Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రిని బయటపడేయడానికి సవాంగ్ ఎందుకింత తపన?

– సవాంగ్ పత్రికా ప్రకటనపై సీబీఐ దృష్టి సారించాలి
• తనకు సంబంధంలేని అంశాలపై పత్రికాప్రకటన విడుదలచేసిన సవాంగ్ గారు, వివేకాహత్యకేసునుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడే బాధ్యతను తనభుజస్కంధాలపై వేసుకున్నారు
• వివేకాకుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను ఖండిస్తూ, గౌతమ్ సవాంగ్ పేరుతో తాజాగా విడుదలైన ప్రకటన పై సీబీఐ దృష్టిపెట్టాలి
• ఎవరి ప్రమేయంతో, ఎవరి ఒత్తిడితో, ఎవరిని కాపాడటానికి సవాంగ్ అలాంటి ప్రకటనచేశారో తేల్చాలి
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

నిన్నమొన్నటివరకుతన పరువుప్రతిష్టలు పణంగా పెట్టిమరీ ముఖ్యమంత్రి సేవలో డీజీపీగా తరించిన గౌతమ్ సవాంగ్, ఇప్పటి కీ వివేకాహత్యకేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నిం చడం చూస్తుంటే అసహ్యంగాఉందని టీడీపీ జాతీయప్రధాన కార్య దర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

నిన్నమొన్నటివరకు తనపరువు ప్రతిష్టలుపణంగాపెట్టి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో డీజీపీగా తరించిన గౌతమ్ సవాంగ్, డీజీపీగా బదిలీఅయ్యాక కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికిఏమైనాజరుగుతుందేమోనన్న ఆరాటం తో వివేకాహత్యకేసుగురించి మాట్లాడుతున్నాడు. సవాంగ్ ను అత్యంత అవమానకరంగా ముఖ్యమంత్రి డీజీపీపదవినుంచి తప్పించినప్పటికీ, సవాంగ్ లోని స్వామిభక్తి సన్నగిల్లలేదు.

తాను డీజీపీగాఉన్నప్పడు వివేకాహత్యకేసునుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి తనపరువుప్రతిష్టలు పణంగా పెట్టిమరీ సవాంగ్ పనిచేశారు అనిచెప్పడానికి, ఇప్పుడు ఆయన విడుదలచేసిన ప్రకటనేనిదర్శనం. సాధారణంగా డీజీపీగా పనిచేసిన వారు ఎవరైనా వారిహాయాంలో వారు విచారించిన కేసులగురించి మాట్లాడరు.

ఇప్పుడు ఎవరైతే డీజీపీగా ఉన్నారో, వారిని అడగమని చెబుతారు. కానీ సవాంగ్ లో వివేకాహత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అన్యాయంజరుగుతుందేమోన న్న ఆరాటం ఇప్పటికీ కనిపిస్తోంది. డీజీపీగా వైదొలిగాకకూడా, తానుచేసే ప్రకటన తనకేనష్టమని, తనపరువు బజారున పడుతుందన్న ఆలోచన కూడా లేకుండా సవాంగ్ వివేకాహత్యపై మాట్లాడాడు. తనవిలువలు తగ్గించబడతాయన్న ఆలోచన లేకుం డా సవాంగ్ విడుదలచేసినప్రకటనలోని అంశాలున్నాయి. సవాం గ్ ఎందుకింతలా దిగజారి ప్రకటన ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం.

వివేకా కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో డీజీపీగా ఉన్నసవాంగ్ , హత్యకేసులో కీలకవ్యక్తులైన ఇద్దరు తనకురెండుకళ్లని ముఖ్యమంత్రి తనతో గతంలో అన్నట్లు సీబీఐవారితో చెప్పింది. దానిపై ఇప్పుడు సవాంగ్ మాట్లాడు తూ, తానుడీజీపీగాఉన్నప్పుడు అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డి తనను ఎప్పుడూ కలవలేదన్నారు. అవినాశ్ రెడ్డి, వివేకానందరెడ్డి తనకు రెండుకళ్ల ని ముఖ్యమంత్రి అన్నట్లు డీజీపీగాఉన్నప్పుడు సవాంగ్ చెప్పారు. అసలు వివేకాహత్యలో సవాంగ్ ని ఎవరూ కలవనప్పుడు, ముఖ్యమంత్రి నిందితులుతనకు రెండుకళ్లు అన్నప్పుడు, డీజీపీగాఉన్నప్పుడు ఆయనకు ఎప్పుడూ ఒకకంటిపై అనుమానం కలగలేదా? ముఖ్యమంత్రి చెప్పిన రెండుకళ్లలో ఒక కన్ను గుడ్డిదైతే, (వివేకానందరెడ్డి చనిపోతే) మిగిలిన రెండోకన్నుని డీజీపీగాఉన్న ప్పుడుసవాంగ్ ఎందుకు నిశితంగా గమనించలేదు?

సంవత్సరం మూడునెలలు డీజీపీగా ఉన్నప్పుడు సవాంగ్ కి వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డిపై అనుమానం కలగలేదా? వివేకాహత్యకేసు విచారణలో రెండుసిట్ బృందాలుపనిచేశాయి. ఆ బృందాల్లోని అధికారులుగానీ, వివేకాహత్యజరిగినప్పుడు కడపఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతిగానీ, జగన్మోహన్ రెడ్డి రెండుకళ్లలో ఒకకన్నుపై తమకుఅనుమానం ఉందని సవాంగ్ గారితో చెప్పలేదా? డీజీపీగాఉన్నప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన రెండుకళ్లసిద్ధాంతంగపై సవాంగ్ ఎందుకు మీడియాతో మాట్లాడలేదు?

సవాంగ్ తాను విడుదలచేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివేకాహత్యకేసుని నీతినిజాయితీల తో పకడ్బందీగా విచారించ మన్నారని, అమాయకుల్ని ఇబ్బందిపెట్టవద్దని ఇప్పుడు చెబుతున్నారు. మరి డీజీపీగా ఉన్నప్పుడు అవేవీ సవాంగ్ గారుఎందుకుచెప్పలేదని తాము ప్రశ్నిస్తున్నాం? ఎవరికీ భయపడకుండా, ఏ ఒత్తిడిలేకుండా వివేకాహత్యకేసు విచారణ చేయమని సవాంగ్ ఆనాడుఎందుకు చెప్పలేకపోయారు? అయినదానికి కానీదానికి ప్రెస్ మీట్లు పెట్టి, తప్పులుచేసినవారిని వెనకేసుకువచ్చే సవాంగ్ కి డీజీగా ఉన్నప్పుడు ఇవిచెప్పాలనిపించలేదా?

ఇప్పుడు అసలుకథ బయటపడిందని, జగన్మోహన్ రెడ్డికి కూడా వివేకాహత్యతాలూకాకుట్రలో భాగముందన్న వార్తలు గుప్పు మంటున్న తరుణంలో, పిల్లికి ఎలుకసాక్ష్యంలా సవాంగ్ ముఖ్యమంత్రిని బయటపడేయటానికి, అపవాదుని తనభుజాలపై వేసుకుంటున్నాడు. సవాంగ్ ఎందుకిలాచేస్తున్నారని ప్రశ్నిస్తున్నా ము. ముఖ్యమంత్రి వివేకాహత్యకేసు విచారణను సమర్థవం తంగా నిజాయితీగా నిర్వహించమని తనతో చెప్పారని డీజీపీగా ఉన్నప్పుడు సవాంగ్ ఎందుకు చెప్పలేకపోయారు?

అమాయకుల్ని ఇబ్బంది పెట్టొద్దని తనతో ముఖ్యమంత్రి గతంలో చెప్పాడంటున్న సవాంగ్ , ఆ అమాయకుడు అవినాశ్ రెడ్డేనని చెబుతున్నారా? సవాంగ్ పేరుతో విడుదలచేసిన ప్రకటన సజ్జల కార్యాలయంలో తయారైతే, సవాంగ్ సంతకం పెట్టాడు. ఈ మాట నేను అనడంకాదు.. మీడియా వారే అంటున్నారు. కాదని సవాంగ్ గారు చెప్పగలరా? అవినాశ్ రెడ్డి అనేవ్యక్తి తాను డీజీపీగా ఉన్నప్పుడు తనను ఎప్పుడూ కలవలేదని సవాంగ్ ప్రకటనలో చెప్పారు.

