– బిల్లుల చెల్లింపును ప్రాధాన్య క్రమంలో చివర్లో పెడుతున్నారు
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు
– కోర్టుకు హాజరయి వివరణ ఇచ్చిన సీఎస్ సమీర్ శర్మ
అమరావతి: బిల్లుల చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోతే ఎలా అని సీఎస్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
దీనికి సీఎస్ బదులిస్తూ.. ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోతే ఎలా? అని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు సీఎస్ సమీర్‌శర్మ కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్లకు 9వ ప్రాధాన్యత ఇస్తే.. పనులు చేసేందుకు ఎవరు వస్తారని ప్రశ్నించింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
దీనిపై గతంలోనే విచారణ జరిపిన ధర్మాసనం.. ఇవాళ సీఎస్ సమీర్ శర్మను హాజరుకావాలని ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు.. ఇవాళ సీఎస్ హాజరవ్వగా.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బిల్లుల చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని కోర్టు ప్రశ్నించింది.
దీనికి సీఎస్ బదులిస్తూ.. ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ధర్మాసనానికి తెలిపారు.స్పందించిన ధర్మాసనం.. బిల్లుల చెల్లింపును ప్రాధాన్య క్రమంలో చివర్లో పెడుతున్నారని వ్యాఖ్యానించింది. బిల్లులు సకాలంలో చెల్లించేలా కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని.. ఉన్నత న్యాయస్థానం సీఎస్‌ను ఆదేశించింది.