– రాష్ట్రంలో ఎక్కడా ఇసుక టన్ను రూ.475లకు లభించడం లేదు
– రాష్ట్రంనుంచి రోజుకి 2వేల లారీల ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలింపు
– టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, మైనింగ్ డైరక్టర్ వెంకటరెడ్డి నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఇసుకరీచ్ లను ఒక్కసారి జేపీ కంపెనీ పరంచేశాక వారేంచేసినా జోక్యంచేసుకోబోమని అవసరం చెప్పడం, ఏం జరిగినా జేపీసంస్థే బాధ్యతవహించాలనడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇవి బాధ్యత గల అధికారులు మాట్లాడాల్సిన మాటలుకావు.
నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరిపితే అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా?
వారి వ్యాఖ్యలు జెపి సంస్థ దోపిడీకి మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. నదీపరీవాహకప్రాంతాల్లో యథేచ్ఛగా రోడ్లనిర్మాణం చేపట్టి ఇసుకను దోపిడీ చేయడమే కాకుండా నెల్లూరుజిల్లాలో పెన్నానది పొర్లుకట్టలను కూడా తవ్వేస్తున్నారు. పొర్లుకట్లలపై భారీ ఇసుక వాహనాలను తిప్పడం వల్ల కట్టలు కోసుకుపోవడం, గుల్లబారి దెబ్బతినడం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ నేతల ఇసుక దోపిడీకి నెల్లూరుజిల్లాలో ఊళ్లకుఊళ్లే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. జేపీసంస్థ ఎలా వ్యవహరించినా, ఎంతదోచుకున్నా తమకు సంబంధంలేదని పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖాధికారులు చెప్పడం క్షమించరాని విషయం. వాల్టా చట్టం ప్రకారం నదీప్రవాహాం నడుమ ఇష్టానుసారం రోడ్లువేయడం, తవ్వకాలు జరపడం నిషేధమని తెలియదా?
అనుభవం లేని సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు?
వివిధ రకాల ఖనిజాల తవ్వకాల్లో అపార అనుభవంతోపాటు ఐఎస్ఓ సర్టిఫికేట్ కలిగిన ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఇసుకరీచ్ లను ఎలాంటి అనుభవం లేని జేపీసంస్థకు అప్పగించడం, సదరు సంస్థ మరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం నిబంధనలను
ఉల్లంఘించడమే. జేపీ సంస్థతో పాటు, ఇసుకరీచ్ లు నిర్వహి స్తున్న సబ్ కాంట్రాక్ట్ సంస్థ టర్న్ కీ కి ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణలో ఎలాంటి అనుభవంలేదు. జేపీసంస్థకు రీచ్ లు అప్పగించాక వారు ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చని ద్వివేదీగారు చెబుతున్నారు. అసలు ఆయనమాటలు పూర్తిబాధ్యతారాహిత్యంగా ఉన్నాయి.
అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
కృష్ణానది నుంచి, నెల్లూరులోని స్వర్ణముఖి, కర్నూలులోని తుంగభద్రనదుల నుంచి, రాష్ట్రంతోపాటు చెన్నై బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు అక్రమంగా ఇసుక లారీలు వెళుతు న్నాయి. చెన్నయ్ రెడ్ హిల్స్ ఏరియాలో ఏపీనుంచి వెళ్లిన ఇసుకలారీ లక్షా 50వేలకు అన్ లోడ్ చేస్తున్నారు. ఇసుక అక్రమరవాణా రాష్ట్ర సరిహద్దులు దాటి యథేచ్ఛగా సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా? ఎస్ ఈబీ విభాగం ఏం చేస్తోంది? రాష్ట్రంలోని నదులనుంచి రోజుకి 2వేల లారీలఇసుక పొరుగు రాష్ట్రాలకు అనధికారికంగా తరలిపోతోంది. ఇసుకతవ్వకాలు, రవాణారూపంలో సంవత్సరాని కి రూ.7వేలకోట్లవరకు ఈప్రభుత్వకనుసన్నల్లోనే దోపిడీజరుగుతోంది. దానిగురించి తాము ప్రశ్నిస్తే, ద్వివేదీ రీచ్ లలో జరిగేవాటితో తమకుసంబంధంలేదని ఎలాచెబుతారు?
