Suryaa.co.in

Telangana

మెగా కృష్ణారెడ్డి- కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు కమీషన్ వేయాలి

దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ కు ఆదేశాలు ఇవ్వండి
ప్రతిపక్ష లీడర్ల పై ఐటి దాడులు చేయించే మోడీకి కాళేశ్వరం మాత్రం కనిపించదు
ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నాం
దొంగలను సీఎం చేయకూడదు
వరి ఏస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి
ఎవరికున్న ఇన్ సెక్యూరిటీలు వాళ్లకుంటాయి
సజ్జల .ముందు మీ సంగతి మీరు చూసుకోండి
త్యాగం చేసినందుకు నాకు ఎంత బాధ ఉండాలి?
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి

వచ్చే ఎన్నికల్లో దొంగలకు ఓటు వేయకూడదు. దొంగలను సీఎం చేయకూడదు. రేవంత్ ను నేను దొంగా అనడం లేదు. దొంగా అని నేను అంటే, మీరు రేవంత్ రెడ్డి దొంగ అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ని నేను దొంగ అనడం కాదు. ఇటీవల సుప్రీం కోర్టులో కేసు కొట్టేయాలని రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే… వీళ్లు దోషులే అని న్యాయస్థానం చెప్పింది.

ఇటీవల రేవంత్ రెడ్డి ని రేటెంత రెడ్డి అని ఆరోపిస్తున్నది నేను కాదు వాళ్లు వేరే ఉన్నారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారు. ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. నాకు ఎవరో ఏదో కిరీటం పెడతారని చేయలేదు.ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం.ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం. నా నిర్ణయాలు తెలంగాణ ప్రజలకోసమే తీసుకున్న నిర్ణయం.మా పార్టీలో కూడా ఎంతో మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా వైయస్సార్ చెప్పిన విషయం.పార్టీలు ఉన్నది ప్రజల కోసమే. వైయస్ఆర్ స్వంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటం చేశారు. నేను కూడా అదే చెప్తున్నా మనకు పార్టీలు, పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలు ముఖ్యం. నాకెంత బాధ ఉండాలి? 3800 కిలోమీటర్లు ఎండనకా వాననకా తిరిగాను. ఎన్ని రోజులు 25 కిలోమీటర్లు నడిచిన రోజులు కూడా ఉన్నాయి. కాలు తీస్తే కాలు పడదేమో అన్న ఇబ్బందిలో కూడా నడిచాను. ఈ రోజు ఈ త్యాగం చేసినందుకు నాకు ఎంత బాధ ఉండాలి?

ఎవరండి తెలంగాణ ద్రోహులు? పాదయాత్రలో ప్రతి చోట ప్రజల సమస్యల గురించి మాట్లాడాను. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించినందుకా మేము తెలంగాణ ద్రోహులం?డబుల్ బెడ్ రూం ఇండ్లు, రుణమాఫీ, పోడు భూములు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్, ఉద్యోగాలు ఇవ్వడం లేదని మేము అడిగినందుకా తెలంగాణ ద్రోహులం..? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా రాలేదు తెలంగాణ వచ్చినప్పటి నుంచి…? వరి ఏస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి. కేసీఆర్ గడ్డాలు పెంచుకుని దొంగ దీక్షలు పెంచారు. మీరు ఏ రోజు ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేయలేదు.మీరు అసలైన తెలంగాణ ద్రోహులు.

తెలంగాణ ప్రజల నెత్తిన ప్రతి ఒక్కరి నెత్తిమీద అప్పులు చేసి పెట్టారు.మీరు పెద్ద గడీలు కట్టుకుని బతుకుతున్నారు. ప్రజలను మాత్రం అప్పుల పాలు చేశారు. ఎవరికున్న ఇన్ సెక్యూరిటీలు వాళ్లకుంటాయి.తెలంగాణ ప్రజల గురించి ఎవరికి పట్టింది. మీరు త్యాగం చేశానని చెబుతున్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీది మేజర్ పాత్ర అనుకోవచ్చా..? నేను ఏదీ ఆశించి ఇది చేయలేదు. తెలంగాణ ప్రజలకు సర్కారు మారాలి. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని. నేను ముందునుంచే భయపడి ఈ నిర్ణయం తీసుకున్నాను.

నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదని చెప్పిన సజ్జల రామకృష్టారెడ్డి , ఏ సంబంధం ఉందని నాగురించి ఈ రోజు మాట్లాడుతున్నారు.మేం అయితే సంబంధం లేదని అనుకుంటున్నం. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే మీరు మళ్లీ సంబంధం కలుపుకోవలనుకుంటున్నారా..? ఏం అనుకోవాలి మేము..? కేసీఆర్ బహిరంగగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ అని చెబుతున్నారు.చీకటి అయితే ఆంధ్ర, వెలుతురు అయితే తెలంగాణ అని చెబుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు చెప్తారు సజ్జల .ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ఎవరికైనా ఇదే సమాధానం.

ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నాం. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ కు ఆదేశాలు ఇవ్వండి BJP,BRS తోడు దొంగలు ఇక్కడ గెలిచిన బీజేపీ MLA లు brs కి మద్దతు ఇస్తారు.ఇక్కడ గెలిచిన brs mp లు కేంద్రంలో బీజేపీ కి మద్దతు ఇస్తారు. ఈడి ఏమో మోడీ చేతుల్లో ఉంది. ఐటీ అమిత్ షా చేతుల్లో ఉంది. ప్రతిపక్ష లీడర్ల పై ఐటి దాడులు చేయించే మోడీకి కాళేశ్వరం మాత్రం కనిపించదు. వెంటనే మెగా కృష్ణారెడ్డి ,కేసీఅర్ మీద సీబీఐ దర్యాప్తు కమీషన్ వేయాలి.

LEAVE A RESPONSE