– మైనింగ్ రంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు
– ప్రభుత్వానికి మైనింగ్ ఆదాయాన్ని పెంచేందుకు గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సంస్కరణలను అమలులోకి తెచ్చాం
– కొత్త విధానం ద్వారా లీజు అనుమతులు మరింత సరళతరం చేశాం
– ఈ-వేలం ద్వారా ప్రతిఒక్కరూ మైనింగ్ రంగంలో ప్రవేశించే అవకాశం కల్పించాం
– లీజుల కేటాయింపులో అత్యంత పారదర్శకత అమలు చేస్తున్నాం
– ‘ముందుగా దరఖాస్తు’ పేరుతో ఏళ్ళ తరబడి క్వారీయింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానంకు చెక్ పెట్టాం
– ఔత్సాహికులు మైనింగ్ రంగంలోకి ప్రవేశించేలా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చాం
– లీజుదారుల రక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నిబంధనలను రూపొందించాం
– ప్రస్తుత లీజుదారులకు ఏడాది పాటు గడువు పొడిగింపు వర్తింప చేస్తున్నాం
– ఈ-ఆక్షన్ లో పాల్గొనేందుకు ఆస్తకి ఉన్న వారందరికీ అందుబాటులో ఎన్ఓసిలతో సహా ఖనిజ లభ్యత ఉన్న ప్రాంతాల వివరాలు తెచ్చాం
– ఎక్కువ మైనింగ్ కార్యక్రమాలతో ప్రభుత్వానికి రెవెన్యూ మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నాం
– డిఎంజి విజి వెంకటరెడ్డి
1. గతంలో మైనింగ్ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. పలుకుబడి కలిగిన వ్యక్తులే మైనింగ్ రంగాన్ని శాసించేవారు. కొత్తవారు మైనింగ్ రంగంలోకి వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. 1966లో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన చిన్నతరహా ఖనిజ నియమావళి వల్ల తరువాత కాలంలో మైనింగ్ రంగంలో ఔత్సాహికులు ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 55ఏళ్ళ కిందట రూపొందించిన ఈ నియమావళిని ఆనాడు మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ప్రోత్సాహకరంగా ఉంచేందుకు రూపొందించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజుల కేటాయింపులు అనే విధానంను అమలు చేశారు. ఈ విధానం వల్ల గని లీజులకు దరఖాస్తు చేయడం, తరువాత దానిలో క్వారీయింగ్ ను ప్రారంభించడంలో విపరీతంగా జాప్యం చేయడం వంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రభుత్వాదాయానికి కూడా చాల నష్టం కలుగుతుంది. ఈ విధానాలకు చెక్ పెడుతూ సీఎం వైయస్ జగన్ మార్పులను తీసుకువచ్చారు. గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చాం.
2. మైనింగ్ రంగంలో నిబంధనలను సరళతరం చేస్తూ, ఒక పారదర్శక విధానం ద్వారా ప్రతి ఒక్కరూ మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ వేలం (ఈ-ఆక్షన్) ద్వారా రాష్ట్రంలోని ఖనిజ వనరుల మైనింగ్ కోసం ఉత్సాహం ఉన్న ఎవరైనా సరై లీజులు పొందే విధానంను తీసుకువచ్చారు. గనులశాఖలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల ఇప్పటి వరకు లీజు అనుమతుల కోసం దరఖాస్తులను దాఖలు చేసి, వాటిలో క్వారీయింగ్ చేసేందుకు ఎల్ ఓ ఐ, ఈసి, ఇతర అనుమతులు తీసుకోకుండా ఏళ్ళ తరబడి తాత్సారం చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లయ్యింది. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల అటు మైనింగ్ పనులు ప్రారంభమయ్యేందుకు పది నుంచి ఇరవై ఏళ్ళ సమయం కూడా పట్టే పరిస్తితికి ఈ తాజా నిబంధనల వల్ల విముక్తి లభించింది.
