కళ్యాణ రావు ఇంటిలో ఎన్ ఐఎ సోదాలు

– సాయుధ పోలీస్ మోహరింపు
ఎన్ ఐ ఎ బృందానికి సహకరించిన జిల్లా పోలీస్ లు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు లో విరసం అధ్యక్షులు గంగొల్లు కళ్యాణ రావు ఇంటి లో ముగ్గురు సభ్యుల ఎన్ ఐ ఎ బృందం సోదాలు నిర్వహించింది.శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ఈ బృందం సోదాలు ప్రారంభించింది.
ఇటీవల మావోయిస్ట్ నేత అక్కిరాజు హరగోపాల్, ఆర్ కె అనారోగ్యం తో ఉద్యమ నేత మధ్య మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆలకూర పాడు లో ఆర్ కె సంస్మరణ సభ తో పాటు ఆర్ కె కుమారుడు మున్న వర్ధంతి సభ నిర్వహించారు.ఆర్ కె భార్య శిరీష ఆలకూరపాడు లో నివసిస్తుంది.ఈ నేపథ్యం లో ఇటీవల ఛత్తీస్ గడ్ కి చెందిన ఎన్. ఐ ఎ బృందం ఆలకూరపాడు కి చేరుకుని కళ్యాణ రావు, ఇంటిలో సోదాలు చేపట్టారు. ఆర్ కె మరణం అనంతరం మాజీ ఆర్ డబ్ల్యు ఎ నేత,మావోయిస్ట్ సాహిత్య కారుడు కళ్యాణ రావు సారథ్యం లో అమరుల బంధు మిత్రుల సంఘం సహకారం తో ఆర్ కె పై సాయుధ శాంతి స్వప్నం పేరుతో హైదరాబాద్ లో విడులయిన సాహిత్యాన్ని పోలీస్ లు సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్ ఐ ఎ పోలీస్ లు ఆలకూరపాడు లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. దాని లో భాగంగా ఎన్ ఐ ఎ బృందానికి ప్రకాశం జిల్లా పోలీస్ లు సహకారాన్ని అందించారు.జిల్లా అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యం లో జిల్లా పోలీస్ లు సహకారాన్ని అందించారు.ముందుగా ఆ ప్రాంతం లో సాయుధ పోలీస్ బలగాలు బందోబస్తు చేపట్టాయి.
కళ్యాణ రావు ఇంటి ప్రాంతాన్ని పోలీస్ లు తమ అదుపు లోకి తీసుకున్నారు.పోలీస్ చర్య తెలుసుకుని ఆ ప్రాంత మహిళలు,ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ లు వారిని ఎక్కడి కక్కడ నిలిపి వేశారు.ఎన్ ఐ ఎ బృందం కళ్యాణ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా అధికారులు మూడు అంతస్తులు ఎక్కి క్షుణ్ణంగా పరిశీలించారు. సోదా లు జరుగుచుండగా నే అధికారులు కళ్యాణ రావు ఇంటి నుండి అమర వీరుల స్తూపం మీదుగా ప్రాంతాన్ని పరిశీలించారు.

Leave a Reply