– వివేకాహత్యోదంతం సహా, అమరావతిపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు, జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ యువత,మహిళలకు జరుగుతున్న అన్యాయం, రైతులసమస్యలుసహా 13 అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాం
• అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు టీడీపీ వెళ్లకుండా ఉంటేనే మంచిదని పొలిట్ బ్యూరోలో మెజారిటీసభ్యులు అభిప్రాయపడ్డారు
• చంద్రబాబు పార్టీఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో చర్చించాక తుదినిర్ణయం ప్రకటిస్తారు
• అమరావతి విషయంలో ఈముఖ్యమంత్రి చేసిన తప్పులను ఇప్పుడైనా సరిదిద్దుకుంటే మంచిది
• సీఆర్డీఏ చట్టప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలనిచెప్పడంద్వారా హైకోర్ట్ ఆచట్టం యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పింది
• అమరావతి విషయంలో చట్టప్రకారం ప్రజాస్వామ్యపద్ధతిలో ప్రభుత్వం నడుచుకోకుంటే, అందుకు తగినమూల్యం చెల్లించుకుంటుంది
• కోర్టు తీర్పుని కాదని, తన అహంప్రకారమే ముఖ్యమంత్రి నడుచుకుంటే న్యాయస్థానంలో ఆయనదోషిగా నిలబడక తప్పదు
• హైదరాబాద్ లో టీడీపీ ఆవిర్భావదినోత్సవం కార్యక్రమాన్ని40ఏళ్ల తెలుగుదేశం పేరుతో ఘనంగా నిర్వహించబోతున్నాం.
• పార్టీ మహానాడుని, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతిని విజయవాడలో దేశంగర్వించేలా నిర్వహిస్తాం
– మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కాల్వ శ్రీనివాసులు
టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడి గారి అధ్యక్షతన నేడు జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరోసమావేశంలో 13అంశాలపై సుదీర్ఘం గా చర్చించామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసు లు తెలిపారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
అమరావతిపై నేడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి వి ధ్వంసకర ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు చెంపపెట్టువంటిద ని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. సీఆర్డీఏ చట్టప్రకారమే రాష్ట్రప్రభుత్వం నడుచుకోవాలనిచెప్పడం ద్వారా హైకోర్ట్ ఆ చట్టం యొక్క గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్ప్పింది.
అలానే తెలుగు ప్రజలకు రాజధానిని దూరంచేయాలన్న పాలకుల ఆలోచనలను కూడా న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈమూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంద్వారా రాష్ట్ర భవిష్యత్ ను తుత్తునియలుచేశారు. దాదాపు ఈమూడేళ్లలో 136కు పైగా ప్రముఖసంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టకుండా గతంలో ప్రభుత్వంతో చేసుకున్నఒప్పందాలను రద్దుచేసుకోవడం వల్ల ఈరాష్ట్రానికి కలిగిన నష్టంపైకూడా పొలిట్ బ్యూరోలో చర్చించాము.
జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో అమరావతిద్వారా ఏటా రాష్ట్రాని కి రావాల్సిన రూ.12వేలకోట్లనుంచి రూ.13వేలకోట్ల ఆదాయం రా కుండాపోయింది. అమరావతి నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపేయ డంద్వారా, రూ.2లక్షలకోట్లవరకు ఆస్తినష్టం జరిగింది.