2. ఇప్పటికే గనుల లీజులు పొంది క్వారీయింగ్ నిర్వహిస్తున్న వారు, పట్టాభూముల్లో మైనింగ్ లీజులతో క్వారీయింగ్ చేస్తున్న వారు, అటవీభూముల్లో లీజు అనుమతులు ఉన్న వారి ప్రయోజనాలను కూడా కాపాడుతూ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం లీజు అనుమతులతో క్వారీయింగ్ చేస్తున్న వారికి వచ్చే ఏడాది వరకు Deemed Extention పొందే అవకాశంను ప్రభుత్వం కల్పించింది. లీజుదారుల అనుమతి గడువు ముగిసిన తరువాత ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ భూముల్లో ఖనిజాలకు వేలంలో ఎంత విలువ నిర్ధారణ అవుతుందో దానిని చెల్లిస్తే, వారికే లీజు అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
3. లీజుదారులకు ఇటువంటి రక్షణ ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వంతో పాటు ఏ రాష్ట్రప్రభుత్వం కూడా కల్పించలేదు. మైనింగ్ రంగంలో ఉన్న వారిని ప్రోత్సహించడం, అదేక్రమంలో ఒక పారదర్శక విధానంను అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
4. ప్రస్తుతం దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. మైనింగ్ అవసరాలు పెరిగాయి. మైనింగ్ రంగం కూడా ప్రముఖ ఆర్థిక శక్తిగా మారింది. గతంలోని నిబంధనల వల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మైనింగ్ రంగంలోకి రాలేని పరిస్థితుల్లో వీటిని మార్చాల్సిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది.
2015లో పెద్ద తరహా ఖనిజాలకు సంబందించి గనుల కేటాయింపులలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనలను అనుసరించేందుకు వీలుకల్పించింది.
5. ఆయా రాష్ట్రాల్లో కొత్త నిబంధనల అమలు వల్ల ఏర్పడిన పరిణామాలను గమనించిన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నిబంధనలను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ముందుగా వచ్చిన వారికే ముందుగా లీజుల కేటాయింపు అనే విధానంను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖనిజ వనరులను గనులశాఖ ద్వారా గుర్తించి, వాటిలో క్వారీయింగ్ చేసే ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ-వేలం విధానంను అమలులోకి తీసుకువచ్చింది. దీనివల్ల మైనింగ్ రంగంలోకి రావాలని అనుకునే ఎవరైనా సరే ఎటువంటి అవాంతరాలు లేకుండా సులువుగా ప్రవేశించేందుకు వీలు కలుగుతోంది.
6. అంతేకాదు గతంలో ఖనిజ వనరులు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం, వాటికి ఎన్ఓసిలు తీసుకునేందుకు వివిధ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడం, తరువాత సదరు మైనింగ్ క్వారీలకు లీజులు తెచ్చుకోవడం ఒక ప్రహాసనంగా ఉండేది. ఇదేక్రమంలో మైనింగ్ అనుమతులకు ఒక పారదర్శక విధానం లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అవినీతి, రెడ్ టేపిజం పెరిగిపోయన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రంలో కొత్త విధానంను తీసుకువచ్చింది.
7. ఎలక్ట్రానిక్ వేలం (ఈ-ఆక్షన్) ద్వారా ఎవరైనా మైనింగ్ అనుమతులు పొందే వీలు కల్పించింది. దీనివల్ల కొందరు వ్యక్తుల గుత్తాధిపత్యం నుంచి మైనింగ్ రంగానికి విముక్తి లభించింది. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను ఉత్సాహం ఉన్న వారు వెలికితీసే వీలు కల్పించడం వల్ల అటు పారిశ్రామిక అవసరాలను తీర్చే వెసులుబాటు ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కువ క్వారీలు వినియోగంలోకి రావడం వల్ల అటు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అంతేకాదు మైనింగ్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర అవసరాలే కాదు, అవసరమైతే జాతీయ స్థాయిలో ఖనిజాలను అందించగలిగే రాష్ట్రంగా ఎదుగుతాం.
8. గనులశాఖే స్వయంగా ఖనిజ ప్రాంతాలను గుర్తించి వాటికి ఎన్ఓసిలు రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న మీదట ఆయా ప్రాంతాలకు ఈ-వేలం నిర్వహిస్తుంది. అంటే గతంలో ఎన్ఓసిల కోసం తహాసీల్దార్ వారి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు ఉండదు. అంతిమంగా ఒక పారదర్శక విధానం, ప్రభుత్వానికి ఆదాయం, మైనింగ్ మాఫియాకు చెక్ పెట్టడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మైనింగ్ రంగంలోకి ఆహ్వానించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఖనిజ ఆధారిత పరిశ్రమలకు ఊతం ఇవ్వడం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుకోవడం దిశగా సీఎం వైయస్ జగన్ నూతన మైనింగ్ నిబంధనలకు శ్రీకారం చుట్టారు.
కొత్త మైనింగ్ ఈ-ఆక్షన్ విధానం – మార్గదర్శకాలు:
– ఈ ఆక్షన్ విధానం ప్రభుత్వ భూములకు మాత్రమే వర్తిస్తుంది. అటవీ, ప్రైవేటు పట్టాభూములకు పాత విధానం కొనసాగుతుంది.
