Suryaa.co.in

Telangana

కేటీఆర్‌ను కలసిన హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించినందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ , ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో పార్టీ ఎప్పుడూ ముందుండాలని మాగంటి గోపీనాధ్ ను కోరారు.

LEAVE A RESPONSE