సవాంగ్ ఢిల్లీవెళ్లినప్పుడు అవినాశ్ రెడ్డి ఆయన్ని ఎన్నిసార్లు కలిశారో చెప్పాల్సినపనిలేదు. ఢిల్లీలోనే కాకుండా రాష్ట్రంలో అవినాశ్ రెడ్డి, డీజీపీగాఉన్నప్పుడు సవాంగ్ ను కలవలేదా? ఎవరిని రక్షించడానికి సవాంగ్ తనదికానిదాన్ని తనకు ఎందుకు అంటించుకుంటున్నాడని ప్రశ్నిస్తున్నాం? డీజీపీగాఉన్నప్పుడు సవాంగ్ సీబీఐ వెళ్లిన లైన్లో వివేకాహత్యకేసువిచారణ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోయారు? ఇప్పుడు సీబీఐ సేకరించిన సాక్ష్యాలను ఆనాడు ఆయన ఎందుకు సేకరించలేదు? పారదర్శకంగా జరుగుతున్న సిట్ విచారణను ఎందుకు నీరుగార్చే ప్రయత్నంచేశారు?

పోలీస్ శాఖ మొత్తం తనకంట్రోల్ లోఉన్నప్పుడు సవాంగ్ వివేకాహత్యలో సాధించిన పురోగతి ఏమిటి? ఇప్పుడు సవాంగ్ పేరుతో వచ్చిన ప్రకటనపై కూడా సీబీఐ విచారణజరపాలి. సవాంగ్ ఏం ఆశించి, ఎవరిని కాపాడటానికి ఇలాంటిప్రకటనలు విడుదలచేశారో సీబీఐ తేల్చాలి. డీజీపీగాఉన్నప్పుడు సవాంగ్ కు, ముఖ్యమంత్రికి మధ్యజరిగిన సంభాషణలు, ఇతరత్రా వివరాలన్నీ సీబీఐ బయటపెట్టాలి.

వివేకానందరెడ్డిహత్యపై డీజీపీగాఉన్నప్పుడుఏనాడూ ఏదీ మాట్లాడని సవాంగ్ గారు, నేడు ముఖ్యమంత్రిని వెనకేసుకొస్తూ ఎందుకు ప్రకటనచేశారో,ఎవరిప్రమేయంతోచేశారో తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి తనను అవమానించినాకూడా సవాంగ్ ఆయన్ని ఇంతలా వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఆయన పేరుతో విడుదలైన ప్రకటన సజ్జల కార్యాలయంలో తయారైందని అంటున్నాం. అవినాశ్ రెడ్డి డీజీపీఉన్నప్పుడు తనను ఎప్పుడూ కలవలేదని సవాంగ్ చెప్పిన అబద్ధమే అందుకు నిదర్శనం. అవినాశ్ రెడ్డి, డీజీపీగాఉన్నప్పుడు ఎప్పుడూ తననుకలవలేదని సవాంగ్ చెప్పడం ఈ శతాబ్ధపు అతిపెద్దజోక్అని చెప్పాలి.

ముఖ్యమంత్రిని వివేకాహత్యకేసునుంచి కాపాడే బాధ్యతను సవాంగ్ తన భుజస్కంధాలపై వేసుకున్నారని స్పష్టంగా ఆయనప్రకటనతోనే తేలిపోయింది. కాబట్టి, సీబీఐవారు సవాంగ్ ప్రకటనపై లోతైన విచారణజరపాలని కోరుతున్నాం. సవాంగ్ పేరుతో వచ్చిన పత్రికా ప్రకటన ఎక్కడినుంచి వచ్చిందో ఆయనే సమాధానంచెప్పాలి.

లేకపోతే ఈ వ్యవహారంలో ఆయనే ఇరుక్కోవడంఖాయం. అమా యకుల్ని ఇబ్బంది పెట్టొద్దని ముఖ్యమంత్రి తనతో చెప్పారని సవాంగ్ చెప్పాల్సిన పనిలేదు.
నాకు తెలిసినంతవరకు ఏడీజీపీ కూడా తాను రిటైరయ్యాక, లేక వేరే విభాగానికి బదిలీ అయ్యాక డైరెక్టర్ జనరల్ గా తాను చేసిన విధినిర్వహణ గురించి మాట్లాడరు. వివేకాహత్యకేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రేమిటో, అవినాశ్ రెడ్డి ప్రమేయమేంటో సవాంగ్ కి మొత్తం తెలుసు. తెలియకుండానే ఆయన ఇంతచేశారంటే ఎవరు నమ్ముతారు?

వివేకాహత్యకేసులో ముఖ్యమంత్రి పూర్తిగా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చేసరికి సవాంగ్ ఇలా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంతఅమాయకులని సవాంగ్ భావిస్తే ఎలా? దోషులు ఎప్పటికైనా కోర్టు బోనులో నిలబడాల్సిందేనన్న వాస్తవాన్ని డీజీపీగా పనిచేసిన వ్యక్తి విస్మరించడం బాధాకరం.

LEAVE A RESPONSE