40 ఏళ్ళ రాజకీయ జీవితంలో బాబు చేసింది సున్నా..పూసింది సున్నం

Spread the love

– బాబు చెప్పిందేదీ చేయడు.. చెప్పింది చెప్పినట్టు చేసేది ఒక్క వైయస్ఆర్, జగన్ గార్లే
– జగన్ పుట్టినరోజునా బాబు డైవర్షన్ రాజకీయాలు
– టీడీపీ హయాంలోనే క్రైస్తవులపై దాడులు.. క్రిస్మస్ వేడుకల్లోనూ జగన్ నామ స్మరణేనా బాబూ..!?
– మద్యం షాపు వద్ద వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన దాడికీ పార్టీ రంగు, దళిత రంగు పులమడం బాబుకే చెల్లింది
– నీ లెక్కలేమిటో, నీ సైజు ఏమిటో నువ్వే తేల్చుకో లోకేష్..
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…నారా చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ని, ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రిగారి పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటే.. దాన్ని డైవర్ట్‌ చేయాలనే ఉద్దేశంతో బాబు ఇలా ప్రవర్తించారు. పనిలో పనిగా క్రైస్తవ సంస్థలను కూడా తెరపైకి తెచ్చి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను చేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు, చాలా బాధాకరం, మతాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. జగన్‌గారి పుట్టినరోజు వేడుకలను నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయాలని చివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా తాపత్రయం కూడా కనిపించింది.

49 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చక్కని పరిపాలన అందిస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని చూసి, బహుశా చంద్రబాబుకి వేరేది గుర్తుకు వచ్చి ఉంటుంది. తన కుమారుడు లోకేష్‌ కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేకపోతున్నాడనే ఈర్ష్యతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేశారనుకుంటాను. తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని, దాన్ని గొప్పగా చేసుకోవాలనుకునే వ్యక్తి కూడా జగన్‌ గారు కాదు. చాలా సింపుల్‌గా ఉండాలనుకుంటారు. అన్నివర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న తరుణంలో ప్రజలు జగన్‌గారిని ప్రశంసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు చేశారు.

చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో… తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు, బలహీనవర్గాలకు, విద్యార్థులకు గ్రామాలకు, రాష్ట్రానికి ఏదోదో చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏమీ చేయరు. కానీ చేసినట్లుగా కలలుగనే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయాలనుకున్నారట. కానీ వేసింది ఎవరూ సాక్షాత్తూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి . ఔటర్‌ రింగ్‌ రోడ్డు మొదటి రాయి నుంచి చివరి రాయి వరకూ వేసి, ప్రారంభించిన నాయకుడు వైయస్సార్‌. అదేవిధంగా పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వేను బాబు నిర్మించాలని అనుకున్నారట… కానీ రాజశేఖర్‌ రెడ్డి దాన్ని ప్రారంభించి, పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని తెచ్చింది తానే అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఐటీ వర్ధిల్లింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో.చేయనవి చేసినట్లు కలలు కనడం, ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం… ఎన్నికల తర్వాత వాటిని తుంగలో తొక్కేయడం బాబుకు బాగా అలవాటు.జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా మహిళలకు 26వేల కోట్ల రూపాయలు దశలవారీగా అందిస్తున్నారు. ఇది చూస్తుంటే చంద్రబాబుకు తాను డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిన రుణాలు గుర్తుకు వస్తాయని అనుకుంటున్నాం.

రైతులకు రైతు భరోసా, వైయస్ఆర్ చేయూతను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం రూ.87వేల కోట్లు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పి… తర్వాత వాటిని తుంగలోకి తొక్కి రూ.15వేల కోట్లు మాత్రమే అదికూడా దశలవారీగా చెల్లించి మోసం చేసిన విధానం కూడా మనం చూశాం. చంద్రబాబుకు ఇవేమీ గుర్తుండవు. జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించడం తప్ప.

చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీల గురించికానీ, ఆయన హయాంలో జరిగిన దారుణాల గురించి గానీ ఎప్పుడూ మాట్లాడలేడు. జగన్‌ తాను ఇచ్చిన హామీలలో 95శాతం వాగ్దానాలను నెరవేర్చారు. నూటికి 95శాతం హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. దాని గురించి ఆయన మాట్లాడలేరు. వాస్తవాలను మాట్లాడలేని దౌర్భగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు గతం లేదు… అంతా భవిష్యత్తు గురించే మాట్లాడతారు. గతం అంటే “నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు” కాబట్టే.

అమ్మ ఒడి లాంటి మంచి కార్యక్రమం కానీ, వైయస్సార్‌ లా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గానీ.. లేదా 108,104 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి… ఒక మంచి పథకం ప్రారంభించిన ఘనత తనకు ఉందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఏదో చేయాలానుకున్నాను… చేయలేకపోయాను. చేయాలానుకుంటున్నాను.. అంటూ, ఆయనది అంతా ఫ్యూచర్‌ టెన్సే కానీ పాస్టెన్స్‌ లేదు. కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది సున్నా. ప్రజలకు పూసింది సున్నం. అందుకే ఏం మాట్లాడలేరు.

గవర్నమెంట్‌ బడులు, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు నాయుడు విస్మరించారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ నాడు-నేడు కార్యక్రమం ద్వారా వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కేవలం 30 మాసాల్లోనే ఒక లక్షా 16వేల కోట్లు రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ఇవేమీ చంద్రబాబుకు గుర్తుండవు.

తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో.. చంద్రబాబు ఎప్పుడూ అది చేయాలనుకున్నాను.. ఇది చేయాలనుకున్నాను. కానీ చేయలేకపోయాను అంటారు.. కానీ 40 ఏళ్లలో చేసిందేమీ లేదు. డా. వైయస్సార్‌కు, చంద్రబాబుకు… జగన్‌ మోహన్‌ రెడ్డి కి, చంద్రబాబుకు అదే తేడా. అదేమిటంటే ‘వైయస్‌ఆర్‌ గారు కానీ, జగన్‌గారుకానీ ఇది చేశామని చెబుతారు. అదే చంద్రబాబు ఇది చేశానని చెప్పుకునేందుకు ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. అమరావతి కట్టాలనుకున్నాను, అందులో ఐకాన్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలనుకున్నాను. విజయవాడకు 80కిలోమీటర్లు, గుంటూరుకి 60కిలోమీటర్లు రింగ్‌రోడ్డు నిర్మించాలనుకున్నాను. ఒలింపిక్స్‌ గేమ్స్‌ కూడా ఇక్కడ నిర్వహించాలనుకున్నాను’ అంటాడు. కానీ చివరకు ఇక్కడ చేసింది సున్నా. అంతా శూన్యం.

ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు …చివరకు ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను కూడా తన హయాంలో పూర్తి చేయలేనటువంటి అసమర్ధుడు.
క్రైస్తవులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. టీడీపీ హయాంలోనే క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. నిన్న గుంటూరు జిల్లాలో దళితుడి మీద జరిగిన దాడి, తర్వాత అదే దళితుడు ఏం చెప్పాడంటే… మద్యం తాగుతూ, తాను, తనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు గొడవ పడ్డామని చెబితే… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దళితుడి మీద దాడి చేశారని, బాబు అచ్చెన్నాయుడు, లోకేష్ తో పాటు తన పార్టీలో ఉన్న దళిత నాయకులతో ప్రకటనలు చేయించి, ఏకంగా ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేయించాడు. సరే, ఫిర్యాదు వారి ఇష్టం. కానీ, దళితులకు మంచి చేసి ఉంటే, ఒక చిన్న దాడిని కూడా ఇలా రాజకీయం చేయాల్సిన దుస్థితి బాబుకు వచ్చేది కాదు కదా…

అది కులపరమైన దాడి కాదు. అది ఒక తగాదా అన్న వాస్తవం కళ్ళ ముందే కనిపిస్తున్నా, దానిని డైవర్ట్ చేయాల్సిన ఖర్మ బాబుకు ఎందుకు వచ్చిందంటే.. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అని అన్నందు వల్లే కదా.. తన రక్తంలో ఉన్న ఎస్సీ వ్యతిరేకత వల్లే కదా..

