Suryaa.co.in

Business News International

సత్య నాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు.అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్ పాల్జీ) బాధపడుతున్నాడు.
జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.

2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.

LEAVE A RESPONSE