జగన్ రెడ్డీ ….అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా?

– పోలవరం ఎత్తు తగ్గించాల్సిన దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో, ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రంనుంచి ఎందుకు సాధించలేకపోతున్నావో ప్రజలకు సమాధానం చెప్పు?
• కేంద్ర జలశక్తిశాఖ నివేదిక పోలవరంపనుల్లో జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని ఎండగట్టింది. మూడేళ్లలో ముక్కిమూలిగీ 10శాతం పనులు కూడాచేయలేదని తేల్చింది
• నిర్వాసితుల పరిహారంలోకూడా ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి అవనీతికి పాల్పడ్డారని చెప్పింది
• జగన్ రెడ్డి అవినీతి, చేతగానితనం… కేసులభయమే పోలవరానికి శాపాలుగా మారాయి.
• రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను గంపగుత్తగా దక్కించుకున్న సంస్థ, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుక సరఫరాచేసేది లేదని తెగేసిచెప్పినా, ముఖ్యమంత్రి స్పందించలేదు
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

బహుళార్థసాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని పాడుపెట్టి, రాష్ట్రాన్ని ఎడారిగా మార్చడమే జగన్ రెడ్డి ధ్యేయంగా మారింది. మూడేళ్లు అధికారంలోఉండికూడా ఈ ముఖ్యమంత్రి ముక్కిమూలిగీ పదిశాతంపనులు కూడాచేయించలేకపోయాడు. దేశంలోని వివిధప్రాజెక్ట్ లనిర్మాణం, సాగునీటినిల్వలకు సంబంధించి కేంద్రజలశక్తిశాఖ ఏటా ఇచ్చే సమాచారం పరిశీలిస్తే ముఖ్యమంత్రి పటాటోపం, ప్రచారార్భాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి అధికారంలోకివచ్చాక మూడేళ్లలో కేవలం7శాతం మాత్రమే పనులుజరిగాయని స్వయంగా కేంద్రజలశక్తి శాఖ నివేదికే చెప్పింది.

టీడీపీహాయాంలో ఐదేళ్లలో 70శాతం పనులుజరిగితే, జగన్ రెడ్డి జమానాలో మూడేళ్లలో 7శాతం పనులుచేయడానికి చచ్చీచెడారు. ఆఖరికి జగన్ రెడ్డి సాగిస్తున్న ఇసుకదోపిడీకూడా పోలవరం నిర్మాణానికిశాపంగా మారింది. పోలవరం కాంట్రాక్ట్ చేపట్టిన సంస్థ ప్రాజెక్ట్ పనులకు ఇసుక ఇచ్చేది లేదన్నా ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి సదరసం స్థను ప్రశ్నించలేకపోయింది. అదీ వీళ్లపనితనం.

భారీవర్షాలకారణంగా డయాఫ్రమ్ వాల్ వద్ద చిన్నగుంతఏర్పడితే, దాన్నిభూతద్దంలో చూపుతూ, టీడీపీహాయాంలోనిర్మించిన డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని రూ.800కోట్ల నష్టంవాటిల్లిందని విషప్రచారంచేశారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదంటూ కేంద్రంవద్ద దొంగఏడుపులుఏడ్చి తప్పించకోవాలని చూశారు. డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతిన్నది…. అసలు డ్యామేజీ జరిగిందో లేదో తెలియకుండానే.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మిస్తే భవిష్యత్‌లో భారీ నష్టం వాటిల్లితే దానికి బాధ్యులెవరని కేంద్రజలశక్తి విభాగం ప్రశ్నించింది?

డయాఫ్రమ్ వాల్‌ వద్ద నిలిచిన వరదనీటిని పూర్తిగా తోడేశాక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనంచేయాలని.. అసలు అదిదెబ్బతిన్నదో లేదో.. మరమ్మతులు ఎలాచేపట్టాలో నిపుణులతో సమగ్ర అధ్యయనం చేయించాకే డిజైన్లు రూపొందించాలని మార్చి 1, 2022న జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్రజలశక్తి విభాగం తెలిపింది. అధికారాన్ని చేపట్టిన ఈ మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించి ప్రాథమికమైన అధ్యయనం చేయకుండానే అది దెబ్బతిన్నదని ఎలా నిర్ధారించారు? ఇంతకాలం కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్లే డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతిన్నదంటూ జగన్‌ రెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తూ తప్పించుకోవాలని చూశాడు.

