Suryaa.co.in

Political News

జగన్ గారూ.. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేకండి!

మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు.ప్రజలు కాదు చెప్పేది ప్రతిపక్షాలు అంత కన్నా కాదు. స్వయంగా ఆ పార్టీ MP లు పిచ్చాపాటిగా మాట్లాడుకునేది అంతకన్నా కాదు. స్వయంగా పార్లమెంట్ లో చెపుతున్నారు.కేంద్రాన్ని వేడుకుంటున్నారు సహాయం చేయమని.
ఇది స్వయంకృత తప్పిదం కాదా?
ఆలోచన ముందు చూపు లేకుండా వెళ్లిన పరిస్థితి.
ఇందులో మానవ నైజం ఏమిటంటే ఏది చేశారో గుర్తు పెట్టుకోరు.ఏది చేయలేదో అదే గుర్తు పెట్టుకుంటారు.
పోనీ ఒక్క ఆర్థిక పరిస్థితి మాత్రమే అలా వుందని అనుకుంటే పాలన మొత్తం అలాగే వుంది.
ముఖ్యమంత్రి అంటే ప్రజలను కన్న బిడ్డలు లాగ చూసుకోవాలి. కానీ ఈయన కక్ష సాధింపు ధోరణి తో చూస్తున్నాడు.
అసలు పరిపాలన చేతకావటం లేదు.
అవినీతి తారాస్థాయికి చేరుకుంది.
అన్ని పథకాలలో అక్రమాలే… అన్యాయాలే.
వలంటీర్ వ్యవస్థ ఎందుకు?
అంతకు ముందు లబ్ధిదారులకు పథకాలు చేరలేదా?
గ్రామ సచివాలయాలు ఎందుకు? అది సమాంతర వ్యవస్థే కదా?
రేషన్ వ్యాన్లు ఎందుకు?ఇంతకు ముందు తీసుకున్నట్లు ప్రభుత్వం ఫ్రీ గా ఇచ్చిన దాన్ని ప్రజలు వెళ్లి తీసుకునే వారు కదా? ఇప్పుడు ఇంటికి పంపాలన్న చేతకాని ఆలోచన ఎందుకు?
అర్జంట్ గా అన్ని ఆఫీస్ లకు పార్టీ రంగులు వేయాలన్న కుత్సితపు ఆలోచన ఎందుకు? ఖజానా మీద ఎంత భారం పడింది?
104,108 సేవలు సక్రమంగా పని చేస్తున్నాయా? సరియైన నిర్వహణ లేదు.
RTC ని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు.బాగానే వుంది.బస్ లను కండిషన్ లో మైంటైన్ చేయలేని పరిస్థితి వల్లే కదా నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్సిడెంట్.
ఇసుక మాదే అత్యున్నత విధానం అని 3 సార్లు పాలసీ మార్చారు.దానిలో దోపిడీ తప్ప సామాన్యుడికి ప్రయోజనం ఉందా?
మద్యం విధానం ..దీని వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కదా;;. ఆ విధానంలోనూ దోపిడియే కదా;.
అమ్మ ఒడి. ప్రవేట్ లో చదువుతున్న వాళ్లకు అమ్మఒడి ఎవరైనా ఇస్తారా? ప్రవేట్ లో చదువుకునే సామర్థ్యం అంటే స్తోమతు ఉంటే వాళ్లకు అమ్మఒడి అవసరమా?
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి SC ST లు వస్తారు.వాళ్ళకి మీరు 40 శాతం ఖర్చు పెడితే సెంటర్ 60 శాతం ఖర్చు పెడుతుంది.అటువంటిది వాళ్ళ పథకాలు అన్ని తీసివేశారు ఆఖరికి పీజీ విద్యార్థుల స్కాలర్ షిప్ లతో పాటు అన్నీని.
మూడు sc కార్పొరేషన్ లు అవసరమా?
ఒక్క లోన్ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వని మూడు కార్పొరేషన్ లు ఎందుకు? అక్కడ కూడా ఖర్చే.
59 BC కార్పొరేషన్ లు అవసరమా? ఒక్క ఖర్చు ఉండేది అదే ఖర్చు ఇప్పుడు 59 ఆఫీస్ లకు పెట్టాలి? ఇది సబబేనా?
అన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి అన్నిటికి కార్పొరేషన్ చైర్మన్ లు ఆఫీస్ లు ఏర్పాటు చేయడం అవసరమా? పోనీ వాటి నుండి ఒక్కరికైనా లబ్ది చేకూరిందా?
దళితులు,మైనార్టీ లు మీద దాడులు జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి? కనీసం తెలిసికుందామని ఒక్కదానిలో నైనా న్యాయ విచారణ జరిపించారా?
సలహాదారులు … భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి కైనా ఇంతమంది సలహాదారులు ఉన్నారా?
కోర్ట్ కేస్ లకు బయటనుంచి తెచ్చే అడ్వకేట్ లకు ఎంతంత ఫీస్ ఇస్తున్నారు? ఇది కూడా దుబారాయే కదా….
ఇవన్నీ కంట్రోల్ చేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.అంతే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేకండి.
మీకు 22 మంది లోకసభ సభ్యులను ఇచ్చారు.
స్పెషల్ స్టేటస్ తెండి.లేకపోతే సభనుజరగ నివ్వకండి.విభజన హామీలకు పట్టు పట్టండి.రైల్వే జోన్ గురించి ఆందోళన చేయండి.పోలవరం నిధులు గురించి పోరాడండి.
మీ మీద ఉన్న కేస్ ల భయం తో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయకండి జగన్ గారు.

– రామ్మోహన్

LEAVE A RESPONSE