-ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును కోరిన రజక వృత్తి దోభీఘాట్ల పరిరక్షణ సమితి సభ్యులు
బీసీ వర్గంలోని బీసీ–ఏలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు సహకరించి, ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ రజక వృత్తి దోభీఘాట్ల పరిరక్షణ సమితి సభ్యులు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలును కోరారు.
గుంటూరు, జేకేసీ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆ సంఘానికి చెందిన రాష్ట్ర అధ్యక్షలు చెన్నూరి చెన్నయ్య, జిల్లా అధ్యక్షులు రాచకొండ రమణమ్మ, ఆర్ శ్రీరాములు ఎంపీకి వినతిని సమర్పించారు. ఈ చేరిక ద్వారా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందుటకు అవకాశం ఉంటుందని, కావున రజకులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని వారు ఎంపీని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమన్యాయంతో పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు.