– 1953లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అన్ని ప్రభుత్వాల్లోని కేబినెట్లలో ప్రాతినిధ్యం వహించిన ఒక ప్రధాన సామాజికవర్గానికి, జగన్మోహన్ రెడ్డి తనకేబినెట్లో స్థానంకల్పించకపోవడం, ముమ్మాటికీ ఆవర్గాన్ని కించపరచడం.. అవమానించడం.. వారిపై కక్ష తీర్చుకోవడమే
• రాష్ట్రంలో, సమాజంలో సదరుప్రధాన వర్గానికి ప్రాధాన్యత లేదనిచెప్పాలనుకుంటున్న ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గంగా ఉన్న ఒకవర్గాన్ని కించపరచాలని, హేళనచేయాలని, అణగదొక్కాలని చూడటం ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వ్యక్తికి తగని పని
• రాష్ట్రంలో ఉన్న ప్రధానసామాజికవర్గానికి కేబినెట్లో చోటుకల్పించకపోవడం వల్ల ముఖ్యమంత్రి భవిష్యత్ లో భారీమూల్యం చెల్లించుకోవడం ఖాయం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్మోహన్ రెడ్డి తాజాగా కొత్తమంత్రిమండలితో కొలువుతీరారని, జూన్ 6-2019న ఆయన మాట్లాడుతూ, కొత్తమంత్రివర్గాన్ని రెండున్నరేళ్లతర్వాత పూర్తిగా ప్రక్షాళనచేసి, అందరినీ కొత్త వారినే తీసుకుంటానని చెప్పాడని, కానీ తాజామంత్రివర్గకూర్పులో ఆయన పాతవారిలో 11 మందిని కొనసాగించాడని, వివిధ కారణాలతో ఆయన కొందరు పాతవారిని తొలగించలేకపోయాడని, ఆయన కొందరిని మంత్రి వర్గం నుంచి తొలగించలేని అశక్తతో ఉన్నాడని తాము గతంలోనే చెప్పడం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు.
బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే .. మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలో ..తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమే, దాన్నిమేము కాదనము. కానీ రాష్ట్రంలో ప్రధానమైన సామాజికవర్గంగా ఉన్న ఒకవర్గానికి ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలిలో ఎందుకు చోటివ్వలేదని ప్రశ్నిస్తున్నా. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది మొదలు టంగుటూరి ప్రకాశంపంతులు ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ, రాష్ట్రంలో ఉన్న ప్రధానసామాజికవర్గం ఎందరుముఖ్యమంత్రులు, ప్రభుత్వాలుమారినా కేబినెట్ లో స్థానం పొందుతూనే ఉంది.
జగన్మోహన్ రెడ్డి కూడా తొలిమంత్రివర్గంలో సదరువర్గానికి స్థానమిచ్చారు . బూతులుమాట్లాడే… ఒకపిచ్చివాడికి అవకాశం ఇచ్చి, అతన్నితొలగించారు. రాష్ట్రం ఏర్పడి నప్పటినుంచీ మంత్రిమండలిలో స్థానంపొందుతున్న సదరువర్గానికిముఖ్యమంత్రి తన తాజాకేబినెట్లో ఎందుకుస్థానంకల్పించలేదో ఆయనే సమాధానం చెప్పాలి.
ఆ సామాజికవర్గమంటే ముఖ్యమంత్రికి ఎందుకంత ఈర్ష్యా..అసూయ అనిప్రశ్నిస్తున్నాం. ఆ వర్గాన్ని అణగదొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకంతలా ఉబలాటపడుతున్నాడు? ఆ సామా జికవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి తనకేబినెట్ నుంచి ఎందుకు తీసిపారేశాడో ఆయనే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలోఉన్న వర్గాలలోప్రధానమైన సామాజికవర్గాన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు. ఆయన ఆపని ఎందుకుచేస్తున్నాడో ఆయనే చెప్పాలి. గతంలో ఉన్న ఒకే ఒక పిచ్చివాడివల్ల, అతను మాట్లాడేబూతులవల్ల ముఖ్యమంత్రికే తలనొప్పి ఎక్కువైంది. అతనికి మంత్రిపదవిఇచ్చి, చంద్రబాబుని తిట్టించి చివరకు అవసరంతీరాక అతన్ని ముఖ్యమంత్రి విసిరిపారేశాడు.
తాజాకేబినెట్లో సదరు వర్గానికి చెందిన మరొకరికి ముఖ్యమంత్రి ఎందుకు అవకాశమివ్వలేదు. టంగుటూరి ప్రకాశంపంతులు, నీలంసంజీవరెడ్డి, బ్రహ్మనందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిల మంత్రివర్గాల్లో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యతఇస్తే, ఈ ముఖ్యమంత్రి సదరువర్గాన్ని అణగదొక్కడం… ఆ వర్గంపై కక్షతీర్చుకోవడానికే. ఈ కేబినెట్లో ఆ సామాజికరవర్గానికి స్థానంలేకుండా, ఆ సామాజికవర్గాన్ని అవమానించి, వారిపై ముఖ్యమంత్రి కక్ష తీర్చుకున్నా డు. సదరువర్గాన్ని కించపరచడానికి.. ఆవర్గాన్ని హేళనచేయడానికే ముఖ్యమంత్రి సదరువర్గాన్ని తొక్కిపెట్టాలని చూస్తున్నాడు.
ప్రత్యేకించి కులాలను, వర్గాలను అణదొక్కాలనిచూస్తున్న ముఖ్యమంత్రి ఆలోచనలు, ప్రయత్నాలు ఎంతమాత్రం సరైనవికావని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో, సమాజంలో సదరుకులానికి ప్రాధాన్యతలేదని చెప్పాలనుకుంటున్న ముఖ్యమంత్రి ప్రయత్నం ఎంతమాత్రం మంచిదికాదని సూచిస్తున్నా. తాజామంత్రివర్గకూర్పుపై 10, 15రోజులు ఎక్సర్ సైజులుచేసిన ముఖ్యమంత్రి చివరకు బఏదోసామెత చెప్పినట్టుచేశాడు. ముఖ్యమైన శాఖలన్నింటినీ పాతవారికే అప్పగించి, పనికిరానిశాఖలను, పెత్తనంలేని శాఖలనే కొత్తవారికి ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రధానవర్గంగా ఉన్న ఆ సామాజికవర్గాన్ని కించపరచడం.. కించపరిచేలా ప్రయత్నించడం ముఖ్యమంత్రికే తీరనినష్టాన్ని కలిగిస్తుంది. మంత్రిమండలి మొత్తం మారుస్తానని 2019 జూన్ 6న ప్రగల్భాలుపలికిన ముఖ్యమంత్రి, సగంమందిని తిరిగికొనసాగించడం ఆయన బలహీనతకు సంకేతం. ఆ వర్గాన్ని మంత్రివర్గంనుంచి తొలగించి, వారిని ఎందుకు నిర్లక్ష్యంచేశారో, సమాజానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే. సదరు సామాజికవర్గంనుంచి నీరుకొండ రామారావు, చల్లపల్లి రాజాగారు, ఎస్.బీ.పీ.పట్టాభిరామారావు గారు, కాకాని వెంకటరత్నం లాంటి మహామహులు రాష్ట్ర మంత్రులుగా, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులాంటివారు ముఖ్యమంత్రులైన విషయాన్ని విస్మరించి, ఆ వర్గం వారిపై సామాజిక దాడిచేయడం మీకు తగదు ముఖ్యమంత్రి గారు.