– పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు
విజయవాడ : ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉన్నారని… వాళ్లే ఉద్యమం చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్నారు.మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారని స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు సెక్రటేరీయేట్టులో వెయిట్ చేయించి అవమానం చేశారన్నారు.పోలీసుల వెనుక కూడా తామే ఉన్నామన్నారు. పీఆర్సీ ఈ విధంగా ప్రకటించడం చరిత్ర అని.. ఈ ఉద్యమం కూడా చరిత్రే అని చెప్పుకొచ్చారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ చేపడతామని.. ఏడు నుంచి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమ్మె వల్ల ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారన్నారు. ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని బొప్పరాజు పేర్కొన్నారు.