ఇక చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఈరోజు అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో తీసేశారట. దాంతో ఎస్సీలు తిరగబడ్డారని ఎల్లో ఛానళ్ళలో బ్రేకింగ్స్ వేసి దుష్ప్రచారం చేశారు. సంఘటనల్లో నిజానిజాలకు ముందే ఎస్సీలను రెచ్చగొట్టాలని, వైశ్యులను రెచ్చగొట్టాలని, ఇలా కులాల పరంగా ప్రభుత్వ వ్యతిరేక స్పందన ప్రజల నుంచి రావాలని బాబు నానా తంటాలు పడుతున్నాడు. కారణం, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చేసింది సున్నా.. పూసింది సున్నం… అంతా శూన్యం.

చంద్రబాబు ఏం మాట్లాడినా కూడా, ప్రతిదీ తనవైపుకు, తనకు అనుకూలంగా తిప్పుకోవాలకునే తాపత్రయం తప్ప, ప్రజా ప్రయోజనాలుగానీ, ప్రజల పట్ల బాధ్యతగానీ కనిపించవు. ఏ కార్యక్రమం జరిగినా జగన్‌ మీద పడి ఏడవడమే పని. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అందువల్లే ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుతుంటారు, ఏదీ చేయరు. సామాజిక విభజనల మీద తప్ప, సామాజిక ఏకీకరణ మీద నమ్మకం లేనివాడు, ప్రాంతాల మీద సమ దృష్టి లేనివాడు, కులాల మీద కుట్రలు తప్ప పెద్ద మనసు ఏనాడూ లేనివాడు చంద్రబాబు.

జీవితంలో ఏరోజూ ఎవరికీ మంచి చేయని వాడు, రైతులు అంటే చులకన భావంతో ఎగతాళి చేసినవాడు, ప్రభుత్వరంగాన్ని అమ్మేసినవాడు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఉండకూడదన్నవాడు, వైద్య రంగాన్ని కూడా ఆచరణలో ప్రైవేట్ పరం చేసినవాడు… ఇలాంటి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుండి వేరే మతాల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రజలకు మేలు చేయడం ద్వారా అధికారంలోకి రావాలనే ఆలోచన ఆయనకు లేదు. పండుగలను సైతం తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మంచి పద్ధతి కాదు.
వైయస్సార్‌ సీపీని పదేపదే విమర్శించి తాను పైకి రావాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టే అవకాశం మెండుగా ఉంది, చంద్రబాబు గమనించకపోవడం దురదృష్టకరమని భావిస్తున్నాం.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..
టీడీపీ అరాచకాలు, అక్రమాలు ఎల్లకాలం సాగవు. చంద్రబాబు అధికారంలో ఉన్న అయిదేళ్ల సమయంలో అన్యాయాలు, అక్రమాలు చేయబట్టే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. కేవలం 23 సీట్లు ఇచ్చి, చివరికి బాబు కొడుకు లోకేష్ ను కూడా మంగళగిరిలో ఓడించారు. అన్యాయాలు, అక్రమాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడో జరిగిన అన్యాయాలు, మా మీద రుద్ది పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. చక్కని పరి పాలన అందించేందుకే జగన్‌మోహన్‌ రెడ్డిగారు కట్టుబడి ఉన్నారు తప్ప, మరొకటి కాదని చంద్రబాబు గమనిస్తే మంచిది.