రాజధాని లో నిర్మాణాలకు పోగా మిగిలిన 10వేలఎకరాల భూమి నిరర్థంగా మారడంవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపైకూడా పొలిట్ బ్యూరోసమా వేశంలో విచారంవ్యక్తంచేయడంజరిగింది. రాబోయే కాలంలో అయి నా ఈ ప్రభుత్వం, పెడధోరణలు అవలభించకుండా అమరావతి అభివృద్ధిపై దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నాం.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వివేకానందరెడ్డిహత్యకేసుపై కూడా సమావేశంలో చర్చించాము. ఆయనఇంట్లో వివేకాను అత్యంత కిరాతకంగా చంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబుగారిపై మోప డానికి ప్రయత్నంచేసిందికాక, నేడు సీబీఐ విచారణలో ఒక్కొక్కటి గా అసలువాస్తవాలు బయటకువస్తున్న తరుణంలో ఆ నేరంపై మరలా కొత్తగా కట్టుకథలు అల్లడం చూస్తున్నాం. దాన్ని అటు తిప్పి, ఇటుతిప్పి తిరిగి చంద్రబాబుకే అంటగట్టాలని చూడటం, సాక్షిమీడియాను అడ్డంపెట్టుకొని దాన్ని హత్యను తనస్వార్థానికి వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడాన్ని చూస్తున్నాం . హత్యకు పాల్పడిందిఎవరు.. హత్యతర్వాత రక్తపుమరకలు ఇతర ఆధారాలు చెరిపేసిందిఎవరు..హత్యతర్వాత దాన్ని గుండె పోటుగా చిత్రీకరించిందిఎవరనేది ప్రజలకు అర్థమైంది.
హత్యనేప థ్యం తాలూకా పూర్వాపరాలను , అదిజరిగననాడే పులివెందుల ప్రజలు గ్రహించారు. అన్నివేళ్లు ఆనాడే అవినాశ్ రెడ్డివైపు చూపిన వాస్తవాన్ని మర్చిపోయిన పాలకులు,ఇప్పటికీ వారి అవినీతి పత్రిక సాక్షిలో అసత్యకథనాలుప్రచురిస్తూ, సత్యాన్నిసమాధి చేయ డానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జగన్ అండ్ గ్యాంగ్ వివేకా హత్యోదంతలోచేస్తున్న కుటిలప్రయత్నాలనుకూడా టీడీపీ పొలి ట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. వివేకాహత్యకేసు విచారణచేస్తున్న సీబీఐ ఎంతత్వరగా వీలైతే అంతత్వరగా అసలుదోషులను అరెస్ట్ చేసి, విచారించాలని కూడా టీడీపీ పొలిట్ బ్యూరోసమావేశం అభి ప్రాయపడింది.
అమరావతి, వివేకానందరెడ్డి హత్య అంశాలతోపాటు, రాష్ట్రంలోని సామాన్యులు, మరీ ముఖ్యంగా బడుగుబలహీనవర్గాల వారు ఈ ప్రభుత్వఅవినీతికి ఎలా బలైపోతున్నారోకూడా చర్చించాము.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులు,మహిళలు, నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వతీరుపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తు న్నారు. సకాలంలో ప్రభుత్వం ఆయావర్గాలకు అందించాల్సిన చేయూతను అందివ్వకపోగా, వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్న పాలకుల తీరుపై సమావేశంలో చర్చించాము.
అలానే పంచాయతీల నిధులమళ్లింపు, ఓటీఎస్ వసూళ్లు, గృహనిర్మాణ రంగాన్ని నిర్వీర్యంచేస్తున్న తీరు, చెత్తపన్నుపేరుతో చేస్తున్నదోపి డీ, పాఠశాలలవిలీనం, రేషన్ సరుకుల్లోకోతపెట్టడం లాంటి అనేక కీలకమైన ప్రజాసంబంధ అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరోసమావే శంలో చర్చజరిగింది.
టీడీపీప్రభుత్వం గతంలో బలహీనవర్గాలకు అమలుచేసిన దాదా పు 35 సంక్షేమపథకాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగా నే రద్దుచేశాడు. జగన్మోహన్ రెడ్డిచర్యతో లక్షలాదిమందికి తీవ్రమైన అన్యాయంజరిగింది. అవన్నీ ఒకెత్తు అయితే ఈప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ప్రచారయావతో వందలకోట్లప్రజాధనాన్ని దుర్విని యోగంచేస్తున్నారు.
సొంతపత్రిక సాక్షికి ప్రకటనలరూపంలో ప్రజల సొమ్మినిదోచిపెడుతున్న తీరుని కూడా పొలిట్ బ్యూరోసమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనదోపిడీకి, సొంతపత్రికకు, సొంతసంస్థలకు దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.
గడచిన మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, బాలికల పై దాదాపు 1500లకు పైగా అమానవీయ సంఘటనలుచోటు చేసుకున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దాడులు, వేధింపుల వంటి అనేకఘటనలుఉన్నాయి. వాటిని ఎండగట్టే క్రమంలో టీడీపీ మహిళావిభాగం నారీ-భేరీ పేరుతో కార్యక్రమం నిర్వహించబోతోంది .