దెబ్బతిన్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తిచేయడానికి, నిస్సిగ్గుగా ఇంకా మూడేళ్లసమయం కావాలంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో తుదిదశకు వచ్చిన కాపర్ డ్యామ్ పనులు పూర్తి కావాలంటే వెంటనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులుచేపట్టాలని అధికారులు చేతులెత్తి మొత్తుకున్నా జగన్ రెడ్డి వినలేదు. స్పిల్ వే డ్యామ్ కు తమ ప్రభుత్వంలో గేట్లుబిగిస్తే, ఈ ముఖ్యమంత్రికి మిగిలిన 6 గేట్లను బిగించడానికి 34 నెలలైనా తీరలేదు.

పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్భుద్ధితో మొత్తంగా ప్రాజెక్ట్ నాశనానికే జగన్ సిద్ధమయ్యాడు. అటు పోలవరం సాగునీటిప్రాజెక్ట్ ని, ఇటు పవర్ ప్రాజెక్ట్ ని దేన్నీపూర్తచేయలేక చతికిలబడ్డాడు. పోలవరంతోపాటు, దానిలోని పవర్ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఇప్పుడురాష్ట్రం చీకట్లలో మగ్గేదికాదు. ప్రజలంతా ఏసీలు, కూలర్లు వాడొద్దని, పరిశ్రమలవారు పవర్ హాలిడేలు పాటించాలని చెప్పాల్సిన దుస్థితివచ్చేది కాదు.

జగన్ రెడ్డి ఏలుబడిలో పోలవరంప్రాజెక్ట్ నిర్మాణం మూడు అంగుళాలు ముందుకి, ముప్పై అడుగులువెనక్కు అన్నట్టుగా తయారైంది. టీడీపీహాయాంలో చంద్రబాబుగారి నాయకత్వం లో జరిగినప్రాజెక్ట్ నిర్మాణపనులకుసంబంధించి ఐదేళ్లలో రూ.11,537కోట్ల పనులుజరిగితే వాటికి సంబంధించిన రూ.4వేలకోట్ల నిధులను కేంద్రంనుంచి తెచ్చుకొని, వాటిని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులరూపంలో చెల్లించడంతప్ప, ఈముఖ్యమంత్రి ప్రాజెక్ట్ పనులు, నిర్వాసితులకుటుంబాలకు చేయాల్సినసాయం, న్యాయంగురించి ఏనాడు ఆలోచించింది లేదు.

ఏపీకిసాగు, తాగునీరు అందించేప్రాజెక్ట్ తో ఆటలాడుతూ, నన్నెవరూ ఏమీపీకలేరంటూ మేకపోతు గాంభీర్యంతో బీరాలుపోతున్న జగన్ రెడ్డి కోరలుపీకడానికి రాష్ట్రరైతాంగం నాగళ్లు, గొర్రులు, చర్నాకోళ్లతో సిద్ధంగాఉంది.
మొన్నటివరకు రాష్ట్రజలవనరుల మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన బెట్టింగ్ బాబు, ప్రతిపక్షం ప్రజలుఎప్పుడు ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించినా అవహేళనలు, అతివాగుడుతోనే కాలయాపన చేశాడు. పోలవరాన్ని మీముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏంచేస్తారని అసెంబ్లీసాక్షిగా ప్రశ్నించిన ప్రతిపక్షానికి, అడ్డూఅదుపూలేని నోటితో అసువుగా అబద్ధాలుచెప్పాడు.

ఒకసారేమో 2021 జూన్ నాటికి ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామని, మరోసారి 2021 డిసెంబర్ అని, మూడోసారేమో 2022 ఏప్రియల్ నాటికని, అంతిమంగా 2023 ఖరీఫ్ నాటికని మంత్రి అనిల్.. ముఖ్యమంత్రి జగన్ నాలుకమడతెట్టేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏదోఒకటి చెప్పేసి, తప్పించుకుంటేసరి పోతుంది…తమనుఎవరు అడగబోయారేమిటన్నట్లు సుందోపసుందు ల్లా వ్యవహరించారు. పోలవరంపై ప్రశ్నించిన ప్రతిసారీ మూడేళ్లు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ అంతాబ్రహ్మండం అంటే, కొత్తగా వచ్చిన అంబటిరాంబాబు అబ్బబ్బో భలేభలే చేశామంటాడేమో చూడాలి.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017-18 ధరలప్రకారం పోలవరం అంచనావ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించగా, 2019 ఫిబ్రవరిలో జలశక్తి ఆధ్వర్యంలోని ఇరిగేషన్, ఫ్లడ్ ఫ్లో కంట్రోల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వయిజరీ కమిటీ 141వ సమావేశంలో ఆ మొత్తానికి ఆమోదం తెలిపారు.

