Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జగన్ రెడ్డి సర్కారు చేతులెత్తేసింది

– మంత్రి అనిల్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి స్పందించాలి
• బుల్లెట్ దిగుద్ది.. పర్సంటా.. అరపర్సంటా అని వాగినవారు ఇప్పుడు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి మూడేళ్లు సమయం పడుతుందనడంచూస్తుంటే, పోలవరం ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చేందుకేనని అర్థమవుతోంది
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కేంద్ర జలవనరుల శాఖామంత్రి పోలవరం ప్రాజెక్ట్ పైచేసిన సమీక్ష తాలూకా వివరాలను మీడియాకు ఇవ్వగల దమ్ము, ధైర్యం ఈముఖ్యమంత్రికి గానీ, జలవనరులశాఖా మంత్రికి గానీ ఉన్నా యా అని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహే శ్వరరావు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే … కేంద్ర జలవనరుల శాఖామంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ డ్యామ్ ప్రాంతంలో ఎందుకు మీడియాతో మాట్లాడలేకపోయారు? అక్కడేమీ చెప్పుకుండా నేడు అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడితే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో టీడీపీప్రభుత్వం అధికారంలోఉన్నప్పుడు చంద్రబాబుగారి నాయక త్వంలో రూ.11వేలకోట్ల విలువైన పనులు పోలవరంనిర్మాణంలో జరిగాయి.

వాటిలో రూ.4వేలకోట్ల పనులకు సంబంధించిన నిధులు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం విడుదలచేసింది. ఆ డబ్బులు లిక్కర్ కంపెనీలకు అడ్వాన్స్ లుకట్టకుండా, నిర్వాసితు లకుచెల్లించి ఉంటే, నేడు ప్రాజెక్ట్ ప్రాంతంలో నిర్వాసితుల న్యాయం చేయాలంటూ నిరాహారదీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చేదికాదు.

మే 2019 చివరికి 71శాతం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని సాక్షి పత్రికలోనే వచ్చింది. అలానే 2019 జూన్ లో డ్యామ్ సందర్శనకు జగన్ రెడ్డి వెళ్లినప్పుడు అధికారులు ఆయనకు ఇచ్చిన రివ్యూరిపోర్ట్ లో కూడా అదే విషయం స్పష్టంగాఉంది. ఇవే వీ తెలియవన్నట్లు బుద్ధిలేని మంత్రి అసెంబ్లీలో బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా?

ప్రాజెక్ట్ పనులు దాదాపు 72శాతం వరకు పూర్తయ్యాకకూడా, ప్రాజెక్ట్ పనుల్ని గిన్నిస్ రికార్డుల్లో ఎక్కేలా వేగంగా చేయిస్తే, ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఎందుకు ఆడాడు? టీడీపీ ప్రభుత్వంలో కేంద్రంతో సమన్వయంచేసుకుంటూ రాష్ట్ర అధికారులు ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగేలాచేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక సింగి ల్ టెండర్ వేసిన వారికే డ్యామ్ పనులుఎలా అప్పగించారు. కాం ట్రాక్ట్ సంస్థకు సంబంధించిన అర్హత, ఇతరప్రమాణాల అంశాల్లో ఎందుకు మ్యానిప్లేషన్ చేశారు?

వేలకోట్ల అవినీతి జరిగిందని జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గగ్గోలుపెట్టాడు. పీటర్ కమిటీ వేసి, ఏం పీకాడు? టీడీపీప్రభుత్వంలో పోలవరంపనుల్లో అవినీతి జరిగితే కేంద్రప్రభుత్వం చేసిన పనుల తాలూకా రూ.4వేలకోట్ల ని ధులను ఈప్రభుత్వానికి ఎందుకు ఇచ్చింది? వరదలు వస్తాయని మాకుతెలియలేదు అని బుద్ధిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు గోదావరి నదికి వరదలువస్తాయో తెలియనప్పుడు మంత్రిగా ఉండటందేనికి?