నారా లోకేష్‌ తల్లి ని ఎవరు ఏమన్నారు. ఎక్కడ అన్నారు.. ఏమన్నారో చెప్పాలి. ఆయన ఎవరి లెక్కలు తేలుస్తారు? వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కి ఏవిధమైన సంబంధం లేదు. మేమేదో అన్నామని మాటలు మాట్లాడి మమ్మల్ని అభాసుపాలు చేద్దామనే ప్రయత్నం చేయడం సరికాదు. ఎప్పుడు.. ఎక్కడ ఎలా అన్నాం? క్లిప్పింగ్‌ ఉంటే, వేసి చూపించమనండి. మా అమ్మను అన్నారని లోకేష్… నా భార్యను అన్నారని బాబు.. సింపతీ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మా లెక్కలు నువ్వు తేల్చేదేంటి? ముందుగా నీ లెక్కలు నీవు తేల్చుకుంటే చాలు. మంగళగిరిలో నీ లెక్కలు ఏంటో తేల్చుకో. రాష్ట్రంలో నీ లెక్కఏంటో, నీ సైజు ఏంటో తేల్చుకుంటే మంచిది.

ఓటీఎస్‌ మీద ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. ఓటీఎస్‌ ఉరితాడు అని, ఓటీఎస్‌ కట్టకపోతే రేషన్‌ కార్డు తీసేస్తారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదేమీ ప్రచారం చంద్రబాబు గారు..? ఇంటిపై సర్వహక్కుల ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ గారు గొప్ప పథకం తెస్తే… అలా చేయడానికి వీల్లేదని చంద్రబాబు చెప్పడం సరికాదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు ఇళ్ళపై ఉన్న రుణాలను రద్దు చేయాలనిగానీ, సర్వ హక్కులతో పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా?

ఇప్పుడు అంటున్నారు, ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు కాబట్టి. మీ మాటల్ని ప్రజలు ఎలా నమ్మాలి? రైతులకు 87వేల కోట్లు రుణమాఫి చేస్తామని అధికారంలోకి వచ్చి, వారిని ముంచిన మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావ్‌?
అధికారం కోసం అర్రులు చాస్తూరెచ్చిపోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు గుర్తుంచుకోండి. ఓటీఎస్‌ స్వచ్ఛందమే, లబ్దిదారుల ఇష్టప్రకారమే తప్ప బలవంతమేమీ కాదని చంద్రబాబుకు చెప్పదలచుకున్నాం. ఈ పథకాన్ని ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. లబ్ధిదారులకు ఉపయోగపడుతుందని వివరిస్తున్నాం. ఇష్టమైనవారు తీసుకుంటారు. డిబేట్‌ జరగడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఏది ధర్మమో, ఏది అధర్మమో ప్రజలే నిర్ణయిస్తారు.

మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని, ప్రత్యేక ప్యాకేజీ దగా, పచ్చి మోసం అని చెప్పాం. హోదాపై అప్పడు అధికారంలో ఉ‍న్న చంద్రబాబు నాయుడు హోదా వద్దు ప్యాకేజీ కావాలని తీసుకున్నారని కేంద్రమంత్రే స్వయంగా చెప్పారు కదా.. ప్రత్యేక హోదాపై మేం మాట తప్పం, మడమ తిప్పం. ఇప్పటికీ కేంద్రంతో పోరాడుతూనే ఉన్నాం.

అసలు చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదు. హోదాను ముంచేసిన వ్యక్తి. మీరు రాజీనామాలు చేస్తే.. ఇప్పుడు మేము రాజీనామాలు చేయాలా? అప్పుడేమి చేశారు చంద్రబాబూ. చేతగాని దద్దమ్మలు కాబట్టే టీడీపీని ప్రజలు గద్దె దించారు. అందుకే మీకు 23 సీట్లు ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకులే చేతగాని దద్దమ్మలు. జగన్‌గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. అందుకే అక్కసుతో, ఈర్ష్యతో ఏదోదో మాట్లాడుతున్నారు.

Leave a Reply