Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

-14 ఏళ్ళ సిఎంగా ఉండి కుప్పంకి బాబు చేయలేనిది 18 నెలల్లోనే చేసిచూపిన జగన్ 
-మహా మోసకారి కోసం గూగుల్ లో వెతికితే మెదటిపేరు చంద్రబాబుదే వస్తుంది
-ఇక రాష్ట్రంలో విద్యావికాసం
-సుస్థిరాభివృద్దిలో రికార్డు తిరగరాసిన ఏపి  
-వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం దేశంలోనే వినూత్న ప్రయోగం
-మెదటి ర్యాంకు నిలబెట్టుకున్న ఎపి పోలీస్ శాఖకు అభినందనలు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

14 ఏళ్లు సిఎంగా ఉండి కూడా చంద్రబాబు కుప్పంను మునిసిపాటిటీ చేయలేకపోయారని, 30 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ఆ ప్రాంతానికి త్రాగునీరు ఇవ్వలేకపోయారని, కేవలం 18 నెలల్లోనే జగన్ ఆ రెండూ చేసి చూపించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. స్వంత నియోజక వర్గానికే ఏమీ చేయలేని వ్యక్తి జగన్ పాలనపై మాట్లాడడానికి అర్హుడేకాడని అన్నారు. తన పాలనతో దేశంలోనే అత్యంత ప్రజాధరణ కల్గిన సిఎంగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారని,  స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు కుప్పుం ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మరధం పట్టారని చంద్రబాబుకు గుర్తుచేసారు. మనలో గుజ్జులేనప్పుడు కన్సల్టెంట్లను అనుకొని ఏం లాభం బాబూ (చంద్రబాబు), మందు మార్చాల్సింది పప్పు (లోకేష్)ని కదా అని అన్నారు. పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్, తమిళనాడులో అన్నాడిఎంకే లకు పనిచేసిన వారిని కన్సల్టెంట్లుగా పెట్టుకొని మంచిపనిచేసారని, టిడిపికి సింగిల్ డిజిట్ ఖాయమని అన్నారు.

సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించి జీఓ విడుదల చేసిందని అన్నారు. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయిందని అన్నారు. ఇంకో ఏడాదికో లేక తన వారి కొత్త మూవీ వచ్చే వరకు  ఆ గొంతు మూగబోయిఉంటుందేమో ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు అని ఏద్దేవా చేసారు.

మహా మోసకారి అని గూగుల్ లో వెతికితే వచ్చే మెట్టమెదటిపేరు చంద్రబాబుదేనని, మోసకారి బడ్జెట్ అంటూ వీరంగం చేస్తున్న లోకేష్ ఈ విషయం తెలుసుకోవాలని అన్నారు. అమ్మవడి, వాహణమిత్ర,  విద్యాదీవెన లబ్దిదారుకు ఎప్పుడైనా కలిసావా? ఏ స్కీంనైనా అధ్యయనం చేసావా?మందబుద్దితో కేటాయింపులపై మాట్లాడడమేంటని అగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని ఆదేశించడం జరిగిందని అన్నారు. నూతన విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో చదువులకు మరింత మంచిరోజులు రానున్నాయని జూలై నాటికి సబ్జెక్ట్ టీచర్ల నియామకాలు పూర్తికానున్నాయని, కొత్త జిల్లాల్లోనూ టీచర్ల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు. ప్రతి మండలంలో ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ, ఒక మహిళా జూనియర్ కాలేజీ ఏర్పాటుతో పాటు ఈ నెల 15 నుంచి నాడు నేడు రెండో విడత పనులు మెదలుకానున్నాయని అన్నారు.

ప్రజాసమస్యలతోపాటు సోషల్ మీడియా కార్యకర్తల వ్యక్తిగత ఇబ్బందులను పార్టీ కేంద్రకార్యాలయం దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం పార్టీ గ్రీవెన్స్ సెల్ పనిచేస్తుందని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలపై తాను కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి పరిష్కారానికి కృషిచేస్తానని సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రబుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజలకు చేస్తున్న మేలును సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే సోషల్ మీడియా కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు

సీఎం జగన్ ముందుచూపుతో రాష్ట్రం కరోనా కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి సాధించి రికార్డులు తిరగ రాసిందని అన్నారు. వ్యవసాయంలో 14.5%, పారిశ్రామిక రంగంలో 25.5%, సేవా రంగంలో 19%, తలసరి వృద్ధి రేటు రూ.31 వేలు పెరగడం సానుకూల పరిణామని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని అన్నారు.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ జగన్ గారి ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిందని ఈ మేరకు 10 వేల డ్రోన్లు వాడుకలోకి రానున్నాయని అన్నారు. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుందని మరోవైపు 20 వేల మంది డ్రోన్ పైలట్లుగా ఉపాధి పొందుతారని అన్నారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం.

సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ పోలీసు శాఖ ఉత్తమ పనితీరు కనబరుస్తూనే ఉందని, స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 56 అవార్డుల్లో ఏకంగా 23 అవార్డులు కైవసం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.  తన మెదటి ర్యాంకును అలాగే నిలబెట్టుకున్న ఏపీ పోలీసు శాఖకు  ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

LEAVE A RESPONSE