గ్రామాలను అభివృద్ధి చేసుకొనేందుకు ఎంన్నో ఆశయయాలతో ఎన్నికల్లో గెలిచిన దళిత సర్పంచ్ లకు అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెదపాలెం గ్రామ సర్పంచ్ దున్నా రాజేష్ మండలపరిషత్ సమావేశ మందిరంలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు.. పెదపాలెం గ్రామంలో ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న డ్రయినేజీ సమస్య పరిష్కారం కోసం తాము పంచాయతీ తీర్మానం చేసి అన్ని అనుమతులు తీసుకొని డ్రయినేజీ తవ్వితే అధికారులు అకారణంగా పూడ్చివేశారని, ఈ విషయమై ఎన్ని సార్లు అధికారులను కలిసినా దళిత సర్పంచ్ అయిన తనను అవమానించారని.. ఓ అధికారి అయితే మతి స్థిమితం లేదా అని ఎద్దేవా చేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు జరిగిన జగనన్న గృహ నిర్మాణ సమీక్షా సమావేశంలో సైతం తన మాటను ఆలకించకుండా అలక్ష్యం చేయటంతో రాజ్యాంగ ప్రకారం ఎన్నికైన పంచాయతీ బోర్డు అధికారాలను నిరంతరం ఆటంక పర్చటాచటాన్ని నిరాసిస్తూనే తాను నేలపై కూర్చొని నిరసన తెలిపానని అప్పుడు కూడా అధికారులు సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయేందుకు చూశారని సాటి సర్పంచి లు తనకు మద్దతుగా నిలవడంతో ఆగారని రాజేష్ తెలిపారు.
ఒక పంచాయతీ బోర్డు తీసుకొన్న నిర్ణయం మేరకు గ్రామంలో పనులు చేయటం రాజ్యాంగం హక్కు కలిగించిందని అధికారులు డ్రయిన్ పూడ్చివేసి బోర్డును అవమాణిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని రాజేష్ తెలిపారు.. సాటి సర్పంచ్ నేలపై కూర్చొని నిరసన తెలపడంతో సహచర సర్పంచ్ లు మండలి ఉదయ్ భాస్కర్, అంబటి శ్యాం లు రాజేష్ కు సర్ది చెప్పి నిరసనను విరమింపచేశారు.
ఇప్పటికైనా అధికారులు పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాలని తమ గ్రామ డ్రయినేజీ సమస్యను పరిష్కరించాలని రాజేష్ డిమాండ్ చేశారు.