Suryaa.co.in

Andhra Pradesh

పెడన జడ్పిటిసి విజేత నగేష్ కు చంద్రబాబు అభినందన

జడ్ పిటిసి ఉపఎన్నికల్లో భాగంగా కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అర్జా నగేష్ ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అభినందించారు. అధికార పార్టీ అరాచకాలకు ఎదురొడ్డి 644 ఓట్ల భారీమెజారిటీతో విజయం సాధించడం గొప్ప విషయమని ఫోన్ లో నగేష్ కు కితాబిచ్చారు. రాబోయేరోజుల్లో అధికార పార్టీ అరాచకాలను ఇదే పోరాటపటిమతో దీటుగా ఎదుర్కోవాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి మీ వంతు కృషిచేయాలని కోరారు.

LEAVE A RESPONSE