోల్ అయితే, 37 రూపాయలు ,డీజిల్ నూరు రూపాయలు అయితే 26 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రేట్ పెరిగినప్పుడల్లా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. .మరి రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్టా ? పెంచ నట్టా ? కాబట్టి ప్రజలందరూ వాస్తవాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పవలసిందిగా మిమ్మల్నందర్నీ కోరుకుంటున్నాను.

కరణం భాస్కర్
బిజెపి ,
నెల్లూరు ,
7386128877.

LEAVE A RESPONSE