ఒక సీనియర్ ఉద్యోగి తన PRC ల అనుభవం గురించి ఒకసారి గతంలో అప్పటి ముఖ్యమంత్రులు ప్రకటించిన PRC లు గమనిద్దాం.
నా సర్వీసులో నేను పొందిన PRC అనుభవాలు ఉదాహరణగా చూపిస్తున్నాను.
1993 ( కోట్ల విజయభాస్కరెడ్డి )
అప్పుడు నా Basic Pay ₹1080/- నుండి ₹2255/- గా మారింది. Double కంటే ఎక్కువ పెరిగింది.
1999 ( చంద్రబాబు నాయుడు )
నా Basic Pay 2675/- నుండి 5300/- గా మారింది. అంటే రెట్టింపు.
2005 లో (రాజశేఖరరెడ్డి )
నా Basic pay 6750/- నుండి 10,030/- ( రెట్టింపు కాలేదు. 13500 అయిఉండాలి కానీ కాలేదు)
2009 లో (రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి)
నా Basic Pay 11,125/- నుండి 20680/- గా మారింది. రెట్టింపు కాలేదు కానీ దగ్గర దగ్గర అయింది.
2014 లో చంద్రబాబు నాయుడు
2014 లో 1.6.2015 లో నా basic pay 25600/- గా ఉండేది. అప్పుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన PRC ప్రకారం 53950/- గా మారింది. ఒకేసారి basic pay double కంటే ఎక్కువ అయింది. Monitory benfit కింద ₹85000/- నగదు కూడా ఇచ్చారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు.
2022 లో జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు ఆలస్యంగా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు నా basic pay 67990/- అప్పటి చంద్రబాబు నాయుడు PRC ప్రకారము దాదాపు 1,40,000/- గా నా basic pay ఉండాలి. కానీ మన జగనన్న ఇచ్చిన తిరోగమన PRC వల్ల కేవలం 1,04,510 అవుతున్నది. దాదాపు
35000 లు తక్కువ. తిరిగి HRA 12 to 8 చేయడం వల్ల ఇంకా నష్టము పెరుగుతుంది. ఇది జీవితాంతం భరించాలి. ఈ జీవితం మళ్ళీ వస్తుందా? ఈ నష్టాన్ని పూడ్చలేనంతగా జరిగిపోయింది.
– ఒక సీనియర్ ఉద్యోగి, గుంటూరు