Suryaa.co.in

Features

సర్పాల మధ్య సంపద

సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ “సర్పబంధనం” .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు?

పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే ఒక తాటి చెట్టు అంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి తరువాత కొన్ని టన్నుల బెల్లం వేసి పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి చేరి పెద్ద చీమల పుట్ట ఏర్పడేది.చీమల పుట్ట లే కదా పాములకు ఆవాసాలు అయ్యేవి.

అంత పెద్ద చీమల పుట్ట లో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమం లో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమయిన ఆ గుంత సర్ప గృహం గా మారుతుంది. పుట్ట కాదు సర్ప గృహం. అది ఎవడైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వాటి కాటుకు మరణిస్తాడు.

ఆ సంపద తీయలనుకున్నప్పుడు నిపుణుడు అయిన వ్యక్తి అక్కడ సమీపం లో మరొక గుంత తొవ్వి మళ్ళీ సేమ్ బెల్లం తో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం నిర్వహించి ఆ పొగ కు ఆ పాములు అన్ని అక్కడి నుండి వేరే పుట్టలోకి పోయిన తరువాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని “తంత్ర శాస్త్రం” చెబుతుంది.

– నాగు

LEAVE A RESPONSE