– దీక్షకు, సహనానికి భగీరథుడు ప్రతిరూపం
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
– టీడీపీ కార్యాలయంలో భగీరథుని జయంతి వేడుకలు
పరోపకారానికి, సహనానికి భగీరథుడు పెట్టింది పేరు అని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో భగీరథుని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాదరబోయిన ఏడుకొండులు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ..భగీరథుని స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. తాను అనుకున్నది సాధించిన గొప్ప వ్యక్తి అని, చితా భస్మం అయిన తన పూర్వికులకు సద్గతి కలిగించేందుకు కఠోర తపస్సు చేసి పవిత్ర గంగను భూమి మీదకు తెచ్చారని కొనియాడారు. అనంతరం సాదరబోయిన ఏడుకొండులు మాట్లాడుతూ..భగీరథుని జయంతిని గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా చంద్రబాబు ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు.
సగర కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి తమ అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. నేడు సగర కార్పొరేషన్ చైర్మన్ పదవులు అలంకార ప్రాయంగానే ఉన్నాయన్నారు. నిధులు కేటాయించకుండా సగరలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో సగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జంపనార వీర శ్రీనివాస్, సగర ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ గుంటు శ్రీకాంత్, కొండా రమాదేవి, కర్నాటి సత్యనారాయణ, కల్వకొల్లు గోపిబాబు, జూటు ఆదినారాయణ, రెడ్డి సుబ్బారావు, ఖడ్గ శ్రీనివాసరావు, సగర సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.