జగన్మోహన్ రెడ్డి సంక్షేమపథకాల్లో కోతపెట్టి, ఏవర్గాలకు అయితే మొండిచెయ్యిచూపాడో, ఆయావర్గాలను సమీకరించి, వారిహక్కు లకోసం దశలవారీగా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. ఆ క్రమంలో దళితులు, మహిళలకు సంబంధించి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలునిర్వహించాము. మిగిలినవర్గాలకుజరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటేలా త్వరలోనే మరిన్నికార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాము.
కేంద్రప్రభుత్వపథకాలకు రాష్ట్రప్రభుత్వం తనవాటాగాచెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకుండా, వేలకోట్లరూపాయల పథ కాలు రాష్ట్రంలో అమలుకాకుండాపోతున్నాయి. ఎస్సీలు, బీసీలకు కేంద్రం అందించే అనేకసంక్షేమపథకాలు రాష్ట్రంలో నిలిచిపోయా యి. దాదాపు రూ.12వేలకోట్ల విలువచేసే కేంద్రప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అర్థాంతరంగా ఆగిపోవడంపైకూడా సమావేశం లోచర్చించాము. 2014నుంచి మూడేళ్లలో రాష్ట్రఆదాయం రూ.3లక్షల60,561కోట్లుఅయితే, 2019-22 మధ్యన రూ.6 లక్షల 82,480కోట్లవరకు వచ్చింది.
గతప్రభుత్వంతో పోలిస్తే దాదా పు రూ.లక్షా20వేలకోట్లవరకు అధికఆదాయం ఈ ప్రభుత్వానికి వచ్చినా, గతంలో కంటేఎక్కువగా అప్పులుచేసినా సంక్షేమ పథ కాల్లో ఎందుకుకోతలు పెట్టారో, ఎందుకునిర్లక్ష్యంగా వ్యవహరించారో సమాధానంచెప్పాలని సమావేశంలో డిమాండ్ చేశాము. ఈ మోస కారీ ప్రభుత్వవైఖరితో బడుగుబలహీనవర్గాలు తీవ్రంగా నష్టపోతు న్నాయి. నిరుద్యోగయువతకు భృతిలేదు…ఎస్సీ,ఎస్టీ, బీసీ యువకులు వారికాళ్లపై వారు నిలబడేలా, ప్రభుత్వంనుంచి రాయితీపై రుణాలు అందడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రా యపడింది.
అప్పుల విషయానికివస్తే 60ఏళ్లలో రాష్ట్రంచేసిన అప్పు3.14లక్షల కోట్లు అయితే, కేవలంమూడేళ్లలోనే ఈప్రభుత్వం దాన్ని రూ.7లక్ష లకోట్లకుపెంచేసింది. అప్పులభారంప్రజలపై పడినాకూడా సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందించడానికి జగన్మోహన్ రెడ్డికి చేతు లు రావడంలేదు. ముఖ్యమంత్రి వైఖరితో స్వయంఉపాధి పథకా లు మూలనపడి, లక్షలాది మంది ఎస్సీ,ఎస్టీ, బీసీయువత తీవ్ర మైన నిర్వేదంతో ఉన్నారన్న అంశాన్ని కూడా టీడీపీ పరిగణనలోకి తీసుకుంది.
రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం 16శాతానికి పెరిగిం ది. ప్రభుత్వవైఖరితో నిరుద్యోగ యువతలో తీవ్రమైన ఆగ్రహావేశా లు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీ,ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లిస్తూ, వాటిని కూడా ఈప్రభుత్వం తనసొంత అవసరాలకు వాడుకుంటోంది. కేంద్రప్రభుత్వం అందించిన ఉపాధిహామీ పథకం నిధుల్లో దేశవ్యాప్తంగా దాదాపు రూ.974కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైతే, వాటిలో రూ.251కోట్ల నిధులుఏపీలో దుర్వినియోగమయ్యాయని కేంద్రప్రభుత్వం గుర్తించింది.