ప్రజలు 151 సీట్లు ఇచ్చారని ప్రాజెక్ట్ పనులుఆపేసి, సింగిల్ టెండర్లకుపనులు కట్టబెట్టి, అవినీతికోసం రాష్ట్రరైతాంగం జీవితాలతో ఆడుకుంటారా? పోలవరం పనుల వ్యవ హారంపై వైసీపీప్రభుత్వం ఆడిననాటకాలపై విచారణ జరిపిస్తే అధి కారంలోఉన్నవారు భారీమూల్యం చెల్లించుకోవడం ఖాయం. స్పిల్ వే నిర్మాణం జరిగినప్రాంతంలోని గ్రామాలన్నీ ఖాళీచేసి, అక్కడ ఉండేవారు స్వచ్ఛందంగా వెళ్లిపోయారు.
వారువెళ్లాక అక్కడ స్పిల్ వేపనులు ప్రారంభించి వేగంగాజరిగేలా చేశాము.

ప్రాజెక్ట్ పనులు టీడీపీ హాయాంలో ఏమీ జరగకపోతే 71శాతం పూర్తయిందని కేంద్రప్రభుత్వం ఎలాచెప్పింది. సాక్షి మీడియా ఎలా రాసింది? 2019జూన్ లో అధికారులు చెప్పిందివిని ముఖ్యమంత్రి తల ఎందుకు ఆడించారో సమాధానంచెప్పండి.

పుల్లారావు అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదుచేస్తే, దానిపై కేంద్రజలవనరుల శాఖ సుప్రీంకోర్ట్ లో వేసిన అఫిడవిట్ లో పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఎలాంటి అవినీతిజరగలేదని చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ప్రకారం, కేంద్రజలవనరుల శాఖ మార్గదర్శకాలప్రకారమే టీడీపీప్రభుత్వంలో పనులుజరిగాయని చాలాచాలా స్పష్టంగా చెప్పారు.

ఆనాడు నేను జలవనరుల శాఖా మంత్రిగాఉన్నాను… ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. తాము దమ్ము, ధైర్యంతో ప్రాజెక్ట్ వద్దకు వెళ్లినప్రతిసారీ అక్కడ మీడియావారికి ఎప్పటికప్పుడు పనులువివరాలు వెల్లడించేవాళ్లం . అదేవిధంగా ఈముఖ్యమంత్రిగానీ, రాష్ట్రమంత్రి అనిల్ కుమార్ గానీ మీడియాను తీసుకెళ్లి ప్రాజెక్ట్ పనులను ఎందుకు పరిశీలించ డంలేదు? అక్కడేంజరుగుతుందో బయటకు తెలియకుండా ఎందు కు జాగ్రత్తపడుతున్నారు?

తమప్రభుత్వహాయాంలో ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ఆనాటికేంద్రమంత్రి గడ్కరీతో కలిసి, చంద్రబాబుగారు మీడియాతో మాట్లాడి, పనులపురోగతిని వివరించారు. మొన్నటికి మొన్న కేంద్రజలవనరుల మంత్రి ప్రాజెక్ట్ వద్దకు వస్తే, ఈముఖ్యమంత్రి ఆయనతో కలిసి ఎందుకు మీడియాతో మాట్లాడలేకపోయాడు?

కేంద్రమంత్రితో తానేం మాట్లాడాడోకూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈ జగన్ రెడ్డిఉన్నాడు. ప్రాజెక్ట్ పనులకు సంబంధించి తాము అడిగిన సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ముఖ్యమంత్రిని కేంద్రమంత్రి నిలదీయలేదా? రాష్ట్రప్రభుత్వంనుంచి తగిన సహాయసహాకారాలు లేనందునే ప్రాజెక్ట్ నిర్మాణం రెండేళ్లపాటు ఆలస్యమైందని మొన్న పోలవరం సందర్శనకువచ్చినప్పుడు కేంద్రమంత్రిచాలాస్పష్టంగా చెప్పారు.

తాను ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్ట్ కు ఎన్నినిధులు ఇచ్చి, ఎంతశాతంపనులుచేయించాడో జగన్ రెడ్డి చెప్పగలడా? బుద్ధిలేని ఈ ప్రభుత్వానికి దెబ్బతిన్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తిచేయడానికి ఇంకా మూడేళ్లసమయం కావాలంటోంది. పోలవరం ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చడానికి ఈచేతగానిదద్దమ్మ ప్రభుత్వం పునాదులు తవ్వుతోంది. దానికోసమే ఇంకో మూడేళ్లసమయం కావాలంటోంది.