– ప్రస్తుతం ఉన్న లీజుదారుల లీజు గడువు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. గడువు పూర్తి అయిన తరువాత ఈ-ఆక్షన్ విధానం వర్తిస్తుంది.
– లీజుదారుల రక్షణ కోసం ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజ్ కింద లీజుదారుల అనుమతి గడువు ముగిసిన తరువాత ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ భూముల్లో ఖనిజాలకు వేలంలో ఎంత విలువ నిర్ధారణ అవుతుందో దానిని చెల్లిస్తే, వారికే లీజు అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– పెండింగ్ ఉన్న అన్ని రెన్యువల్ లీజుల కాలపరిమితి ఏడాది కాలం వరకు పొడిగించడం జరుగుతుంది.
ఈ-ఆక్షన్ – విధి విధానాలు:
1. వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు, సొసైటీలు ఎవరికైతే నెట్ వర్త్ రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందో… వారందరూ ఈ-ఆక్షన్ లో పాల్గొనవచ్చు.
2. రిజిస్టర్డ్ కోఆపరేటీవ్ సొసైటీలకు వారికి సంబంధించిన మండల పరిధిలో ఆక్షన్ లో పాల్గొన్నప్పుడు నెట్ వర్త్, బిడ్ సెక్యూరిటీలో 50%రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
3. బిడ్ సెక్యూరిటీ టెండరు వేయడానికి రూ.3 నుంచి రూ.5 లక్షలు ఉంటుంది. లేదా బ్లాక్ డెడ్ రెంట్ కు సమానమైన మొత్తం ఉంటుంది. ఏది ఎక్కువ అయితే అది వర్తిస్తుంది.
4. టెండర్లను ఆహ్వానిస్తూ డిఎంజి నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తరువాత ఔత్సాహిక వ్యక్తులు, సంస్థలు క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే వారికి అవకాశం ఇవ్వబడుతుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి టెక్నికల్ గా అర్హత పొందిన వారి జాబితాను ప్రకటిస్తాం.
5. ఆ విధంగా ప్రకటించిన అర్హత ఉన్న వారిలో 5గురు కానీ లేదా జాబితాలో ఉన్న వారిలో 50% ఏది ఎక్కువ అయితే ఆ సంఖ్య ప్రకారం వారిని బిడ్డింగ్ చేయడానికి అనుమతిస్తాం.
6. ఎవరైతే ఎక్కువ మొత్తం కోట్ చేస్తారో వారిని ప్రిఫర్డ్ బిడ్డర్ కింద ప్రకటిస్తాం.
7. ఈ ప్రిఫర్డ్ బిడ్డర్ ఆ మొత్తాన్ని పదిహేను రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
8. ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన తరువాత డిడిఎంజి లేదా డిఎంజి కానీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తూ ప్రిఫర్డ్ బిడ్డర్ ను మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతులు సమర్పించాల్సిందిగా కోరతారు. దీనికి మూడు నుంచి అయిదు సంవత్సరాల గడువు ఇవ్వడం జరుగుతుంది.
9. ఈ అనుమతులు సమర్పించిన మీదట మైనింగ్ లీజులు మంజూరు చేయబడును.
ఈ -ఆక్షన్ నిర్వహనకు డిపార్ట్ మెంట్ ప్రణాళిక:
మొదటి దశ:
సుమారు 900 బ్లాక్ లు ఏవైతే రెవెన్యూ అనుమతులు ఉండి, డిపార్ట్ మెంట్ తనిఖీలు పూర్తయ్యి, డిజిపిఎస్ సర్వే మ్యాప్ లు సిద్దంగా ఉన్నాయో వాటికి ఈ-ఆక్షన్స్ నిర్వహిస్తాం.
రెండో దశ:
రెవెన్యూ అనుమతులు ఉన్న 1979 బ్లాక్ లకు తనిఖీలు నిర్వహించి, డిజిపిఎస్ మ్యాప్ లు సిద్దం చేసి వాటికి ఈ- ఆక్షన్ నిర్వహిస్తాం.
మూడోదశ:
9416 బ్లాక్ లకు రెవెన్యూ అనుమతులు తీసుకుని, తనిఖీలు నిర్వహించి, డిజిపిఎస్ మ్యాప్ లు సిద్దం చేసి వాటికి ఈ- ఆక్షన్ నిర్వహిస్తాం.