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ పాపం ఇసుక అక్రమార్కులది కాదా?
కడపజిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయింది? చెయ్యేరునదిలో ఇసుక కాంట్రాక్టర్ల కోసం అధికారులు సకాలంలో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తకపోవడం వల్ల ఉధృతికి తమఇళ్లు, పశువులు, కొట్టుకు పోయాయని స్థానికులు వాపోయారు. ఇంత జరుగుతున్నా జేపీ సంస్థ ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణను అనుభవం లేని టర్న్ కీ అనే మరో సూట్ కేస్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఇష్టానుసారం వ్యవహరించవచ్చా?
సిసి కెమెరాలు పనిచేసేలా చూడటం మీ బాధ్యత కాదా?
ఇసుకరీచ్ లలో సీసీకెమెరాలు పనిచేస్తున్నాయో లేదో ఇప్పుడు పరిశీలిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన రీచ్ లలో ఇసుక తవ్వకాలు జరపకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తుంటే మైనింగ్ అధికారులు పట్టించుకోరా? ఎక్కడేం జరుగుతుందో పట్టించుకోకుండా తాముప్రశ్నించాక తాపీగా పరిశీలిస్తాము, చూస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా?
అధిక ధరలకు ఇసుక విక్రయిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు?
నేను ఇప్పుడు నెల్లూరుజిల్లాలోని చిట్టేపల్లి గ్రామంలో ఉన్నాను. అక్కడ జరుగుతున్న ఇసుకతవ్వకాలు పరిశీలించడానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో 3టన్నుల ట్రాక్టర్ ఇసుక (బాడీమట్టం) ను రవాణాఛార్జీలతో కలిపి రూ.6,500లకు కొంటున్నామని స్థానికులే చెబుతున్నారు. అంటే అన్నిఛార్జీలుకలిపి టన్నుఇసుకను స్వయంగా రీచ్ నుంచే దాదాపు రూ.1700, రూ.1800 వరకుకొంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే రీచ్ లలో ప్రభుత్వంచెప్పినట్లుగా టన్నుఇసుక రూ.475కు దొరుకుతుందా అని ప్రశిస్తున్నాం.
ప్రభుత్వాధికారులు సమాచారహక్కు చట్టం కింద ఇచ్చి సమాధానంలోనే రాష్ట్రంలోని ఒక్కో రీచ్ లో ఒక్కోధర అమలవుతున్నట్లు చెప్పారు. ఒకరీచ్ లో రూ.920, మరో రీచ్ లో రూ.1200లు, ఇంకోచోట రూ.800లు అని మీరే అధికారికంగా సమాచారమిచ్చారు. ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గమైన పులివెందులలో టన్నుఇసుక రూ.835 లకు అమ్ము తున్నారు. మీరుఇచ్చిన సమాచారాన్నే నిన్నమీడియావారికి తెలియచేశాము.
కాల్ సెంటర్ కు వచ్చిన 35వేల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు?
దానిపై ద్వివేదీ ఏం సమాధానంచెబుతారని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోని ఏ రీచ్ లో అయినా టన్ను ఇసుక రూ.475లు కంటే ఎక్కువ అమ్మితే ఫిర్యాదు చేయమని ద్వివేదీచెబుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేస్తే ఎవరుచర్యలు తీసుకుంటారు? ఇసుకదోపిడీపై ప్రజలనుంచి ప్రభుత్వానికి కాల్ సెంటర్ కు 35వేలకు పైగా ఫిర్యాదులువచ్చాయి. వాటన్నింటిపై ఈ ప్రభుత్వం, అధికారులు ఏంచర్యలు తీసుకున్నారు?
డిజిటల్ చెల్లింపులు ఎందుకు అనుమతించడం లేదు?