అలాంటివి కాకుండానే నిత్యం ఇసుక, మద్యం, గ్రావెల్ ఇతరత్రా ఖనిజాలను అక్రమంగా దోచేస్తూ, వేలకోట్లవిలువైన సహజవనరు లను ఇతరరాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇలాంటి దోపిడీప్రభుత్వా న్ని, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకుఎప్పుడూ ఎవరూ చూడలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసమావేశం అభిప్రాయపడింది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేని కారణంగా రాష్ట్రవ్యవసాయ రంగం తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా సొమ్ము అందించలేని దుస్థితిలో ఈప్రభు త్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గొప్పగా ప్రకటించిన ధరలస్థిరీకరణ నిధి ఎక్కడుందో, ఎంతమంది రైతులకు మేలుచేసిందో తెలియని స్థితి. రైతాంగం వారిఉత్పత్తులను అయినకాడికి తెగనమ్ముకుం టున్నా, ప్రభుత్వంలో చలనంలేదు. దానిపైకూడా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాము.
కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అందించిన సేవలను, టీడీపీ ఎన్నారై విభాగంతో కలిసి, ఉక్రెయిన్ లోచిక్కుకున్న తెలు గు విద్యార్థులను స్వస్థలాలకు తరలించడంలో చంద్రబాబుగారు చూపిన చొరవనుకూడా సమావేశంలో ప్రశంసించడంజరిగింది. విద్యార్థులతో మాట్లాడుతూ, అక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థి క్షేమంగా వారివా రిప్రాంతాలకు చేరేవరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించడంలో, మరీ ముఖ్యం గా విభజనహామీలసాధనలో జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ ఎంపీ ల వైఫల్యాన్ని సమావేశంలో చర్చించాము. ప్రత్యేకహోదాపేరుతో గతంలో జగన్ ఆడిననాటకాలు, ఇప్పుడు ఆయన మాట్లాడుతు న్నతీరు, వైసీపీఎంపీలు ఢిల్లీలో తెలుగువారిపరువుతీస్తున్న విధానాలపై, రాయలసీమ,ఉత్తరాంద్రప్రాంతాలకు ఇస్తామన్న నిధులు, విశాఖరైల్వేజోన్ లాంటి అంశాలపైకూడా చర్చించాము.
వాటితో పాటు తెలుగుదేశంపరంగా చేపట్టబోయే కార్యక్రమాలను గురించి కూడా చర్చించాము. త్వరలోనే పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అలానే పార్టీ ఆవిర్భావదినోత్స వం సందర్భంగా టీడీపీ ఆవిర్భవించి 40ఏళ్లు అవుతున్న సంద ర్భాన్ని పురస్కరించుకొని చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించాము. మార్చి 29వ తేదీన 40ఏళ్ల తెలుగు దేశం కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాము.
ఎందుకంటే టీడీపీ ఆవిర్భవించింది హైదరాబాద్ నగరంలోకాబట్టి, అక్కడే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానిం చాము. మహానాడుని మాత్రం విజయవాడలో నిర్వహించబోతు న్నాం. అలానే టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తార క రామారావు శతజయంతి కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరూవాడా ఘనంగా నిర్వహించబోతున్నాం. టీడీపీ ఆవి ర్భావంవెనకున్న గొప్పతనాన్ని ఈ కాలం యువతకు తెలిసొచ్చే లా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామనిచెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాము.
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల అంశంపైకూడా తాము చర్చించా ము. ప్రజాస్వామ్యపధ్ధతిలో సభలనిర్వహణ జరగడంలేదు కాబట్టి, ప్రతిపక్షంచెప్పే వాటిని పాలకపక్షం వినేపరిస్థితిలో లేదుకాబట్టి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో శాసనసభ కౌరవసభగామారి దుర్మార్గంగా తయారైందికాబట్టి, మెజారిటీ సభ్యులంతా సమావేశాలు బహిష్కరిస్తేనే మంచిదని సూచించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడాక అధినేత చంద్రబాబు గారు అసెంబ్లీ, కౌన్సిల్ (మండలి) సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన 13 అంశాలు కాకుండా ఇటీవల సంభవించిన మరణాలపై సంతాపసందేశంకూడా వ్యక్తం చేయడం జరిగింది.