చంద్రబాబునాయుడు ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలన్న ధృఢసంకల్పంతో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని ఏడుముంపుమండలాలను ఏపీలోకలపాలని పట్టుబట్టి, కేంద్రాన్ని ఒప్పించి పనిచేయించుకున్నారు. జగన్ రెడ్డేమో తనచేతగాని తనంతో టీడీపీహాయాంలో ఆమోదింపబడిన రూ.55,548.87కోట్ల అంచనావ్యయాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35,950.16 కోట్లు సరిపోతాయంటే (2017-18 ధరల ప్రకారం) నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప, ఏంటిదని కేంద్రాన్ని ,మోదీని మాటవరసకైనా అడిగిందిలేదు.

పోలవరం నిర్మాణం 2022 ఏప్రియల్ నాటికి పూర్తికావడం కష్టమేనని స్వయంగా కేంద్రజల శక్తిశాఖే చెప్పింది. కేంద్రజలశక్తి మంత్రి షెకావత్ మార్చి3న పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు, ఏమిటీపనులు..ఎందుకింత జాప్యమని నిలదీసింది వాస్తవంకాదా? కేంద్రమంత్రికి ఏంచెప్పాలో తెలియక అనిల్ కుమార్.. జగన్ రెడ్డీ.. ఆయనచుట్టూ తిరుగుతూ, టీడీపీప్రభుత్వంచేసినపనులను, చంద్రబాబునిర్మించిన పునరావాస కాలనీలను తాము పూర్తిచేసినట్లుగాచెప్పుకొని, షెకావత్ ను కాకాపట్టి, ఏదోకానిచ్చేశామన్నట్లుగా పోలవరంపర్యటనను ముగించారు.
నారాలోకేశ్ టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇందుకూరుపేట నిర్వాసిత కాలనీలో సెప్టెంబర్ 1, 2021లో పర్యటించగా, అదే కాలనీనే తానునిర్మించినట్లు ఈముఖ్యమంత్రి కేంద్రమంత్రికి చెప్పుకొని తనపరువు కాపాడుకున్నది నిజంకాదా? ప్రాజెక్ట్ పనుల్లోనే కాదు.. ఆఖరికి నిర్వాసితుల సాయంలో కూడా జగన్ రెడ్డి జంపింగ్ జపాంగ్ లు ఆడాడు. లక్షా07వేల నిర్వాసితకుటుంబాలకు పరిహారం ఇచ్చిఆదుకోవాల్సి ఉండగా… అన్నికుటుంబాలకు ఎక్కడసాయం చేస్తామని భావించిన జగన్ రెడ్డి ఏకంగా పోలవరం ఎత్తుకు ఎసరుపెట్టాడు.

ప్రాజెక్ట్ ఎత్తుని కాస్తతగ్గిస్తే మా భద్రాచలానికి కూడా మంచిదని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, దానికి జగన్ రెడ్డి డూడూబసవన్నలా తలూపాడు. అదేంటి మారాష్ట్రం లో నిర్మించే గొప్పప్రాజెక్ట్ విషయంలో మీజోక్యమేంటి అనేమాట ఈ ప్రబుద్ధుడి నోటినుంచి రాలేదు. అప్పుడే అర్థమైంది….రాష్ట్ర రైతాంగానికి ఈముఖ్యమంత్రి పంగనామాలు పెట్టడానికి సిద్ధమయ్యాడని. వాస్తవంగా పోలవరాన్ని 45.72 మీటర్లఎత్తులో194 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించాలి.

అలానిర్మిస్తే 250గ్రామాల్లోని 89వేలనిర్వాసితకుటుంబాలకు రూ.29వేలకోట్లవరకు చెల్లించాలి. నిర్వాసితులను ఆదుకోవడంఇష్టంలేక, కేసీఆర్ కు భయపడి, ప్రాజెక్ట్ ను గతంలో అనుకున్నట్లుగా ఎత్తు తగ్గించకుండా పూర్తిచేసేధైర్యంచేయలేక, బహుళార్థసాధక ప్రాజెక్ట్ ను బ్యారేజీగా మార్చేందుకు రెడీ అయ్యాడు. 45.72 మీటర్లఎత్తుని 41.15 మీటర్లకుకుదించి, 194 టీఎంసీల నీరునిల్వఉండాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని , కేవలం 115 టీఎంసీలకే జగన్మోహన్ రెడ్డి పరిమితంచేయనున్నారు.

ప్రాజెక్ట్ ఎత్తుని 41.15 మీటర్లకు పరిమితంచేస్తే, దానిలో 115టీఎంసీలకంటే ఎక్కువ నీటిని నిల్వచేయలేము. ఆ నీటినిల్వతో రాష్ట్రానికి, రైతాంగానికి ఒనగూరేప్రయోజనం శూన్యం. 115టీఎంసీలు అనేది మినిమమ్ డ్రాయింగ్ లెవల్. ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లుగాఉంచి, 190 టీఎంసీల నీటిని నిల్వచేస్తేనే, గతంలో చంద్రబాబుగారు అనుకున్నవిధంగా గోదావరినీటిని రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తరలించడానికి వీలవుతుంది.

