– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే వైసీపీ సర్కారు నిద్ర నటిస్తోంది. రుయాలో పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నా…గాలి మాటల సీఎం ఏం జరుగుతోంది అని ఆరా తీసిన పాపాన పోలేదు. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్ నిర్లక్ష్య పాలన ఫలితమే ఈ శిశు మరణాలు. ఆ తల్లిదండ్రుల గుండె కోతకి సమాధానం ఉందా జగన్ రెడ్డి గారూ? శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే. మరణాల పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.