ఏలూరు: West Godavari జిల్లాలో ర్యాష్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న Driver ను ఆపినందుకు Constableపై ఆ వ్యక్తి దాడికి దిగాడు. విచక్షణరహితంగా కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంకి చెందిన బొబ్బనపల్లి సంతోష్ కారును అతి వేగంగా నడుపుతున్నాడు.ఈ విషయాన్ని గమనించిన ట్రాపిక్ కానిస్టేబుల్ కారును ఆపాడు. అయితే కానిస్టేబుల్
కారు ఆపుతున్నా బొబ్బనపల్లి సంతోష్ కారును కొద్ది దూరంలో ఆపాడు.
అయితే సంతోష్ మద్యం తాగాడా అనే విషయమై కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించాడు. ఈ సమయంలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ పై సంతోష్ దాడికి దిగాడు. సంతోష్ విచక్షణ రహితంగా కానిస్టేబుల్ కుమార్ పై దాడి చేశాడు. కానిస్టేబుల్ కుమార్ కూడా ప్రతిఘటించారు.
అయితే ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.. తనపై దాడి చేసిన సంతోష్ ను కానిస్టేబుల్ కుమార్ స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన సంతోష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.