Home » నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు

నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు

– ఎంతో మంది దళితుల్ని హత్య చేసింది ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం..
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : సైకో జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. దళితులపై ఇంతపెద్ద ఎత్తున దాడులు జరుగుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు?వైకాపా దళిత నాయకులు, మంత్రులు జగన్ రెడ్డికి బానిసలా లేక దళిత ప్రజా ప్రతినిధులా? రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి నిత్యకృత్యమైంది. అసాంఘిక శక్తులు, అధికారపార్టీ రౌడీ మూకలు దళితులపై దమన కాండ సాగిస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేసింది.అమరావతిలో దళిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైలు పాలు చేశారు.తమ అక్రమాలు, అరాచకాలకు సహకరించని వారిపై దాడులు,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఈ వైసీపీ పార్టీ.వ్యక్తులపై, వ్యవస్థలపై దాడి చేయడమే వైసీపీ ప్రభుత్వ విధానం.ఆకు రౌడీల నుంచి ఆర్ధిక నేరగాళ్ల వరకు అంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారు.

Leave a Reply