అసలు రీచ్ లలో ఇసుక కొనుగోళ్లప్రక్రియలో ఈ ప్రభుత్వం నగదుచెల్లింపులకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది? డిజిటల్ చెల్లింపులు ఎందుకుఅనుమతించడంలేదు? రీచ్ లలో పోగైన వేలకోట్లసొమ్ముని సాయంత్రానికి సంచుల్లోవేసి పంపించడానికే అలాచేస్తున్నారా? రేపు రాబోయేఎన్నికలకు కోట్లాదిరూపాయలు పంపిణీచేయడంకోసం ఇప్పుడు, ఇసుకను, మద్యాన్ని అక్రమార్జనవనరులుగా వాడుకుంటున్నారా? లారీల్లో గోతాలకు గోతాలకు బ్లాక్ మనీ, మందుగుండు సామగ్రితో కలిపి గోదాముల్లో స్టోర్ చేస్తున్నారు. రెండున్నరేళ్లనుంచి అదేపనిలో ఉన్నారు. అదంతాకూడా ఎన్నికలకోసమే. లేకపోతే మద్యంపై, ఇసుక అమ్మకాలపై ప్రభుత్వానికి వస్తున్నసొమ్మంతా ఎటుపోతోంది? ఇసుకరీచ్ లలో సీసీ కెమెరాలు పెట్టడం, పెట్టకపోవడం వాళ్లఇష్టమని, తవ్వకాలు వారిఇష్టమని, సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చుకోవడం వాళ్లఇష్టమంటున్న ద్వివేదీవ్యాఖ్యలే అందుకు ఊతమిస్తున్నాయి. ప్రభుత్వమే డైరెక్ట్ గా డబ్బులే కట్టాలి… డిజిటల్ చెల్లింపులులేవని చెప్పడందోపిడీ కోసంకాదా? ఇసుకరీచ్ లలో, మద్యందుకాణాల్లో ప్రభుత్వం ఎందుకు నగదుచెల్లింపులే అనుమతిస్తోంది?
సీనియర్ అధికారి అయిన గోపాలకృష్ణ ద్వివేదీ , వాస్తవాలు గ్రహించకుండా కళ్లుమూసుకొని గుడ్డిగుర్రం పళ్లుతోమినట్లుగా, కాకమ్మకబుర్లు చెబుతు న్నారు. రాజకీయనేతలు ఏంచెబితే అదిచేస్తే ఎలా? ఈరోజు పత్రికల్లోవచ్చినవార్తలు చదివితే ఆయనేంచెప్పారో ఆయనకే బోధపడుతుంది. నిన్నద్వివేదీ విధ్వంసకరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. జేపీ సంస్థ ఏంచేసుకుంటే మాకెందుకు..ప్రజలు నష్టపోతే మాకేంటి.. ఊళ్లుకొట్టుకుపోతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? జేపీసంస్థ, వారి నుంచి సబ్ కాంట్రాక్ట్ పొందినసంస్థ ఎన్నిపాపాలు చేసినా తమకేంపట్టదు అన్నట్లుగా ద్వివేదీ మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. ఆయనవ్యాఖ్యల్ని తాను తీవ్రంగాఖండిస్తున్నా. ఎన్నికలకుముందు ఏదో ఉద్ధరించేవాడిలా ప్రజల్లోకివెళ్లిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడెందుకు బారికేడ్లు, పోలీసులసాయంతో జనాన్ని తనవద్దకు రాకుండా అడ్డుకుంటున్నాడు?
టీడీపీహాయాంలో మాదిరిగానే ఉచిత ఇసుక విధానం అమలుచేయమని, ప్రజలకు ఆవిధంగా నైనా పుట్టినరోజు కానుకఇవ్వమని నిన్ననే చెప్పాము. తానువస్తే ప్రజలకు అన్నీచేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, నేడుప్రజలకు అరచేతిలో వైకుంఠంచూపిస్తూ, ఎందుకుఇంతలా విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాడు? రైతులకు ఎరువులుదొరకడంలేదు… గిట్టుబాటుధరలేదు. రైతుభరోసాకేంద్రాల్లో మొత్తం ఉత్పత్తులన్నీ కొంటున్నామని, 15రోజుల్లోనే రైతులకు డబ్బులి స్తున్నామని చెప్పుకుంటున్నారు.
ఎక్కడ, ఎంతమందికి ఇచ్చారోచెప్పండి. ఊరికే ఉత్తుత్తిప్రకటనలతో మభ్యపెట్టడంకాదు.. ప్రజలబాధలు ఆలకించండి, ఏ గ్రామంలో చూసినా జనాలకన్నీళ్లు, వారి వేదనలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లనిర్వహణ, వాటిల్లో జరిగే కార్యకలాపాలతో తమకు సంబంధంలేదన్న ద్వివేదీ, వెంకటరెడ్డిల వ్యాఖ్యల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా.