– ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దోవల్
– 149 ప్రొబేషనరీల బేసిక్ కోర్సు శిక్షణ పూర్తి
– వారిలో తెలంగాణ కేడర్‌కు నలుగురు
– ఏపీ కేడర్‌కు ఐదుగుదు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరుగుతోంది. ఇందులో అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ బ్యాచ్‌లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలంగాణ కేడర్‌కు నలుగురు, ఏపీ కేడర్‌కు ఐదుగురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మంది ప్రొబేషనరీలకు అజిత్ దోవల్ ట్రోఫీలు అందజేశారు. అంతకుముందు, శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌ల నుంచి దోవల్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌కు ఈ సారి కూడా మహిళా అధికారి కమాండర్‌గా వ్యహరించారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న 149 మందిలో 132 మంది ఐపీఎస్‌లు, 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.