టీడీపీప్రభుత్వంలో తుదిదశకువచ్చిన కాపర్ డ్యామ్ పనులు పూర్తికావాలంటే వెంటనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులుచేపట్టాలని అధికారులు చేతులెత్తి మొత్తుకున్నా జగన్ రెడ్డి వినలేదు. రాష్ట్రప్రజల జీవితాలతో ఆడుకుంటూ, అబద్ధాలు అసత్యాలతో కాలంవెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి, ఆయన పరివారం బతుకులన్నీ త్వరలోనే బట్టబయలు అవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో తనతండ్రి విగ్రహం పెట్టమని ఈ జగన్ రెడ్డిని ఎవరు అడిగారు?

ఏంపనులు చేసి, ఎవరిని ఉద్ధరించాడని విగ్రహా లుపెడుతున్నాడు? శాసనసభలో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధిం చిన వివరాలు బయటపెడితే, మీ బతుకులు బయటపడతాయి. అది తెలిసే, అసలువాస్తవాలు చెప్పకుండా ఊరికే బోకరిస్తున్నా రు. తమప్రభుత్వంలో గోదావరినీటిని గుంటూరులోని బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ప్రకాశంజిల్లాకు అక్కడినుంచి రాయలసీమకు తరలించేలా ప్రణాళికలు వేయడం జరిగింది. టీడీపీహయాంలోఎన్ని ప్రాజెక్ట్ లు ప్రారంభించి, ఎన్నిపూర్తిచేసి, ఎన్నిలక్షలఎకరాలకు నీరు ఇచ్చామో దమ్ముగా, ధైర్యంగా చెప్పుకుంటున్నాం.

మీరు ప్రాధాన్యతప్రాజెక్టులుగా ఎంచుకున్న 6ప్రాజెక్ట్ ల్లో ఎన్నిపనులు ఎంతశాతంపూర్తిచేశారో చెప్పగలరా? కేవలంకమీషన్ల కక్కుర్తికోసం రాష్ట్రానికి మేలుచేసే ప్రాజెక్ట్ లతో ఆడుకున్నారు. పోలవరంలో రూ.32వేలకోట్ల అవినీతిచేశామని, తమపై, తమప్రభుత్వంపై నిందలేసి, అబద్ధాలుచెప్పినందుకు ఈ జగన్ రెడ్డి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నాం.

దుర్మార్గపు పనులుచేసిన వారికిఎప్పటికైనా శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. లక్షకుటుం బాలకు న్యాయంచేసి, ఇళ్లనిర్మాణంఎప్పుడుపూర్తిచేశారో ముఖ్య మంత్రి సమాధానంచెప్పాలి. అలానే పోలవరంఎత్తు తగ్గించకుండా 194 టీఎంసీల నీటిని ఎప్పుడు నిల్వచేస్తాడో 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ను ఎప్పటిలోగా పూర్తిచేస్తాడో సమాధానంచెప్పాలి.

స్పిల్ వే డ్యామ్ కు తమప్రభుత్వంలో గేట్లు బిగిస్తే, ఈ ముఖ్యమం త్రికి మిగిలిన 6గేట్లను బిగించడానికి 34నెలలైనా తీరలేదు. బుల్లెట్ దిగుద్ది.. పర్సంటా.. అరపర్సంటా అని వాగినవాళ్లే ఇప్పుడుప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా మూడేళ్లసమయం కావాలం టున్నాడు. మంత్రి అనిల్ అసెంబ్లీలో చెప్పినదానిపై జగన్ రెడ్డి స్పందించాలి. ఈ బుద్ధిలేని ప్రభుత్వం పోలవరం ఎడమకాల్వలో మట్టి తవ్వుకుంటూకూర్చొని మూడేళ్లసమయాన్ని వృథాచేసింది.

LEAVE A RESPONSE