– కేసీఆర్ రూపొందించిన శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర సినిమా అట్టర్ ప్లాప్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్
గత రెండ్రోజులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర జరిగిందంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగినట్లుంది. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా…. కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైంది.
ఈ విషయంలో కొందరు ఐపీఎస్ లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు పోలీసులంటే గౌరవం లేకుండా పోతోంది.కష్టపడి ఐపీఎస్ చదువుకున్న వాళ్లంతా చాలా బాధపడుతున్నరు. కొందరి వ్యవహారశైలి వల్ల హోంగార్డుల నుండి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఐపీఎస్ లను చూసి ఛీ కొడుతున్నరు. ప్రభుత్వాలు ఏవీ శాశ్వతం కాదు. పోలీసులు చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. చట్టాన్ని థిక్కరిస్తే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులే బలౌతారనే విషయాన్ని మర్చిపోకూడదు.
డీకే అరుణ, జితేందర్ రెడ్డి మీద వస్తున్న కథనాలు, మీడియాలో వస్తున్న కథనాలతోపాటు వారి ఇండ్లపై జరిగిన దాడిని చూస్తే బాధేస్తోంది. డీకే అరుణ మంత్రిగా పనిచేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి పని చేశారు. అలాంటి నేతలకు, హత్య కేసుకు ముడిపెట్టి కథనాలు రాయడం చాలా బాధ కలిగించింది.
జితేందర్ రెడ్డి సౌమ్యుడు. ఇచ్చిన బాధ్యతను తూ.చ తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి. రెండు సార్లు ఎంపీగా కొనసాగారు. గతంలో కేసీఆర్ వద్ద కూడా ఉన్నారు. కేసీఆర్ వద్ద ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు చేసిండు? ఎంతమందిని హత్య చేసిండో మరి కేసీఆర్ చెప్పాలి.
ఇకనైనా ఆధారాల్లేకుండా సీనియర్ నేతల వ్యక్తిత్వాన్ని చంపేసేలా కథనాలు రాయకూడదని కోరుతున్నా. ఇదిగో …ఎఫ్ఐఆర్ లోగానీ, రిమాండ్ రిపోర్ట్ లో గానీ ఎక్కడా వారి పేర్లు రాలేదు. కానీ రాత్రి నుండి టీఆర్ఎస్ నేతలు, మీడియాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై ఆరోపణలతో అనేక ప్రచారం చేస్తున్నరు.
ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తలకాయ యాడ పెట్టుకుంటరు? కేవలం బీజేపీని అప్రదిష్టపాల్జేయడానికి మాత్రమే సీఎం డైరెక్షన్ లో పన్నిన కుట్ర ఇది స్పష్టంగా అర్ధమవుతోంది.
అవినీతి ఆరోపణలున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడటంలో భాగంగా సీఎం ఒక తప్పు చేయబోయి…మరిన్ని తప్పులు చేస్తున్నట్లు స్పష్టమైంది. బీజేపీ హత్యా రాజకీయాలను ఎన్నటికీ సమర్ధించదు. మంత్రిపైనే కాదు… మామూలు వ్యక్తిపై హత్యకు కుట్ర చేసినా తప్పే.
కానీ ఎవరైతే మంత్రి అవినీతి, అక్రమాలపైన పూర్తి ఆధారాలతో సహా కోర్టులను, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారో…. ఎవరైతే తమను హత్య చేసే కుట్ర జరుగుతోందని, తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారో…. వారికి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ కూడా ఆదేశాలిస్తే చివరకు వాళ్లే శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేం న్యాయం? సరే…ఈ అంశాలన్నీ ఇప్పుడు న్యాయ స్థానం పరిధిలో ఉన్నందున ఇంతకంటే ఎక్కవు మాట్లాడలేను. కోర్టులో నిజానిజాలు తేలుతాయి.
కానీ శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, భూ కబ్జాల గురించి మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలుసు. అందుకే టీఆర్ఎస్ ను ఛీదరించుకుంటున్నరు. బీజేపీని ఆదరిస్తున్నరు. సీఎం చేసిన సర్వేలన్నింట్లోనూ ఇవే రిపోర్టులొస్తుండటంతో దీనిని దారి మళ్లించి బీజేపీని బదనాం చేయడానికి ఆడిన డ్రామా ఇది. అందుకే సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసే వారిపైన, అమాయకులపైన కేసులు పెడుతున్నరు.
స్థానిక మంత్రి అక్రమాలు, భూ దందాలు, ఇసుక దందాలు తెలియని దెవరికి? చివరకు తనకు కప్పం కట్టకపోతే మహబూబ్ నగర్ జిల్లాలో ఏ వ్యాపారులు చేసుకునే పరిస్థితి కూడా లేదు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. బెదిరింపుల్లో, రేపుల్లో, భూ కబ్జాల్లో, హత్యల్లోసహా ఇందుగలడందు లేదనే విధంగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలపైనే కేసులున్నయ్.నిర్మల్ లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల హిందూ బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి రెండు రోజులపాటు దారుణం చేస్తే వాడిని పట్టుకోవడానికి ఈ పోలీసులకు చేత కాలేదు. వారం రో జులు పట్టింది.
