-( బొబ్బ సత్యనారాయణ)
ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలతో కూడిన పాంప్లేట్ చేతికిచ్చి.. ఫోటోగ్రాఫ్ తీసుకువెళుతున్నారు. ఎందుకు అని అడిగితే.. వాలంటీర్ సర్వే అని లేదా జనాభా లెక్క అని చెబుతున్నారు.
ప్రజల ఫోటోగ్రాఫ్ యెందుకు? దయచేసి గమనించండి ప్రశ్నించండి. ఫోటో గ్రాఫ్ ఇవ్వవద్దు. ఇప్పటికే మన డేటా అంతా వారివద్ద వుండగా.. మళ్ళీ ఫోటోలు యెందుకు? దొంగ ఓటర్ కార్డ్ ల సృష్టించడానికి అని అంటున్నారు. జాగ్రత్త.. ఎవరూ వాలంటీలరులకు ఫోటోగ్రాఫ్ యిచ్చి సహకరించవద్దు వివరాలు తెలియకుండా.
అలాగే వ్యవసాయభూమి వున్నవారినుండి భూమి శిస్తు కట్టించుకోవడంలేదు..భూమి శిస్తులు నీటి తీరువా అన్ని పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ప్రతిది వివరంగా తెలుసుకుంటూ వుండాలి. ప్రశ్నించాలి. ప్రజల మీద పన్నుల పేరిట అధిక డబ్బును గుంజడమే లక్ష్యంగా కనబడుతుంది. అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వుందాం. మీ ఓటర్ ఐడి పట్ల జాగ్రత్తగా వుండండి. ఓటు గల్లంతు అయితే కొత్త ఓటర్ కార్డ్ కోసం నమోదు చేసుకోండి. మున్సిపల్ ఎన్నికలు జరగలేదు కాబట్టి.. మన ఓటర్ కార్డ్ పట్ల శ్రద్ద కలిగి వుండాలి.
ఈ మధ్య తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో దొంగ ఓటర్ కార్డ్ లతో నకిలీ ఓటు వేసిన సంగతి మర్చిపోవద్దు. మీ ఓటు హక్కు జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్యంగా మీ వాలంటీర్ కు మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వవద్దు.