– జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు
– 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్ కు అర్థం అయ్యింది
– ప్రతి సారీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ బలహీనతకు నిదర్శనం
– గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించండి
– టీడీపీ నేతలతో ఆన్ లైన్ సమావేశంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
– ముఖ్య నేతలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు సమావేశం
అమరావతి:-రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసమర్థ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అయ్యిందన్న విషయం తన టూర్లకు వచ్చిన స్పందన ద్వారా స్పష్టం అయ్యిందని చంద్రబాబు అన్నారు. 2024లో టీడీపీకి అధికారం అనేది చారిత్రిక అవసరం అని ప్రజలే భావిస్తున్నారని అన్నారు.
2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్ కు పూర్తిగా అర్థం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, జగన్ పోకడలను చూస్తే 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అవనున్నాయని అన్నారు. జగన్ తాను పులి అని చెప్పుకుంటారని…కానీ జగన్ పిల్లి అంటూ చంద్రబాబు అన్నారు. పిల్లి కాబట్టే భయంతో జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటారని వ్యాఖ్యానించారు.ఇకపోతే వైసీపీ తన బలహీనతలను అధిగమించడానకి డైవర్షన్ పాలిటిక్స్ ను ఎప్పుడూ అమలు చేస్తుందని చంద్రబాబు అన్నారు.
భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అన్న స్లోగన్స్ ను జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్న తన వ్యాఖ్యలను…. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని చంద్రబాబు అన్నారు. వైసీపీ మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ను తన విధానంగా పెట్టుకుందని…. తన పర్యటనలకు అనూహ్య స్పందన రావడంతో వైసీపీ డైవర్షన్ డ్రామా మొదలు పెట్టిందని అన్నారు.
ముఖ్యనేతలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్టీ మండల, డివిజన్ స్థాయి అధ్యక్షులతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం ద్వారా మాట్లాడారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న స్పందనను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ శాసనసభా పక్షం ఉపనేత నిమ్మల రామానాయుడు నేతలకు వివరించారు. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో చంద్రబాబు టూర్లకు స్పందన వస్తుందని తెలిపారు.
ముఖ్యంగా యువతలో అనూహ్య స్పందన కనిపిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అవసరం అనేది ప్రజలు గుర్తించారని…అధినేత టూర్ తో రాష్ట్రంలో పొలిటికల్ వైబ్రేషన్ వచ్చిందని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం, అధినేత పర్యటన స్పందనతో వైసీపీ ఉలిక్కి పడిందన్నారు.
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని మండల అధ్యక్షులకు సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
పులివెందులలో ఎస్సీ కాలనీలో తాగునీరు ఇవ్వలేని ఘటన అక్కడి పరిస్థితి అద్దం పడుతోందని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యనేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, మండల, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.