ప్రాజెక్ట్ ఎత్తుకి ఎసరు పెట్టడంతోపాటు, నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టారు…
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు. పాదయాత్రసమయంలో పోలవరం నిర్వాసితుల వద్దకువెళ్లి తానుముఖ్యమంత్రి అయ్యాక నిర్వాసితులంతా నిండాడబ్బులో మునుగు తారంటూ అరచేతిలో వైకుంఠంచూపించాడు. తానుఅధికారంలోకివస్తే ఎకరాకు రూ.19లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. 8 మండలాలు, 222 రెవెన్యూగ్రామాలు వరద కారణంగా ఎఫెక్ట్ అయితే, ఆయాగ్రామాల్లోని నిర్వాసితులను ఎక్కడికి తరలించి, ఎందరికి ఇళ్లుఇచ్చారో సమాధానంచెప్పగలరా? రూ.550కోట్లు నిర్వాసితులకు ఇస్తున్నట్లు గతంలో ప్రగల్భాలుపలికి ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. ఒకవైపు నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం నిర్వాసితుల ఖాతాల్లోని పరిహారం దోచుకుంటున్నారు.

పరిహారం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న వేలాదిగిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం సిగ్గుచేటు. కాఫర్ డ్యామ్ నిర్మించే లోపు 17 వేల కుటుంబాలను 2020 జులై నెలాఖరుకు లేదా ఆగస్టు మొదటి వారానికి తరలించబోతున్నట్లు జూన్29, 2020న మాజీమంత్రి అనిల్ చెప్పింది నిజంకాదా? . ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని చెప్పలేదా?

2021 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనిచెబుతున్నవారు, ఇప్పటి వరకూ భూసేకరణ, సహాయపునరావాస కార్యక్రమాలను కొలిక్కితీసుకురాలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) చెప్పలేదా?
దానిపై ప్రభుత్వం వద్ద సమాధానంలేదు. నిర్వాసితులకు సంబంధించి, రాష్ట్ర సహాయ పునరావాస కమిషనర్‌ను ఎన్నిసార్లు అడిగినా వివరాలివ్వడం లేదని పీపీఏ (పోలవరంప్రాజెక్ట్ అథారిటీ) సీఈవో డిసెబర్ 31, 2020న చెప్పలేదా? ఇలా అనేకవేళ్లు పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వం చేసిన అన్యాయాన్నిఎత్తిచూపుతూనేఉన్నాయి.

ముఖ్యమంత్రై మూడేళ్లు అయినానిర్వాసితుల ముఖాన మూడురూపాయిలు కూడా ఇచ్చిందిలేదు. తమకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ప్యాకేజీ ఇవ్వకుండా ముంపుప్రాంతాలనుంచి తమను ఎలాఖాళీచేస్తారంటూ నిర్వాసితులంతా ఆగ్రహావేశాలతో మంత్రి అనిల్ కుమార్ జూన్ 2, 2021 నఅడ్డుకున్నది నిజంకాదా? రూ.550కోట్లు నిర్వాసితులకు ఇస్తున్నట్లు గతంలో ప్రగల్భాలుపలికిన జగన్ రెడ్డి, బెట్టింగ్ మంత్రి పైసాకూడా వారికిచ్చిందిలేదు.

గోకవరం ప్రాంతంలోని నిర్వాసితులు మొన్నటివరకు పరిహారం కోసం నెలలతరబడి ధర్నాలుచేసి, గొంతుచించుకున్నా వారి గోడు ప్రభుత్వానికి పట్టలేదు. ఆఖరికి పోలవరంపర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రిని కలవడానికి వారుచేసిన ప్రయత్నంకూడా పోలీసులపరదాలమాటునే మగ్గిపోయింది వాస్తవంకాదా?
జగన్ రెడ్డి దోపిడీ, అవినీతి, చేతగానితనమే పోలవరం ప్రాజెక్ట్ కుశాపంగా మారాయనడం నూటికివెయ్యిశాతంనిజం. తెలుగుదేశంప్రభుత్వం అధికారంలో ఉండి, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే, 2020 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిచ్చి, దాని ఫలాలు రాష్ట్రప్రజలకు పంచేవారు.
కాని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుడు పూర్తిచేస్తాం, ఇప్పుడు పూర్తి చేస్తామంటూ ప్రజలను మాయ మాటల్లో ముంచుతున్నారు.