భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సినిమాలో రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్..
ఈ సినిమాను ఘన విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పాలి. అలాగే ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి చాలా చోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా మరో నయా రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ imdb లెక్కల ప్రకారం 2021 సంవత్సరానికి గాను భారతదేశపు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది అఖండ.
ఇది సినిమా పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ దాదాపు 23 శాతం ఓట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక imdb వారు ఇండియా వైడ్ గా అత్యంత జనాదరణ పొందిన టాప్ 5 సినిమాల లిస్ట్ ని ప్రకటించారు. వాటిలో బాలయ్య అఖండ సినిమా టాప్ ప్లేస్ లో నిలువగా.. స్పైడర్మ్యాన్, సూర్యవంశి,అంతిమ్, మనీహీస్ట్ తరువాత స్థానాలలో నిలిచాయి.
ఆ తర్వాత ఈ ఏడాదిలో ఆయా నెలలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 16 శాతం ఓట్లు, వైష్ణవ తేజ్ ఉప్పెన 16 శాతం, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు 12 శాతం, రవితేజ క్రాక్ 8% ఓట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక అఖండ సినిమా సాధించిన ఈ అరుదైన ఘనతతో బాలయ్య ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతే కాదు జై బాలయ్య అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాన్స్ అందరు ట్రెండ్ చేస్తున్నారు.