కానీ మంత్రిని హత్య చేస్తానికి కుట్ర పన్నారంటూ వీళ్లను మాత్రం ఒక్కరోజులోనే ఢిల్లీ పోయి పట్టుకొచ్చిండ్రు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వెళ్లినప్పుడు… ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చి ఆరోపణలున్న వారిని అదుపులోకి తీసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా… కనీసం కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోకుండా చెప్పాపెట్టకుండా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే ఈ సమాజానికి పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నరు?
మాకేం చెప్పొద్దు… మేం బరి తెగించి ఉన్నాం… మేం ఏం చేసినా ఎవరూ అనే వారు లేరు… ఏదైనా జరిగితే మమ్ముల్ని సీఎం కాపాడాతరనే ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే రాష్ట్ర పోలీసుల తీరుపై మేం ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విచారణను తెలంగాణ పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా?
అసలు జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంది? డ్రైవర్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? చివరకు ఈ ఎపిసోడ్ పై ఫిర్యాదు చేసిన జితేందర్ రెడ్డి పీఏ రాజును కూడా ఈ కేసులో ఇరికించే కుట్ర చేయడమేంటి? ఆయనను కూడా విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం సిగ్గు చేటు.
చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే థిక్కరిస్తున్నరు. ఇంటిపై దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను కిడ్నాప్ చేసి కొట్టి బలవంతం చేస్తుంటే…. వీళ్లు పోలీసు అధికారులు ఎట్లా అయ్యారో అర్ధం కావడం లేదు. నిన్న సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే… జనం నవ్వుకుంటున్నరు. పాపం ఆయన మాత్రం ఏం జేస్తడు. పైవాళ్లు చెప్పినట్లు చెప్పలేక నానా ఇబ్బంది పడ్డట్లు కన్పించింది.
ఇదిగో పోలీసుల రూపొందించిన రిమాండ్ రిపోర్ట్… మీకు పంపిస్తున్నాం. ఇందులోని వివరాలు చదివిస్తే పోలీసుల ఎన్ని కథలల్లారో అర్ధమవుతోంది. సీఎం పూర్తి డిప్రెషన్ లో ఉన్నట్లుంది. బహుశా ఏ సర్వే చూసినా జనం బీజేపీవైపు కన్పిస్తున్నరు. ఏం చేయాలో అర్ధం కాక ఈ డ్రామా ఆడినట్లున్నరు.పైగా ఏ ఎమ్మెల్యే, మంత్రిపై చూసినా అవినీతి ఆరోపణలే. సీఎంపై కూడా అవినీతి ఆరోపణలే. దీనిని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఉద్యమకారులను కుట్ర దారులుగా చిత్రీకరిస్తూ దారి మళ్లించే కుట్రలకు తెరదీస్తున్నరు.
నిన్న జరిగిన మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తాం. మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
సీఎంకు మంచి సలహాలివ్వాల్సిన స్ట్రాటజిస్టులే ఇలాంటి అరాచకాలు, హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తే ఎట్లా? అలాంటి వారిపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్ట్రాటజిస్ట్ పాత్ర ఏమిటి? లేక సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలి. బీజేపీ మాత్రం ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. తెగించి కొట్లాడతాం.
తెలంగాణ ప్రజలకు నా విజ్ఝప్తి…… డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఏ విధంగా కుట్ర చేసిందో ఆలోచించాలి. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలి. బీజేపికి మద్దతివ్వాలని కోరుతున్నా.మీడియా అడిగిన ప్రశ్నలకు…. నాపైనా దాడి చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ పైనా దాడి చేశారు. నిన్న డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇండ్లపై దాడి చేశారు. పెట్రోలుతో దాడులు చేసిండ్రు…ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా… ఢిల్లీలో వాళ్లున్న అకామిడేషన్ నా పేరు మీదే ఉంది. అందులో
భయమేముంది? మేం ప్రజల్లో తిరిగేటోళ్లం. ప్రజలు ఢిల్లీకి వస్తే వాళ్లకు ఆశ్రయమిస్తాం. భోజనం పెడతాం. నువ్వు (కేసీఆర్ ను ఉద్దేశించి) ఎట్లాగూ ఎవరికి దొరకవ్. తిండి పెట్టవ్. నీకు మానవత్వం కూడా లేదు. సంస్కారం అసలే లేదు.కేసీఆర్ చర్చల కోసం ఢిల్లీకే కాదు.. యాడికైనా పోతాడు… నెక్స్ట్ ఉక్రెయిన్, రష్యాలకు కూడా పోతాడేమో (ఎద్దేవా చేస్తూ..).తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా బీజేపీ సహించబోదు. చట్ట, న్యాయపరంగా పోరాడతాం.బాధితుల పక్షాన ఉద్యమిస్తాం. తప్పు చేస్తే ఎవరినీ సమర్ధించే ప్రసక్తే లేదు.
మీడియా సమావేశంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహా ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కొల్లి మాధవి, సీనియర్ నాయకులు నాగూరావు నామోజీ, భరత్ గౌడ్, జె.సంగప్ప, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఆంటోనీ రెడ్డి, అఫ్సర్ పాషా, ఆలె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.