దటీజ్ సీఎం విజయన్

ముఖ్యమంత్రి పర్యటనకి వస్తున్నారు అంటే అయన వెళ్లే మార్గంలో ఉన్న వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసి వేయిస్తారు పోలీసులు. ఇక ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గంటలకొద్ది ట్రాఫిక్ స్థంబింప చేసి ప్రజలకు పట్ట పగలే నక్షత్రాలు చూపిస్తారు.
కేరళ ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఒక ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో చక్కగా తృప్తిగా భోజనం చేసి వెళ్లిపోయారు( స్వంత డబ్బులు ఇచ్చి). పదవి ఇచ్చింది ప్రజల సేవ చేయటానికి అని నమ్మే నాయకులు క్రమంగా కనుమరుగు అవుతున్నారు. పదవిని హోదాగా భావించి ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టటం ఫ్యాషన్ గా మారిన ఈ రోజుల్లో సామాన్య వ్యక్తిగా ఉండటం హర్షించ దగ్గ విషయం.