Suryaa.co.in

Andhra Pradesh

మోహన్‌బాబు వర్శిటీకి అర్ధరాత్రి అనుమతి

మోహన్ బాబు తన పేరు మీద యూనివర్శిటీ పెడుతున్నట్లుగా ఐదు రోజుల కిందట సోషల్ మీడియాలో ఘనంగా ప్రకటించారు. యూనివర్సిటీ స్థాపించటం తన చిరకాల స్వప్నం అని, అది ఇప్పటికి నెరవేరినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎలా ప్రకటించుకున్నారో చాలా మందికి అర్థం కాలేదు.యూనివర్శిటీకి అనుమతులు రావాలంటే ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎన్నో అనుమతులు కావాలి.ఆ అనుమతులు అన్నీ రావటానికి ఎంతో సమయం పడుతుంది. అవి అంత సులభం కూడా కాదు. ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతనే యూనివర్శిటీ ఏర్పాటు గురించి ప్రకటించుకోవాల్సి ఉంటుంది.

కానీ మోహన్ బాబు యూనివర్సిటీ స్థాపిస్తున్నట్లు నేరుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే మోహన్ బాబు అలా ప్రకటించిన ఐదు రోజుల వరకూ యూనివర్శిటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు విడుదల కాలేదు. సోమవారం పొద్దుపోయిన తరవాత మోహన్ బాబు యూనివర్శిటీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మామూలుగా అయితే ఇప్పటికి ఉన్న చట్టం ప్రకారం మోహన్ బాబు యూనివర్శిటీ రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాదు. అయితే మోహన్ బాబు ప్రయత్నాలు ఫలించి.. ప్రభుత్వం చట్ట సవరణ చేయడానికి కూడా సిద్ధపడింది. చట్టం సవరణకు తమకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని, సవరణ చేస్తూ ప్రైవేటు యూనివర్శిటీల జాబితాలో పదో యూనివర్శిటీగా ఎంబీయూను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పేరు మోహన్ బాబు యూనివర్శిటీనే ఉన్నా.. దానికి స్పాన్సరింగ్ బాడీగా శ్రీవిద్యానికేతన్‌ సంస్థను చూపించారు. ఆ సంస్థ 1995లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోహన్ బాబు జగన్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అసంతృప్తిని ఎక్కడా ఆయన వ్యక్తం చేయకుండా అయినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోహన్ బాబు జగన్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అసంతృప్తిని ఎక్కడా ఆయన వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడ్డారు.

జగన్ సర్కార్ లో ఎలాంటి కీలక పదవి ఇవ్వకపోయినా సర్దుకుపోయినందుకు ప్రతిఫలంగా యూనివర్సిటీకి అనుమతులు వచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా మొత్తం మీద మోహన్ బాబు తాను అనుకున్న యూనివర్శిటీ అనుమతుల్ని సాధించుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. వచ్చే ప్రభుత్వం అనుమతులు రద్దు చేస్తే ఏం చేయగలరు అన్నది అందరికీ వచ్చే డౌట్ !.

LEAVE A RESPONSE