*నీ పాట వింటే*
*మనసు కాస్త కుదుటపడతది..!*
మామ..మామ..మామా..
ఆ మామనే
తన పేరుగా మార్చుకున్న
మమ్మమ్మమ్మ మహదేవన్..
దసరాబుల్లోడు గోపీకి..
మంచిమనసులు వేణుకి..
శంకరాభరణం శంకరశాస్త్రికి…
స్వాతికిరణం
అనంతరామశర్మకి…
ఎందరికో తన పాటలతో
ప్రాణం పోసిన
స్వరబ్రహ్మ పుట్టినరోజు..
సినిమా పాటకి పండుగరోజు!
క్లాసు..మాసు..
పాట ఏదైనా
ఈ మామ హై కలాసు…
ఆరేసుకోబోయి
పారేసుకున్నాను పాట
ఊపేసింది తెలుగునాట..
ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మి
ఏటేటో ఔతోంది సిన్నమ్మి…
ఈ పాట ఎంత ఊపో..
శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా.. జీవేశ్వరా…
ఆ పాట ఎంత కైపో..
ఇలాంటి వెరైటీ ట్యూన్లు
కట్టిన మామ అదెంత తోపో!
తెలుగు రాని
ఈ సంగీత సరస్వతికి
పాటకు తగ్గ పల్లవి
ఇవ్వడంలో ఎనలేని పాండితి
కవి రాయనీ..
అప్పుడే సరిగమపదనీ..
అదే మామ బాణీ…
అలాగే కట్టేసాడు అద్భుతమైన
గీతాలకు అదిరిపోయే ట్యూన్లు…
ఉర్రూతలూగిపోయేలా
హీరోల ఫ్యాన్లు..!
మామా..నువ్వెళ్లి ఎన్నేళ్ళయినా…
నిన్ను మరచిపోవాలని
వేరే పాటలు వినాలని
ఎన్నిసార్లో అనుకున్నా..
మనసు రాక మానుకున్నా..!
పాట వింటుంటేనే
ఇది మహదేవన్ పాటరోయ్
అన్నట్టు ఆ మ్యూజిక్..
అదే మామ మ్యాజిక్..
ఆకట్టుకునే గంటలు..
సెగ పుట్టించే చలిమంటలు..
శాస్త్రీయ సంగీతం రాని
బాలుకి పండిత పట్టాభిషేకం
ఇక నీ దర్శకత్వంలో మాస్టారు పాడిన పాటలు
వింటుంటేనే
అదోలాంటి మైకం..
మొత్తంగా నీ పాటలన్నీ
అదిగో నవలోకం..
వెలసే మా కోసం..!
సురేష్ కుమార్ ఇ
9948546286