Suryaa.co.in

Andhra Pradesh

హెచ్‌ఆర్‌సి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.వీరితోపాటు కమిషన్ గౌరవ జ్యుడిషియల్ సభ్యులు దండి సుబ్రహ్మణ్యం మరియు
hrc లోకాయుక్త మానవ హక్కుల కమిషన్‌ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పలువురు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కమిషన్ కార్యదర్శి రమణమూర్తి,పీఆర్వో రవి కుమార్, కమిషన్ విభాగ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్,పలువురు అధికారులు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కర్నూలు ఆర్డీవో శ్రీనివాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు పలువురు పోలీసు శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE