బహుదూరపు బాటసారిని

గమ్యం గమనికలో ఉంది
కానీ నా గమనం ఆగదు
లక్ష్యం చేరువలో ఉంది
కానీ అలక్ష్యం చేయను.
నేనొక బహుదూరపు బాటసారిని
మానుష్య పిపాసిని
నా యాత్ర లో పాదయాత్ర ఒక మజిలి
నా గమనంలో ఒక గమకం
నాతోటి అసహాయ శూరులకొక సహాయ హస్తం
తల్లడిల్లిన తల్లులకు తలవాల్చిన తరుణం
ఇంకా ఉంది
ఎంతో ఉంది
మన లక్ష్యం సాధించే రోజు
నా గమ్యం చేరే రోజు
అంతవరకు
నేనొక మానుష్య పిపాసిని
బహుదూరపు బాటసారిని

– గద్దె బుచ్చి తిరుపతి రావు

Leave a Reply