జగన్‌రెడ్డి పాలనలో మహిళల జీవన ప్రమాణాలు పడిపోయాయి…

– మద్యం ఆదాయం 25 ఏళ్లకు తాకట్టు పెట్టి మద్య నిషేదంపై మాటతప్పి మడమ తిప్పారు…
– నాసిరకం మద్యం పోసి మహిళల మాంగల్యాలు మంటగలుపుతున్నారు
– అత్యాచారాలు, హత్యలు పెరిగాయి…
– ఎన్‌టిఆర్‌ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు…
– చంద్రన్న డ్వాక్రా వ్యవస్థను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారు
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఈరోజు మహిళా సాధికారతపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం అంకెల గారడీ మాత్రమే ఆత్మస్తుతి పరనిందగా వున్నది. జగన్‌రెడ్డి పాలనలో పెరిగిన మద్యం రేట్లు, గంజాయి, హెరాయిన్‌ వల్ల గృహహింస పెరిగింది. నాసిరకం మద్యం పోయడమే కాక, మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లకు బ్యాంకులకు తాకట్టుపెట్టి మద్యనిషేదంపై మాటతప్పి మడమ తిప్పారు. అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.40 వేలు లాక్కొంటున్నారు.
ఇది మోసకారి సంక్షేమం మాత్రమే. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో 2020 రిపోర్టు ప్రకారం లైంగిక వేధింపుల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో వున్నది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు 530 వరకు జరిగాయి. నిత్య జీవితావసర సరుకుల ధరలు పెంచి జీవన ప్రమాణాలు దిగజార్చారు. చంద్రన్న పెండ్లికానుక రద్దు చేశారు. విదేశీ విద్య రద్దు చేశారు. ఎయిడెడ్‌, ప్రయివేట్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. గడచిన రెండున్నరేళ్లలో మహిళల జీవన ప్రమాణాలు పడిపోవడమే కాక, అత్యాచారాలు, హత్యలు పెరిగాయి.
టీడీపీ- వైసీపీ
1 డ్వాక్రా సున్నా వడ్డీ 5 లక్షల వరకు 3 లక్షలకు కుదింపు
2 పసుపు కుంకుమ / చేయూత 94 లక్షల మందికి చేయూత – 24 లక్షల మందికి మాత్రమే
3 అమ్మ ఒడి టీడీపీ పాలనలో రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం రేటును జగన్ రెడ్డి రూ.200లకు పెంచారు. అమ్మ ఒడి, నాన్న బుడ్డితో సరి అమ్మ ఒడి రూ.14 వేలు ఇచ్చి, నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.40 వేలు లాక్కొంటున్నారు.
4 ఫీజు రీయంబర్స్ మెంట్ / విద్యా దీవెన టీడీపీ ఒకే విడతలో ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చింది – టీడీపీ 16 లక్షల మందికి ఇచ్చారు. 1. వైయస్ ఫీజు రీయంబర్స్ మెంట్ కు నిధులు ఇవ్వలేదు. 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. దీన్ని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చెల్లించారు.
2. 11 లక్షల మందికి (4 వాయిదాల్లలో) ఇచ్చారు. 18 లక్షల మందికి ఇచ్చామనేది వాస్తవం కాదు.
5 ఇళ్లు / ఇళ్ల స్థలాలు మహిళలకు రూ.10 లక్షల విలువ చేసే మంచి గృహాలు 10 లక్షలు నిర్మించడమైంది. 1. సెంటు పట్టా పేరుతో రూ.10 లక్షల విలువ చేసే భూమిని రూ.40 నుండి 50 లక్షలకు కొనుగోలు చేశారు. 7 వేల కోట్లు స్కామ్ చేశారు.
2. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసైన్ మెంట్ భూములు సుమారు 10 లక్షల కరాలు ప్రభుత్వం బలలవంతంగా స్వాధీనం చేసుకొన్నది.
6 బ్యాంకు లింకేజీ రూ.68 వేల కోట్లు ఇప్పించడమైంది. 1. డ్వాక్రా పొదుపు నిధులు రూ.8,700 కోట్లు జాతీయ బ్యాంకుల్లో వున్నవి. నిధుల్ని కోపరేటివ్ బ్యాంకులకు మళ్లించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇది మహిళా నిధులకు హాని చేయడమే.
7 పింఛన్ రూ.200 నుండి రూ.2000లకు పెంచడమైంది. ఇందులో ఎన్ టి ఆర్ చంద్రన్న పెంచింది రూ.1,875/-. రూ.3 వేలు ఇస్తామని చెప్పి రూ.2,250కే పరిమితం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి పెంచింది కేవలం రూ.375 మాత్రమే.
8 టీడీపీ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది. – పిన్నమ్మకు, సోదరికి న్యాయం చేయలేదు. సీబీఐ విచారణ పిటిషన్ హైకోర్టులో ఉపసంహ రించుకున్నారు.- మద్యం రేట్లు పెంచి మహిళల మాంగల్యాలకు ప్రమాదం తెచ్చారు.- మద్యనిషేదం హామీపై మడమ త్రిప్పి 25 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టారు.
9 డ్వాక్రా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినది చంద్రన్న మాత్రమే.
10 స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించింది.
11 మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు
12 మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టింది.
14 శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతి గారికి ఇచ్చి గౌరవించడం జరిగింది.